Begin typing your search above and press return to search.

ప్రజ్ఞా వన్స్ ఎగైన్... నార్వే లో నాన్ స్టాప్ విక్టరీస్!

భారత గ్రాండ్ మస్టర్ ప్రజ్ఞానంద..నర్వే చెస్ టోర్నమెంట్ లో వరుస సంచలనాలు నమోదు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   2 Jun 2024 6:05 AM GMT
ప్రజ్ఞా వన్స్ ఎగైన్... నార్వే లో నాన్ స్టాప్ విక్టరీస్!
X

భారత గ్రాండ్ మస్టర్ ప్రజ్ఞానంద..నర్వే చెస్ టోర్నమెంట్ లో వరుస సంచలనాలు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చెస్ లో కొరకరాని కొయ్యగా పేరు సంపాదించుకున్న ఫస్ట్ ర్యాంకర్ మాగ్నస్ కార్ల్ సన్ కు ఓటమి రుచి చూపించాడు. ఈసారి అతన్ని క్లాసికల్ చెస్ గేమ్ లో మట్టికరిపించారు. ఈ క్రమంలో తాజాగా రెండో ర్యాంకర్ ఫాబియానో కరువానాకు షాక్ ఇచ్చాడు.

అవును... నార్వే చెస్ టోర్నమెంట్ లో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ ను ఓడించిన ఆయన.. తాజాగా వరల్డ్ సెకండ్ ర్యాంకర్ ఫాబియానో కరువానాపై ఐదో రౌండ్ లో విజయం సాధించారు. దీంతో తొలిసారి ఇద్దరు టాప్ ర్యాంకర్లను ఓడించిన ప్లేయర్ గా రికార్డ్ సృష్టించారు.

నార్వే చెస్ లోని రౌండ్ 5లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఫాబియానో కరువానాకు షాకిచ్చాడు ప్రజ్ఞానంద. దీంతో ఈ వరుస విజయాలు చెస్ ప్రపంచ ర్యాంకింగ్స్‌ లో టాప్ 10లోకి ప్రవేశించడానికి సహాయపడిందని అంటున్నారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానంద ను నార్వే చెస్ టోర్నమెంట్ నిర్వాహకులు ప్రశంసలతో ముంచెత్తిస్తున్నారు.

"ప్రజ్ఞా ఈజ్ బ్యాక్... యువ ప్రాడిజీ ప్రజ్ఞానంద రౌండ్ 5లో ప్రపంచ నెంబర్ టు ఫాబియానో కరువానాను ఓడించడం ద్వారా చెస్ ప్రపంచాన్ని మళ్లీ ఆశ్చర్యపరిచాడు! రౌండ్ 3 లో ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌ సెన్‌ ను పడగొట్టిన తర్వాత, అతను ఇప్పుడు క్లాసికల్ చెస్‌ లో మొదటి ఇద్దరు ఆటగాళ్లను ఓడించాడు" అని ట్వీట్ చేశారు.