Begin typing your search above and press return to search.

ముంబై వర్సెస్ బెంగళూరు... గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో గెలుపెవరిది?

అవును... స్టార్‌ ఆటగాళ్లకు కొదవ లేని ఈ రెండు జట్లకూ ఈ సీజన్లో ఏమాత్రం కలిసి రావడం లేదనే చెప్పాలి

By:  Tupaki Desk   |   11 April 2024 3:55 AM GMT
ముంబై వర్సెస్ బెంగళూరు... గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో గెలుపెవరిది?
X

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా... మరో ఆసక్తికరమైన మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మద్య మ్యాచ్ జరగనుంది. ఈ ఆసక్తికరమైన మ్యాచ్ కోసం ముంబైలోని వాంఖడే స్టేడియం ముస్తాబైంది. ఈ క్రమంలో... ముంబై.. తమ మొదటి మూడు మ్యాచ్‌ లలో ఓడిపోయి ఏప్రిల్ 7న మొదటి విజయాన్ని అందుకోగా.. మరోవైపు ఆర్సీబీ తన ఐదు మ్యాచ్‌ చివరి మూడు మ్యాచ్ లూ వరుసగా ఓడిపోయి ఉంది!

అవును... స్టార్‌ ఆటగాళ్లకు కొదవ లేని ఈ రెండు జట్లకూ ఈ సీజన్లో ఏమాత్రం కలిసి రావడం లేదనే చెప్పాలి. ఈ సీజన్ లో ఆర్సీబీ ఇంకో మ్యాచ్‌ ఓడితే.. తర్వాత పుంజుకుని ప్లేఆఫ్స్‌ రేసులో ముందుకెళ్లడం కష్టమవుతుంది. ఇదే సమయంలో... ముంబయి ఇంకో ఓటమి చవిచూస్తే ఆ జట్టుకూ ఇబ్బందులు తప్పవు. కాబట్టి గెలిచి తీరాల్సిన మ్యాచ్‌ లో ఈ రెండు జట్లూ ఎలా పోరాడతాయి.. చివరికి ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్ మొదటి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ముంబై బ్యాటర్స్ ఫాం లోకి రావడంతో ఢిల్లీపై 235 పరుగులు సాధించింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ లో తిలక్ వర్మ 4 మ్యాచ్ లలో 127పరుగులు.. రోహిత్ శర్మ 118 పరుగులు.. టిం డేవిడ్ 115 పరుగులు సాధించుకున్నారు. వీరు ముగ్గురిలో ఇద్దరు నిలబడినా భారీ స్కోరు ఖాయమనే చెప్పాలి.

ఇక బెంగళూరు విషయానికొస్తే... ఇక్కడ స్టార్ బ్యాటర్ పైనే అందరి కళ్లూ ఉంటాయనడంలో సందేహం లేదు. ఆర్సీబీలో 5 మ్యాచ్ లు ఆడిన విరాట్ కొహ్లీ... 316 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 109, దినేష్ కార్తీక్ 90 పరుగులు సాధించారు. వీరికి తోడు మ్యాక్స్ వెల్ కూడా కాస్త సరైన ఇన్నింగ్స్ ఆడితే బెంగళూరుకు తిరుగుండకపోవచ్చు.

హెడ్-టు-హెడ్ రికార్డ్‌ లు!:

ముంబై, బెంగళూరు జట్లు ఇప్పటి వరకు 32 ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడాయి. వాటిలో ఆర్సీబీ 14 గెలవగా.. ముంబై ఇండియన్స్ 18. ఇదే క్రమంలో... ముంబై ఇండియన్స్ పై బెంగళూరు అత్యధిక స్కోరు 235 కాగా.. బెంగళూరుపై ముంబై అత్యధిక స్కోరు 213.

పిచ్ రిపోర్ట్:

వాంఖడే స్టేడియం సాధారణంగా బ్యాటర్లకు అనుకూలిస్తుంది. ఫలితంగా.. మొదట బ్యాటింగ్ చేసే జట్టు దీన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుని భారీ స్కోరును నమోదు చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ మైదానంలో పేసర్లు ఇప్పటివరకు 887 వికెట్లు తీయగా.. స్పిన్నర్లు 367 పరుగులు చేశారు. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 169 గా ఉంది.