Begin typing your search above and press return to search.

మయాంక్ యాదవ్ దెబ్బ.. బెంగళూరు బ్యాటర్స్ అబ్బా!:

ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్‌... ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

By:  Tupaki Desk   |   3 April 2024 3:45 AM GMT
మయాంక్  యాదవ్  దెబ్బ..  బెంగళూరు బ్యాటర్స్  అబ్బా!:
X

ఐపీఎల్ 17 సీజన్‌ లో భాగంగా 15వ మ్యాచ్ బెంగళూరు, లఖ్‌ నవూ మధ్య రసవత్తరంగా జరిగింది. ఈ మ్యాచ్ లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. మనం ముందుగా భావించినట్లుగానే అందరికళ్లనూ తనవైపు తిప్పుకునేలా చేసుకోవడంలో తన రెండో మ్యాచ్ లోనే రెండోసారి సక్సెస్ అయ్యాడు మయాంక్ యాదవ్. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్‌... ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

దూకుడుగా మొదలుపెట్టిన లఖ్ నవూ!:

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లఖ్ నవూ తరుపున క్వింటన్ డీకాక్, కేఎల్ రాహుల్ లు క్రీజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సమయంలో వచ్చీ రాగానే బ్యాట్ ఝులిపించడం మొదలుపెట్టాడు క్వింటన్ డీకాక్. ఇందులో భాగంగా... రీస్ టాప్లీ వేసిన మొదటి ఓవర్ లో మూడు బౌడరీలు సాధించాడు. దీంతో.. తొలి ఓవర్ ముగిసే సరికి లఖ్ నవూ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 12 పరుగులతో మొదలైంది.

మూడో ఓవర్ లో వరుసగా రెండు సిక్స్ లు!:

లఖ్‌ నవూ ఓపెనర్ క్వింటన్ డికాక్‌ దూకుడుగా ఆడుతున్నాడు. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన మూడో ఓవర్‌ లో 4, 5 బంతులను వరుసగా సిక్సర్ లుగా మలిచాడు. దీంతో అతడి వ్యక్తిగత స్కోరు 29 (13 బంతుల్లో) కాగా... మూడు ఓవర్లు ముగిసే సరికి లఖ్ నవూ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 32 కు చేరింది.

జోరు పెంచుతున్న రాహుల్ కు చెక్‌ పెట్టిన మ్యాక్స్‌ వెల్!

ఐదో ఓవర్ ఐదో బంతికి సిక్స్ కొట్టి జోరు పెంచుతున్నట్లు కనిపించిన కేఎల్ రాహుల్ ను మ్యాక్స్ వెల్ బోల్తా కొట్టించాడు. ఇందులో భాగంగా... మ్యాక్స్‌ వెల్ వేసిన ఆరో ఓవర్‌ లో రెండో బంతికి సిక్స్ బాదిన రాహుల్.. తర్వాతి బంతికే ఔటయ్యాడు! దీంతో పవర్ ప్లే ముగిసే సరికి లఖ్ నవూ స్కోరు వికెట్ నష్టానికి 54 పరుగులు.

లఖ్‌ నవూ రెండో వికెట్ డౌన్!:

సిరాజ్ వేసిన 9వ ఓవర్ ఐదో బంతికి పడిక్కల్ (6) ను ఔట్ చేశాడు. ఇక మయాంక్ దగార్ 10 ఓవర్లో 11 పరుగులు రాబట్టారు. దీంతో... సగం ఓవర్లు పూర్తయ్యే సరికి లఖ్ నవూ స్కోరు 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు.

డీకాక్ 50.. లఖ్ నవూ 100!:

మయాంక్ దగార్‌ వేసిన 12 ఓవర్లో నాలుగో బంతికి బౌండరీ బాదిన డీకాక్ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో ఇది ఐపీఎల్‌ లో క్వింటన్ డీకాక్ కి 22వ హాఫ్‌ సెంచరీ కావడం గమనార్హం. ఇదే ఓవర్ లో చివరి బంతికి డికాక్ సిక్స్ బాదడంతొ.. లఖ్ నవూ స్కోరు 100 దాటింది. దీంతో... 12 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి లఖ్ నవూ స్కోరు 102 పరుగులులకు చేరింది.

