Begin typing your search above and press return to search.

ఎంఐ వర్సెస్ ఆర్.ఆర్... హెడ్ టు హెడ్ లెక్కలివే!

ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ ఇచ్చిన స్ట్రోక్ నుంచి తేరుకుని ముంబై ఈ మ్యాచ్ తో బరిలోకి దిగనుంది.

By:  Tupaki Desk   |   1 April 2024 4:04 AM GMT
ఎంఐ వర్సెస్  ఆర్.ఆర్... హెడ్  టు హెడ్  లెక్కలివే!
X

ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ - 2024)లో విజయం సాధించేందుకు కాస్త కష్టపడుతున్నట్లు కనిపిస్తున్న హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్... నేడు రాజస్థాన్ రాయల్స్ లో తలపడనుంది. ఈ రసవత్తర మ్యాచ్ కు ముంబైలోని వాంఖడే స్టేడియం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ ఇచ్చిన స్ట్రోక్ నుంచి తేరుకుని ముంబై ఈ మ్యాచ్ తో బరిలోకి దిగనుంది.

ఈ ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఇండియన్స్ కు గెలుపు ఇప్పటివరకూ అందని ద్రాక్షగా మారింది! ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓటమిపాలైంది. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ పై 6 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఎంఐ.. రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ చేతిలో 31 పరుగులతో ఊహించని షాక్ తగిలించుకుంది!

వరుసగా రెండు మ్యాచ్ లు ఓడినప్పటికీ... రోహిత్ శర్మ సూపర్బ్ టచ్ లో ఉండటం ఇప్పుడు ఆ టీం కు ప్రధాన బలంగా ఉండగా.. తిలక్ వర్మ, టిం డేవిడ్ లు కూడా భీకర ఫాం లో ఉండటం, ఇషాన్ కిషన్ కూడా ఫాం అందుకోవడంతో ఆ జట్టుకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇదే క్రమంలో బౌలింగ్ విభాగంగా జస్ ప్రీం బుమ్రా రాణిస్తున్నాడు. మరోపక్క మిగిలిన వాళ్లంతా ధారాళంగా పరుగులు ఇస్తున్న పరిస్థితి! మరోపక్క కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ లో భారీగా పరుగులు ఇస్తూ.. బ్యాటింగ్ లోనూ కీలక సమయాల్లో ఔటై నిరాశపరుస్తున్నాడు!

మరోవైపు.. ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ లలోనూ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. మాంచి ఉత్సాహం మీద ఉంది. ఇందులో భాగంగా... ఫస్ట్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను 20 పరుగుల తేడాతో.. నెక్స్ట్ మ్యాచ్ లో ఢిల్లీను 12 పరుగుల తేడాతో ఓడించింది. ఇలా ఒకరు హ్యాట్రిక్ విజయం కోసం.. మరొకరు బోణీ కోట్టడం కోసం జరగనుండటంతో... ఆసక్తి నెలకొంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్:

ఐపీఎల్ టోర్నమెంట్స్ లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకూ 28 సార్లు తడబడ్డాయి. వీటిలో ముంబై ఇండియన్స్ 15 సార్లు గెలవగా.. రాజస్థాన్ రాయల్స్ 12 సార్లు విజయం సాధించింది. ఇదే క్రమంలొ... ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ పై ముంబై అత్యధిక స్కోరు 214 పరుగులు కాగా... ముంబై పై రాజస్థాన్ రాయల్స్ అత్యధిక స్కోరు 212.

పిచ్ రిపొర్ట్:

వాస్తవానికి ముంబైలోని వాంఖడే స్టేడియం బ్యాటింగ్ కు అద్భుతంగా సహకరించేదిగా ఉండగా.. ఛేజింగ్ జట్టుకు మరింత అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇదే క్రమంలో స్లో బౌలర్స్ కి అంత సహకరించే అవకాశాలు తక్కువగా ఉన్నా.. కొత్త బంతితో ఫుల్ స్వింగ్ అండ్ బౌన్స్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.