Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో పాక్ ప్లేయర్లు... ఎంజాయ్ మామూలుగా లేదుగా!

వరల్డ్ కప్ కోసం హైదరాబాద్‌ లో అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఇక్కడ ఊహించని ఆతిథ్యం లభిస్తోంది.

By:  Tupaki Desk   |   1 Oct 2023 3:23 PM GMT
హైదరాబాద్ లో పాక్ ప్లేయర్లు... ఎంజాయ్ మామూలుగా లేదుగా!
X

వరల్డ్ కప్ కోసం హైదరాబాద్‌ లో అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఇక్కడ ఊహించని ఆతిథ్యం లభిస్తోంది. ఇందులో భాగంగా ఖరీదైన, అత్యద్భుతమైన ఆహారాన్ని తీసుకుంటూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. తమకు దొరికిన ఈ ఆతిథ్యానికి ఫిదా అవుతున్నారు. ఫ్యాన్స్‌ తో సెల్ఫీలు దిగుతూ జాలీగా గడుపుతున్నారు.

అవును... మరో నాలుగు రోజుల్లో జరగనున్న వన్డే వరల్డ్ కప్-2023 మెగా టోర్నీ ఆరంభం కానుంది. భారత్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో పాల్గొనే టీంస్ ఒక్కొక్కటిగా ఇండియాకు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పాక్ టీం వచ్చిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చిన దాయాదీ టీం కు హైదరాబాద్ లో విమానం దిగిన పాక్ క్రికెటర్లకు భారత్ లో ఘనస్వాగతం లభించింది.

ఈ సమయంలో తమ ఆటగాళ్ల డిన్నర్, సెల్ఫీలకు సంబంధించిన వీడియోను పాక్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ లో షేర్ చేసింది. "హ్యాంగవుట్ ఇన్ హైదరాబాద్" అంటూ దానికి క్యాప్షన్ తగిలించింది. ఈ వీడియోపై స్పందిస్తున్న పాక్ ఫ్యాన్స్... ఒక పర్యాటక జట్టుకు ఇంత గొప్ప ఆతిథ్యం లభించడం ఎప్పుడూ చూడలేదని కామెంట్లు పెడుతున్నారు.

కాగా... ఉప్పల్‌ లో న్యూజిలాండ్‌ తో జరిగిన వార్మప్ మ్యాచ్‌ లో పాకిస్థాన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 345 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందులో... మహమ్మద్ రిజ్వాన్ సెంచరీ (103) చేయగా.. కెప్టెన్ బాబర్ ఆజం (80), సౌద్ షకీల్ (75) రాణించారు.

అనంతరం 346 పరుగుల టార్గెట్‌ తో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ 43.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ లో రచిన్ రవీంద్ర (97), కేన్ విలియమ్సన్ (54), డరిల్ మిచెల్ (59), మార్క్ చాప్‌ మన్ (65) రాణించారు. దీంతో ఇంకా 38 బంతులు మిగిలి ఉండగానే కివీస్ 5 వికెట్ల తేడాతో పాక్ పై విజయం సాధించింది.