Begin typing your search above and press return to search.

ఒలంపిక్స్ లో 5 దశాబ్దాలుగా ఎవరు ఛేదించలేని ఆ రికార్డ్..

అలాంటి ఒలంపిక్స్ చరిత్రలో ఇప్పటివరకు పది అద్భుతమైన రికార్డులు ఏమిటో తెలుసుకుందాం పదండి.

By:  Tupaki Desk   |   23 July 2024 7:58 AM GMT
ఒలంపిక్స్ లో 5 దశాబ్దాలుగా ఎవరు ఛేదించలేని ఆ రికార్డ్..
X

గేమ్స్ గురించి మాట్లాడిన ప్రతిసారి మనకు గుర్తుకు వచ్చేది ఒలంపిక్స్. ప్రతి సంవత్సరం ప్రపంచంలోని నలుమూలల నుంచి ఎందరో అథ్లెట్లు తమ కలలు సాకారం చేసుకోవడానికి ఒలంపిక్స్ లో పాల్గొంటారు. అలాంటి ఒలంపిక్స్ చరిత్రలో ఇప్పటివరకు పది అద్భుతమైన రికార్డులు ఏమిటో తెలుసుకుందాం పదండి. వీటికి మరొక విశేషం ఏమిటంటే వీటిని తిరిగి బద్దలు కొట్టేవారు లేరు..

ప్రతి నాలుగు సంవత్సరాలకు దేశవ్యాప్తంగా ఉన్న అథ్లెట్స్ పాల్గొనే ఒలంపిక్స్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులో పాల్గొనే ఎందరో అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంటారు. మరి కొందరైతే ఎవరు చేదించలేని రికార్డులను నెలకొల్పి ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. అలా ఒలంపిక్స్ లో ఇప్పటివరకు నెలకొల్పిన 10 అద్భుతమైన రికార్డుల గురించి తెలుసుకుందాం.

తొలిసారిగా ఒలంపిక్స్ లో స్వర్ణ పథకం సాధించిన మొదటి వెనుజులా మహిళగా యులిమార్ రోహాస్ రికార్డు నెలకొల్పింది. రియో 2016 రజత పతకాన్ని టోక్యో 2020లో బంగారు బతకంగా మార్చి రోహాస్ చరిత్ర సృష్టించాడు. మహిళల ట్రిపుల్ జంప్‌లో 15.67 మీటర్ల రికార్డు జంప్‌తో రోహాస్ బంగారు పతకాన్ని గెలుచుకుంది.

అదే ఒలంపిక్స్ లో నార్వేకు చెందిన కార్స్టన్ వార్హోమ్ 400 మీటర్ల హర్డిల్స్ లో రికార్డు స్థాయి ప్రదర్శన కనబరిచి స్వర్ణ పథకం గెలుచుకున్నాడు.

టోక్యో 2020 ఒలంపిక్స్ లో సిడ్నీ లెవ్రోన్ మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ 51.46 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది.లండన్ ఒలింపిక్స్‌లో కెన్యా అథ్లెట్ డేవిడ్ రుడిషా 800 మీటర్స్ రేస్ ను 1:40:91 నిమిషాల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. 800 మీటర్ల రేసును 1:41 నిమిషాల్లోపు పూర్తి చేసిన మొదటి,ఏకైక అథ్లెట్ గా కెన్యాకు చెందిన రుడిషా రికార్డు సృష్టించాడు.లండన్ ఒలింపిక్స్‌లో 4×400 మీటర్ల రేసును 36.84 సెకన్లలో పూర్తిచేసి జమైకం జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది.

1988 సియోల్ అమెరికన్ స్ప్రింటర్ ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్నర్ 200 మీటర్ల రేసును 21.34 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం సాధించాడు. అదే ఒలింపిక్స్‌లో, 100 మీటర్ల రేస్ లో కూడా అతను రికార్డు సృష్టించాడు.బీజింగ్ ఒలింపిక్స్‌లో పురుషుల 400 మీటర్ల స్విమ్మింగ్‌లో ఫెల్ప్స్ ను 4:03:84 నిమిషాల టైమింగ్‌తో పూర్తి చేసి మైఖేల్ ఫెల్ప్స్‌ ఆల్ టైమ్ ఒలింపిక్ లెజెండ్ అయ్యాడు.1968 మెక్సికో ఒలింపిక్స్‌లో అమెరికన్ అథ్లెట్ బాబ్ బీమన్ 8.9 మీటర్ల జంప్‌తో స్వర్ణం సాధించాడు. అయితే ఈ రికార్డు సాధించి ఐదు దశాబ్దాలు గడుస్తున్న ఇప్పటికీ ఎవరు దీన్ని చేరుకోలేకపోతున్నారు.