లఖ్‌ నవూ మూడో వికెట్:

మ్యాక్స్ వెల్ మరోసారి మ్యాజిక్ చేశాడు. తాను వేసిన 14 ఓవర్‌ లో తొలి బంతికి సిక్స్ బాదిన స్టాయినిస్ ను ఐదో బంతికి ఔట్ చేశాడు. దీంతో 14 ఓవర్లు పూర్తయ్యే సరికి లఖ్ నవూ స్కోరు 3 వికెట్ల నష్టానికి 129 పరుగులకు చేరుకుంది.

క్వింటన్ డికాక్‌ (81) ఔట్!:

రీస్ టాప్లీ వేసిన 17 ఓవర్‌ లో నాలుగో బంతికి క్వింటన్ డీకాక్ వెనుదిరిగాడు. ఒక దశలో సెంచరీ చేస్తాడా అన్నట్లుగా సాగిన అతడి బ్యాటింగ్ కు సెంచరీకి 19 పరుగుల దూరంలో అద్భుతమైన ఇన్నింగ్స్ వద్ద తెరపడింది. ఔట్ అయ్యే సరికి డీకాక్ వ్యక్తిగత స్కోరు 81 (56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్ లు). దీతో లఖ్ నవూ స్కోరు 17 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 143.

ఐదో వికెట్ కోల్పోయిన లఖ్‌ నవూ:

యశ్ దయాల్ వేసిన 18 ఓవర్‌ లో ఆఖరి బంతికి ఆయుష్‌ బదోని (0) డుప్లెసిస్‌ కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం రిసీ టాస్లీ వేసిన 19 వ ఓవర్ లో నికోలస్ పూరన్ దూకుడు పెంచాడు. వరుసగా మూడు సిక్స్ లు బాదాడు. దీంతో 19 ఓవర్లు పూర్తయ్యే సరికి లఖ్ నవూ స్కోరు 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు.

నికోలస్ మెరుపులు... బెంగళూరు టార్గెట్ ఫిక్స్!:

బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌ లో లఖ్‌ నవూ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఇందులో... ఓపెనర్ క్వింటన్ డికాక్ (81) బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేయగా... చివర్లో నికోలస్ పూరన్ చెలరేగాడు. ఇందులో భాగంగా... 21 బంతుల్లో 1 ఫోరు, 5 సిక్స్ ల సాయంతో 40 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు!

ఇక బెంగళూరు బౌలర్లలో మ్యాక్స్‌ వెల్ 2, యశ్ దయాల్, సిరాజ్‌, రీస్ టాప్లీ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు:

లఖ్ నవూ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బెంగళూరు బరిలోకి దిగింది. ఇందులో భాగంగా విరాట్ కొహ్లీ, డుప్లెసిస్ లు క్రీజ్ లోకి దిగారు.

ఈ సమయంలో మొదటి ఓవర్ లో 3, రెండో ఓవర్ లో 10, మూడో ఓవర్ లో 12, నాలుగో ఓవర్ లో 11 పరుగులు చేయడంతో... బెంగళూర్ స్కోరు 4 ఓవర్లకు వికెట్లేమీ నష్టపోకుండా... 36 పరుగులు చేసింది. ఈ సమయంలో కోహ్లీ (18), డుప్లెసిస్‌ (18) పరుగులతో ఆడుతున్నారు.

ఫస్ట్ వికెట్ కోల్పోయిన బెంగళూర్!:

మణిమారన్‌ సిద్ధార్థ్ వేసిన ఐదో ఓవర్‌ లో మొదటి బంతికి బౌండరీ బాదిన విరాట్ కోహ్లీ (22) తర్వాతి బంతికే ఔటయ్యాడు. ఇక బౌలర్ సిద్ధార్థ్ కి ఐపీఎల్ లో ఇది మొదటి వికెట్. దీంతో... బోణీ బాగుందనే కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో... 5 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు స్కోరు ఒక వికెట్ నష్టానికి 42 పరుగులకు చేరింది.

బెంగళూరుకు రెండు వరుస షాక్ లు!:

ఐదో ఓవర్ లో ఓపెనర్ విరాట్ కొహ్లీ ఔటవ్వగా... యువ సంచలనం మయాంక్ అగర్వాల్ వేసిన ఆరో ఓవర్ 4వ బంతికి మరో ఓపెనర్ డుప్లెసిస్ (19) ఔటయ్యాడు.

