Begin typing your search above and press return to search.

ముంబై రోడ్‌ సైడ్ బార్బర్ షాప్‌ లో క్రికెటర్... వీడియో వైరల్!

ప్రస్తుతం ఇండియాలో వరల్డ్ కప్ సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచంలోని క్రికెటర్స్ అంతా ఇండియాకి అతిథులయ్యారు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 7:53 AM GMT
ముంబై రోడ్‌  సైడ్  బార్బర్  షాప్‌  లో క్రికెటర్... వీడియో వైరల్!
X

ప్రస్తుతం ఇండియాలో వరల్డ్ కప్ సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచంలోని క్రికెటర్స్ అంతా ఇండియాకి అతిథులయ్యారు. ఈ సందర్భంగా ఇండియాలోని ఫుడ్ ని, వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ క్రికెటర్, ఇంగ్లాండ్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ముంబయి వీధిలో సందడి చేశాడు. ఇందులో భాగంగా రోడ్డు పక్కన ఉన్న బార్బర్ షాపులో కటింగ్ చేయించుకున్నాడు.


అవును... ఇంగ్లాండ్ క్రికెటర్ మైఖేల్ వాన్ ముంబయి వీధిలో సందడి చేశాడు. ఇందులో భాగంగా రోడ్డుపక్కన ఉన్న బార్బర్ షాప్ లో కటింగ్, షేవింగ్ చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోలను మైకెల్ వాన్ తన ఎక్స్ లో పోస్ట్ చేశాడు. దీపావలి సందర్భంగా ట్రిమ్మింగ్ అండ్ హెడ్ మసాజ్ అని ఆ పోస్ట్ లో రాసుకొచ్చాడు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఐసీసీ 2023 పురుషుల వన్డే వరల్డ్ కప్ ను కవర్ చేయడానికి ప్రస్తుతం మైఖేల్ వాన్ భారతదేశానికి వచ్చారు. ఈ క్రమంలోనే రోడ్‌ పక్కనున్న బార్బర్ షాప్‌ లో కటింగ్, షేవింగ్ చేయించుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో భాగంగా ఆ విషయాన్ని షేర్ చేస్తూ.. తన స్నేహితుడు దీనాజయల్ తో దీపావళి కటింగ్, హెడ్ మసాజ్ చేయించుకున్నట్లు ఆయన చెప్పారు.

బార్బర్ వాన్ కు హెయిర్ ట్రిమ్మింగ్ చేస్తున్నప్పుడు కుర్చీలో కుర్చీలో కూర్చొని ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇదే క్రమంలో... కొన్ని సెకన్ల తర్వాత మైఖేల్ తల, భుజానికి ఆ బార్బర్ మసాజ్ చేయడం వీడియోలో కనిపించింది. ముంబయిలోని ఓర్మిస్టన్ రోడ్‌ వద్ద ఇది జరిగినట్లు వాన్ వెల్లడించాడు.

వాన్ తన ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో లను వేల మంది వీక్షించగా.. వందలమంది కామెంట్లతో స్పందించారు. ఇందులో భాగంగా... "ఖరీదైన షాపుల్లో ప్రొఫెషనల్ గా హెయిర్ కట్ చేసుకోవడం అనేది ఒక భ్రమ మాత్రమే... మీరు రోడ్ సైడ్‌ షాపుల్లో కూడా ఉత్తమంగా హెయిర్ కట్ చేయించుకోవచ్చు" అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా... వాన్ కు పలువురు నెటిజన్లు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదే సమయంలో మరో నెటిజన్ అయితే... వాన్ ని అభినందిస్తూ.. ఇతను ఆధార్ కార్డ్ కి అర్హుడు అని తెలిపాడు. ఇలా వందల కామెంట్లు దీనికి సంబంధించిన వీడియోకి వచ్చాయి. ఇక లైక్ ల సంగతి చెప్పేపనే లేదు!

కాగా... ప్రపంచకప్‌ లో సెమీస్‌ పోరుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బుధవారం తొలి సెమీస్‌ లో న్యూజిలాండ్‌ తో భారత్‌, గురువారం రెండో సెమీస్‌ లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ల కోసం వాంఖడే, ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికలు సిద్ధంగా ఉన్నాయి