Begin typing your search above and press return to search.

రేపటి నుంచి క్రికెట్ లో కొత్త నిబంధన... ఏమిటీ "స్టాప్‌ క్లాక్‌"?

దీనికి ఐసీసీ "స్టాప్‌ క్లాక్‌" అని నామకరణం చేసి ఆచరణలోకి పెట్టనుంది. ఈ నిబంధన 2024 ఏప్రిల్‌ వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుందని ఐసీసీ వెల్లడించింది.

By:  Tupaki Desk   |   11 Dec 2023 4:43 PM GMT
రేపటి నుంచి క్రికెట్  లో కొత్త నిబంధన... ఏమిటీ స్టాప్‌  క్లాక్‌?
X

క్రికెట్ కు ఆదరణ పెంచడానికి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) రెగ్యులర్ గా కొత్త కొత్త నిబంధనలు తెరపైకి తేవడం.. కొన్ని నిబంధనల్లో మార్పులు చేర్పులూ చేయడం చేస్తూనే ఉంటుంది. వీటిని నిబంధనలు అనే కంటే.. చంట్టం చేయడం అని కొంతమంది వ్యాఖ్యానిస్తుంటారు. ఈ సమయంలో తాజాగా వన్ డే, టీ 20 క్రికెట్‌ ఫార్మాట్లలో వేగం పెంచే దిశగా ఐసీసీ కీలక అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా స్టాప్ క్లాక్ అనే నిబంధనను తెరపైకి తెచ్చింది.

అవును... ఐసీసీ తాజాగా ఒక సరికొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. డిసెంబర్‌ 12 నుంచి పొట్టి ఫార్మాట్‌ లో ఈ కొత్త రూల్‌ ను అమల్లోకి తేనుంది. దీంతో... విండీస్‌ - ఇంగ్లండ్‌ జట్ల మంగళవారం నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్‌ ల టీ20 సిరీస్‌ లో ఈ రూల్ ఫస్ట్ టైం అప్లై కానుంది. దీనికి ఐసీసీ "స్టాప్‌ క్లాక్‌" అని నామకరణం చేసి ఆచరణలోకి పెట్టనుంది. ఈ నిబంధన 2024 ఏప్రిల్‌ వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుందని ఐసీసీ వెల్లడించింది.

ఏమిటీ స్టాప్ క్లాక్ నిబంధన?:

లిమిటెడ్ ఓవర్స్ ఉన్న క్రికెట్ ఫార్మేట్లలో తాజాగా ఐసీసీ తీసుకొచ్చిన నిబంధన స్టాప్ క్లాక్. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ (వన్ డే, టీ20) మ్యాచ్ లలో ఓవర్‌ కు ఓవర్‌ కు మధ్య అధిక సమయం వృధా అవ్వకుండా ఉండేందుకు తీసుకొచ్చిన కొత్త నిబంధన ఇది. ఈ నిబంధన ప్రకారం... ఈ ఫార్మాట్లలో ఓవర్‌ కు ఓవర్‌ కు మధ్య 60 సెకెన్ల సమయాన్ని మాత్రమే గ్యాప్‌ టైం గా ఫిక్స్‌ చేసింది.

దీంతో బౌలింగ్‌ జట్టు ఓవర్ తర్వాత బౌలర్ ని మార్చి మరో బౌలర్ ని దించడానికి 60 సెకన్ల సమయమే ఉపయోగించాలన్నమాట. ఓవర్ తర్వాత బౌలర్ ని మార్చినప్పుడు ఫీల్డింగ్ మార్చుకోవాల్సి వచ్చినా ఈ సమయంలోనే సెట్ చేసుకోవాలి! ఈ సమయలో రెండుసార్లు 60 సెకన్లు మించి సమయం తీసుకుంటే మూడోసారికి బౌలింగ్‌ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు.

అంటే... ఈ ఐదు పరుగులు బ్యాటింగ్‌ టీం స్కోర్‌ కు అదనపు పరుగులుగా కలుస్తాయి! ఈ సమయంలో ఫీల్డ్‌ అంపైర్లు స్టాప్‌ క్లాక్‌ తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. కాగా... నవంబర్‌ 21న అహ్మదాబాద్‌ లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ కొత్త నిబంధన అమలుపై ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రేపటి నుంచి జరిగే మ్యాచ్ లలో ఈ నిబంధన అమలులోకి రానుంది.