Begin typing your search above and press return to search.

పంజాబ్ వర్సెస్ ముంబై... హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!

పంజాబ్, ముంబై జట్లు ఇప్పటి వరకు 31 ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడాయి. వీటిలో పంజాబ్ 15 మ్యాచ్‌ లు గెలుపొందగా.. ముంబై ఇండియన్స్ 16 మ్యాచ్ లలో గెలిచింది.

By:  Tupaki Desk   |   18 April 2024 3:58 AM GMT
పంజాబ్  వర్సెస్  ముంబై... హెడ్  టు హెడ్  రికార్డ్స్  ఇవే!
X

ఐపీఎల్ సీజన్ 2024 లో భాగంగా ఈ రోజు మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ప్రస్తుతం... ఆడిన ఆరు మ్యాచ్‌ లలోనూ రెండు గెలిచిన పంజాబ్.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ముంబై కూడా తమ ఆరు మ్యాచ్‌ లలో రెండింటిని గెలిచి తొమ్మిదో స్థానంలో కూర్చుంది. నెట్ రన్ రేట్ లో ముంబై కంటే పంజాబ్ కాస్త మెరుగ్గా ఉండటమే దీనికి కారణం.

పంజాబ్ కింగ్స్ ఇటీవలి జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ విభాగంలో కాస్త ప్రతిభ కనబరిచింది. అయితే వారి బ్యాటింగ్ మాత్రం ఇంకా ప్రధాన ఆందోళన కలిగిస్తుంది. రాజస్థాన్ రాయల్స్‌ తో జరిగిన వారి చివరి మ్యాచ్‌ లో, పంజాబ్ బౌలర్లు మొత్తం 147 పరుగులను దాదాపు డిఫెండ్ చేశారు.. గేమ్‌ ను 19వ ఓవర్‌ కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో... పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ టోర్నీలో పోటీలో నిలవాలంటే వరుస విజయాలు సాధించాలి.

అయితే, మునుపటి మ్యాచ్ కు ముందు శిఖర్ ధావన్ భుజం గాయంతో 7-10 రోజులు దూరంగా ఉండటంతో వారు ఎదురుదెబ్బ తగిలింది. ధావన్ గైర్హాజరు సమస్యను ఓపెనింగ్ పార్ట్నర్ షిప్ సమస్యను మరింత తీవ్రతరం చేయడంతో, పంజాబ్ కింగ్స్ రాబోయే మ్యాచ్‌ లలో పోటీగా ఉండటానికి.. ప్రధానంగా వారి బ్యాటింగ్ లైనప్‌ ను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక ముంబై ఇండియన్స్ విషయానికొస్తే... ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ ముంబై ఇండియన్స్‌ కు ఎదురుదెబ్బ తగిలింది. మరో ఎండ్‌ లో వికెట్లు నిలకడగా పడిపోవడంతో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. దురదృష్టవశాత్తూ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య.. బ్యాట్, బాల్ రెండింటిలోనూ నిరాశపరిచే ప్రదర్శన చేస్తున్నాడు.

హెడ్ టు హెడ్ రికార్డులు!:

పంజాబ్, ముంబై జట్లు ఇప్పటి వరకు 31 ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడాయి. వీటిలో పంజాబ్ 15 మ్యాచ్‌ లు గెలుపొందగా.. ముంబై ఇండియన్స్ 16 మ్యాచ్ లలో గెలిచింది. ఇప్పటివరకు ముంబైపై పంజాబ్ అత్యధిక మొత్తం 230, పంజాబ్ పై ముంబై అత్యధిక 223 పరుగులు చేసింది!