Begin typing your search above and press return to search.

పతకం కోసం పారిస్ పంపితే.. రూంలో రీల్స్ చేసిన మనమ్మాయ్

అయితే.. అభిమానుల ఆగ్రహంలోనూ న్యాయం ఉందన్న మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   12 Aug 2024 4:53 AM GMT
పతకం కోసం పారిస్ పంపితే.. రూంలో రీల్స్ చేసిన మనమ్మాయ్
X

గతానికి భిన్నంగా క్రీడాకారులు కోరుకున్న సౌకర్యాలు.. వసతులు.. శిక్షణ కోసం ఫారిన్ టూర్లు.. ఇలా ఏం కావాలంటే అది ఇచ్చేసేందుకు ప్రభుత్వం చేయాల్సిదంతా చేసినప్పటికీ.. పారిస్ ఒలింపిక్స్ లో ఒక్కటంటే ఒక్క స్వర్ణ పతకం రాకపోగా.. పతకాల పట్టికలో టోక్యో ఒలింపిక్స్ కంటే దిగువన నిలవటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు భారత క్రీడాకారుల మీద కొంతమంది గుర్రుగా ఉన్నారు.

అయితే.. అభిమానుల ఆగ్రహంలోనూ న్యాయం ఉందన్న మాట వినిపిస్తోంది. నిజాయితీగా కష్టపడి.. ఆ కష్టం అందరికి కనిపిస్తే పరిస్థితి మరోలా ఉండేది. అందుకు భిన్నంగా 117 మంది టీంలో వెళ్లిన భారత అథ్లెటిక్స్ కేవలం ఒక రజతం.. ఐదు కాంస్యాలతో తమ ఒలింపిక్ ప్రయాణాన్ని ముగించటం చూసినప్పుడు ఒళ్లు మండకమానదు. పారిస్ ఒలింపిక్స్ కోసం కేంద్రంలోని మోడీ సర్కారు రూ.470 కోట్లను ఖర్చు చేసింది.

పారిస్ ఒలింపిక్స్ లో అద్భుతాలు కాకున్నా.. ఆ స్థాయి ప్రదర్శన అయినా మన అథ్లెట్ల నుంచి క్రీడాభిమానులు కోరుకున్నారు. అందుకు భిన్నంగా పలువురు ప్లేయర్లు పేలవ ప్రదర్శనను ప్రదర్శించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒక మహిళా అథ్లెట్ తీరును అందరూ తప్పు పడుతున్నారు. ప్రమాణాల కల్పనలో ప్రభుత్వం శ్రద్ధను చూపినప్పటికి.. ఆ స్థాయిలో క్రీడాకారుల ప్రదర్శన లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.

20 కిలోమీటర్ల రేస్ వాక్ లో మొత్తం 43 మంది అథ్లెట్లు పోటీ పడ్డారు. బరిలో నిలిచిన 43 మందిలో మనమ్మాయి ప్రియాంక గోస్వామి నిలిచిన స్థానం ఎంతో తెలుసా ‘‘41’’. ఇంత పేలవమైన ప్రదర్శన చేసిన ఆమె గేమ్ విలేజ్ లో రీల్స్ చేస్తున్న వీడియోలు వైరల్ గా మారటమే కాదు.. ఆమె తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఆట పట్ల ఆమెకున్న సీరియస్ నెస్ ఎంతన్నది ఆమె చేస్తున్న రీల్స్ చెప్పేస్తాయన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. ఇలాంటి తీరుతో ఉన్న వారు ఒలింపిక్స్ కు వెళితే దేశానికి జరిగే నష్టాన్ని ప్రశ్నిస్తున్నారు.