Begin typing your search above and press return to search.

రోహిత్ శర్మపై విమర్శలు... వివాదానికి కారణమైన పిక్ ఇదే!

అవును... టీంఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని ఓ వివాదంలో ఇరుక్కున్నాడు.

By:  Tupaki Desk   |   9 July 2024 9:32 AM GMT
రోహిత్  శర్మపై విమర్శలు... వివాదానికి కారణమైన పిక్  ఇదే!
X

సెలబ్రెటీ స్టేటస్ లో ఉన్నవారు మరి ముఖ్యంగా ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి! మరి ముఖ్యంగా సున్నితమైన అంశాలపై మరింత కేర్ వహించాలి! ప్రపంచ కప్ గెలిచిన అమితానందంలోనో ఏమో కానీ ఆ సందర్భంగా రోహిత్ శర్మ చేసిన ఓ పని ఇప్పుడు వివాదానికి కారణం అయ్యింది. ఫలితంగా... నెటిజన్లు టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అవును... టీంఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. ఇందులో భాగంగా జాతీయ జెండాను అగౌరపరిచాడంటూ కొంతమంది నెటిజన్లు అతడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటువంటి సున్నిత అంశాలపట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. గెలుపు ఆల్ మోస్ట్ అసాధ్యం అనుకున్న ఆ మ్యాచ్ లో టీంఇండియా బౌలర్లు పుంజుకోవడంతో 7 పరుగుల తేడాతో విజయం దక్కింది. దీంతో టీంఇండియా ఆటగాళ్ల తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ జాతీయ జెండాతో సంబరాలు చేసుకున్నాడు.

ఇందులో భాగంగా ఓవల్ మైదానంలో భారతదేశ జాతీయ జెండాను నాటేందుకు ప్రయత్నించాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. ఇదే సమయంలో.. ఆ ఫోటోను హిట్ మ్యాన్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు. ఈ ఫోటోలో త్రివర్ణ పతాకం నేలను తాకింది. దీంతో వివాదం బలంగా మొదలైంది! చాలా మంది నెటిజన్లు ఈ విషయంపై రోహిత్ పై ఫైరవుతున్నారు.

ఈ క్రమంలో... ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971 ప్రకారం... ఉద్దేశ్యపూర్వకంగా జాతీయ జెండాను నేలను తాకకూడదు అని నెటిజన్ రియాక్ట్ అవ్వగా... ఇలాంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని మరొకరు సూచించారు. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందనేది వేచి చూడాలి!