Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్ లో ఆ అమ్మాయి.. కాబోయే అమ్మోయి..

ఒలింపిక్స్ అంటే పోటీ మామూలుగా ఉండదు. సెకనులో వందో వంతుల తేడాతో పతకాలు చేజారిన భారత అథ్లెట్లు ఉన్నారు

By:  Tupaki Desk   |   1 Aug 2024 10:59 AM GMT
ఒలింపిక్స్ లో ఆ అమ్మాయి.. కాబోయే అమ్మోయి..
X

ఒలింపిక్స్ అంటే పోటీ మామూలుగా ఉండదు. సెకనులో వందో వంతుల తేడాతో పతకాలు చేజారిన భారత అథ్లెట్లు ఉన్నారు. అంటే.. పోటీల్లో పాల్గొనేవారు ఎంతటి ఫిట్ గా ఉండాలో దీన్నిబట్టి తెలుస్తోంది. మరోవైపు ఒలింపిక్స్ నాలుగేళ్లకోసారి జరుగుతాయి కాబట్టి ఫిట్ నెస్ ను నిత్యం కాపాడుకోవాల్సిందే. ఇలాంటిచోట చిన్న గాయమైనా టోర్నీకి దూరం కావాల్సి ఉంటుంది. కానీ.. ఓ అథ్లెట్ల్ ఏకంగా గర్భంతో బరిలో దిగి పతకం కొల్లగొట్టింది.

వ్యక్తిగత జీవితం.. క్రీడా జీవితం..

ఏ మహిళకైనా జీవితంలో అమ్మ కావడం అత్యంత మధుర క్షణం. అందుకే కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి తన ప్రతిరూపాన్ని ఎంతో అపురూపంగా భావిస్తూ వస్తుంది. నెలలు నిండాక అయితే.. మరీ జాగ్రత్తగా ఉంటుంది. అయితే, ఈజిప్ట్‌ ఫెన్సింగ్‌ క్రీడాకారిణి నదా హఫీజ్‌ ఇలాంటి స్థితిలో ఒలింపిక్స్ బరిలో దిగి ఏకంగా పతకం కొట్టింది. అటు క్రీడా జీవితం, ఇటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఫెన్సింగ్ వంటి కత్తి మీద సాము క్రీడలో హఫీజ్ సాధించిన రికార్డును అందరూ పొగుడుతున్నారు.

మూడో ఒలింపిక్స్..

ఒక ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యమే కష్టం.. రెండు ఆడితే గొప్ప.. మూడోసారీ ఒలింపిక్స్ లో పోటీపడడం అంటే మేటి క్రీడాకారిణిగానే భావించాలి. ఈజిప్ట్ ఫెన్సర్ నదా హఫీజ్‌ పారిస్ తో తన మూడో ఒలింపిక్స్ ఆడుతోంది. అయితే, ఇందులో మరో విశేషం ఏమంటే.. ఆమె ఏడు నెలల గర్భిణి. దాదాపు నిండు గర్భంతో బరిలో దిగిన ఆమె శారీరకంగా ప్రతికూలతలను అధిగమించింది. మరీ ముఖ్యంగా ఈ సమయంలో ఎదుర్కొనకూడని ఒత్తిడిని అదుపు చేసుకుంది.

టాపర్ లను కొట్టి..

బరిలో దిగాక ఇక ఏమీ ఆలోచించని హఫీజ్.. ప్రపంచ 10వ ర్యాంకర్‌ ఎలిజబెత్‌ టార్టకోవ్‌ స్కీపై తొలి మ్యాచ్‌ లో నెగ్గింది. 16వ రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్‌ హయోంగ్‌ తో పోరాడి ఓడింది. అయితే, ఈ మ్యాచ్ తర్వాతనే తాను ఏడు నెలల గర్భిణి అని హఫీజ్ ప్రకటించింది.

‘‘రింగ్ లో మీకు ఇద్దరు ఆటగాళ్లే కనిపిస్తున్నారు. కానీ, మూడో వారూ ఉన్నారు. వారే ఇంకా కళ్లు తెరవని నా బిడ్డ’’ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా. దేశానికి పతకం అందించాలనే తపనతోనే తాను ఒలింపిక్స్ కు వచ్చినట్లు హఫీజ్ తెలిపింది. జిమ్నాస్టిక్స్‌ లో జాతీయ చాంపియన్ అయిన ఆమె.. కైరో యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ చదవడం విశేషం.

అప్పట్లో విలియమ్సన్

ఒలింపిక్స్ లో హఫీజ్ గురించి చెబుతూ.. గతంలో టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్సన్ ప్రత్యేకతనూ వివరించాలి. 2017లో ఆమె ఏకంగా గర్భంతోనే గ్రాండ్ స్లామ్ (ఆస్ట్రేలియన్ ఓపెన్) గెలిచింది. 2014లో అమెరికాకు చెందిన అల్సియా మోంటానో 800 మీటర్ల పరుగు పందెంలో గర్భిణిగానే పాల్గొంది.