Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాతో మ్యచ్ ముందు పాక్ కు కొత్త కష్టాలు!

ఊహకందని అంచనాల మధ్య మొదలైన ఈ మ్యాచ్ లో మొదటి 10 ఓవర్లు మినహా... తర్వాత మొత్తం అంతా భారత్ ఆధిపత్యం కొనసాగింది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 6:28 AM GMT
ఆస్ట్రేలియాతో మ్యచ్  ముందు పాక్  కు కొత్త కష్టాలు!
X

వన్ డే క్రికెట్ వరల్డ్ కప్ - 2023 కోసం ఇండియాకు వచ్చిన పాకిస్థాన్ టీం.. హైదరబాద్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్ ఆతిధ్యంపై పాక్ ప్లేయర్లు ఫిదా అయిపోయారు. అనంతరం నెదర్లాండ్ పై జరిగిన ఫస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్ లో కాస్త తడబడినా.. 81పరుగులతో విజయం సాధించారు. దీంతో... ఇది పాకిస్థాన్ స్థాయి విక్టరీ కాదనే కామెంట్లు వినిపించాయి. అనంతరం శ్రీలంక తో మ్యాచ్ ప్రారంభమైంది.

వరల్డ్ కప్ లో నెదర్లాండ్ పై తడబడి గెలిచిన పాకిస్థాన్... శ్రీలంకపై మాత్రం విరుచుకు పడిపోయింది. 50 ఓవర్లకు 345 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించినా... దాన్ని అలవోకగా ఛేదించింది. ఇంకా ఆరు వికెట్లు, 10 బంతులు మిగిలి ఉండగానే పాక్ లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో... భారత్ తో మ్యాచ్ ముందు పాక్ ఫుల్ ఫాం లో ఉందనే కామెంట్లు వినిపించాయి.

కట్ చేస్తే... అత్యంత రసవత్తరమైన మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. ఊహకందని అంచనాల మధ్య మొదలైన ఈ మ్యాచ్ లో మొదటి 10 ఓవర్లు మినహా... తర్వాత మొత్తం అంతా భారత్ ఆధిపత్యం కొనసాగింది. పాక్ బ్యాట్స్ మెన్స్ ని పసికూనను చేసిన టీం ఇండియా బౌలర్లు 191 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం పాక్ బౌలర్లపై విరుచుకుపడిన ఇండియన్ బ్యాట్ మెన్స్ 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తిచేసింది.

ఈ నేపథ్యంలో ఈ ఓటమి గాయం నుంచి కోలుకోవాలంటే.. పాక్ క్రికెట్ అభిమానులు కాస్త ధైర్యం తెచ్చుకోవాలంటే నెక్స్ట్ మ్యాచ్ లో కచ్చితంగా గెలిచి తీరాలని పాక్ ఫిక్సయ్యిందనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20 శుక్రవారం ఆస్ట్రేలియాతో తలపడనుంది పాక్! అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ కోసం సిద్ధపడుతున్న సమయంలో... ఒక బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

అవును... బెంగళూరు వేదికగా అక్టోబర్‌ 20న ఆస్ట్రేలియాతో తలపడాల్సి సమయంలో... పాక్ కు ఒక బ్యాడ్ న్యూస్ వెలువడింది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ జట్టును విష జ్వరాలు బాధిస్తున్నాయని తెలుస్తుంది. దీంతో జట్టులో చాలామంది ఇంకా జ్వరంతో బాదపడుతుండగా.. కొంతమందికి మాత్రం కాస్త నయం అయ్యిందని చెబుతున్నారు. కొందరు మాత్రం ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని పీసీబీ మీడియా మేనేజర్‌ చెప్పాడు.

దీంతో పాక్ క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ తో జరిగిన మ్యాచ్ లో జరిగిన గాయం మానాలంటే... ఆస్ట్రేలియాను చితక్కొట్టాలని వారు భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో జ్వరాల వార్త వారిని టెన్షన్ పెడుతుందట. దీంతో వీరంతా వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నారంట పాక్ అభిమానులు.

ఈ క్రమంలో పాకిస్తాన్‌ యువ ఓపెనింగ్ బ్యాటర్, అబ్దుల్లా షఫీక్‌ తో సహా ఇద్దరు ఆటగాళ్లు జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. అయితే... కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌, స్టార్‌ పేసర్‌ షహీన్‌ షా అఫ్రిది ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు.