Begin typing your search above and press return to search.

ఐపీఎల్.. ఆ 2 జట్ల.. ఇద్దరు పెద్దన్నల పవర్ మిస్..లీగ్ కు బిగ్ లాస్

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ దిగ్గజ ట్లుగా చెప్పొచ్చు. చెరో రెండేసి సార్లు టైటిల్ కొట్టిన రికార్డు వీటిది.

By:  Tupaki Desk   |   31 March 2025 6:30 PM
ఐపీఎల్.. ఆ 2 జట్ల.. ఇద్దరు పెద్దన్నల పవర్ మిస్..లీగ్ కు బిగ్ లాస్
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17 సీజన్లు ప్రేక్షకులను ఆకట్టుకుందంటే..? సీజన్ సీజన్ కు అభిమానం చెక్కుచెదరలేదంటే..? రెండు పెద్ద జట్ల పాత్ర ఉందని అనుకోవాలి.. ఆ జట్లే కాదు ఆ జట్లను తీర్చిదిద్దిన కెప్టెన్ల పాత్ర కూడా ఉందని భావించాలి. అయితే, ఈ సీజన్ లో చూస్తే ఇదంతా కొట్టుకుపోతోంది. ఆ ఇద్దరు ఆటగాళ్ల కెరీర్ ముగియనుండడంతో ఆ జట్ల ప్రాభవం కూడా పడిపోతోంది.

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ దిగ్గజ ట్లుగా చెప్పొచ్చు. చెరో రెండేసి సార్లు టైటిల్ కొట్టిన రికార్డు వీటిది. మరే జట్టుకూ అది సాధ్యం కాలేదు. అయితే, ఈ సీజన్ లో ఈ రెండు జట్ల ప్రదర్శన నానాటికీ పడిపోతోంది. ఫలితంగా లీగ్ తమ అతిపెద్ద పవర్ హౌస్ లను కోల్పోతోంది.

ఐపీఎల్ మొత్తం 17 సీజన్లలో 10 సీజన్లు ముంబై, చెన్నైలే విజేతలు. కానీ, ఈ సీజన్ లో వీటిలో ఏ జట్టు అయినా టైటిల్ కొడుతుందా? అంటే చెప్పలేని పరిస్థితి. మ్యాచ్ మ్యాచ్ కు వీటి ప్రదర్శన పడిపోతోంది.

ముంబై ఇప్పటికే టైటిల్ గెలిచి నాలుగేళ్లు అయిపోయింది. చెన్నై 2023లో త్రుటిలో టైటిల్ కొట్టింది. ఇప్పుడు చూస్తే.. ముంబై తొలి రెండు మ్యాచ్ లలోనూ ఓడింది. చెన్నై మూడు ఆడి రెండింట్లో ఓడింది. ఇవి ఓడడం కంటే ఓడిన తీరే దారుణంగా ఉంది.

చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బహుశా ఇది చివరి సీజన్. ఈ జట్టులో మరే ఆటగాడు కూడా ఈ లోటును భర్తీ చేయలేడు. ప్రస్తుతం చెన్నై బ్యాటింగ్ గొప్పగా ఏమీ లేదు. బెంగళూరు చేతిలో 50 పరుగుల తేడాతో ఓటమే దీనికి నిదర్శనం.

ముంబై మరీ దారుణంగా ఆడుతోంది. చెన్నై చేతిలో తొలి మ్యాచ్ లో ఓటమిని సరిపెట్టుకున్నా.. రెండో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ మీద కూడా ఓడింది. ఈ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్ ఫామ్ లో లేడు. బహుశా రోహిత్ ఇలాగే ఆడితే పక్కన పెట్టినా ఆశ్చర్యం లేడు.

అందుకే ముంబై, చెన్నై మేల్కొనకుంటే ముప్పు తప్పదు.