ఇదే క్రమంలో... అదే ఓవర్ లో మయాంక్ యాదవ్ వేసిన నాలుగో బంతికి పరుగుల ఖాతా తెరవకుండానే మ్యాక్స్‌ వెల్ పెవిలియన్ బాటపట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి బెంగళూరు స్కోరు 3 వికెట్ల నష్టానికి 48 పరుగులు.

మయాంక్ యాదవ్ మరోసారి!:

వేగం, కచ్చితత్వం కలగలిపిన బుల్లెట్ లాంటి బంతులను వేస్తున్న మయాంక్ అగర్వాల్... తను వేసిన 7.4 ఓవర్ లో కామెరూన్‌ గ్రీన్ (9) క్లీన్‌ బౌల్డ్ చేశాడు. దీంతో 8 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు స్కోరు 4 వికెట్ల నష్టానికి 59 పరుగులకు చేరింది.

మయంక్ యాదవ్ సంచలన బౌలింగ్!

ప్రస్తుత మ్యాచ్ లో బెంగళూరుకు మయాంక్ యాదవ్ ఫీవర్ పట్టుకుంది. అతడు బతి అందుకుంటే.. బ్యాటర్స్ తగ్గుతున్నరనే వరకూ వెళ్లింది వ్యవహారం. ఈ క్రమంలో... తాను వేసిన 10 ఓవర్ ను మెయిడిన్ గా మలిచాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వలేదంటే... మయాంక్ బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో సగం ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు స్కోరు 4 వికెట్లకు 63 పరుగులు.

ఐదో వికెట్ కోల్పోయిన బెంగళూరు!:

స్టాయినిస్‌ వేసిన 13 ఓవర్ ఐదో బంతికి అనుజ్‌ రావత్‌ ఔట్‌ అయ్యాడు. దీంతో... 13 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు స్కోరు 5 వికెట్ల నష్టానికి 94 పరుగులకు చేరిది.

మయాంక్‌ యాదవ్‌ మరోసారి!

మయాంక్‌ యాదవ్‌ వేసిన 15 ఓవర్ రెండో బంతికి రజత్ పటీదార్ (29) ఔటయ్యాడు. ఈ ఓవర్ లో కేవలం ఒక్క పరుగే ఇచ్చిన మయాంక్ యాదవ్ 4 ఓవర్లకు 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ సమయంలో 15 ఓవర్లకు బెంగళూరు స్కోరు 6 వికెట్ల నష్టానికి 104 పరుగులు.

బెంగళూరు ఏడో వికెట్... ఫినిషర్ గాన్!:

బెంగళూరును ఏ దశలోనూ కోలుకోనివ్వడం లేదు లఖ్ నవూ బౌలర్లు. ఈ క్రమంలో... నవీనుల్ హక్‌ వేసిన 16.5 ఓవర్‌ కు దినేష్ కార్తీక్ (4) ఔటయ్యాడు. దీంతో 17 ఓవర్లకు బెంగళూరు స్కోరు 7 వికెట్లకు 136 పరుగులు. అంటే... 18 బంతుల్లో బెంగళూరు విజయానికి 46 పరుగులు కావాలి.

18 ఓవర్లో వరుసగా రెండు వికెట్లు!:

యశ్ ఠాకూర్‌ వేసిన 17.1 బంతిని మహిపాల్ ఎదుర్కొని ఒక పరుగు పూర్తి చేశాడు. అనంతరం రెండో పరుగు ప్రయత్నిస్తున్న క్రమంలో పూరన్‌ డైరెక్ట్ త్రో తో రనౌట్ అయ్యాడు. దీంతో బెంగళూరు 8వ వికెట్ కోల్పోయింది. ఇక ఇదే ఓవర్ 5 బంతికి దూకుడు మీదున్న మహిపాల్ లోమ్రోర్ 33 (13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లు) నికోలస్‌ పూరన్‌ కు క్యాచ్‌ ఇచ్చాడు.

బెంగళూరు ఆలౌట్:

లఖ్ నవూ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. దీంతో... 28 పరుగుల తేడాతో లఖ్‌ నవూ సూపర్‌ విక్టరీ సాధించింది.