పంజాబ్ వర్సెస్ రాజస్థాన్... ఆసక్తికరంగా హెడ్ టు హెడ్ రిపోర్ట్స్!
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే టోర్నమెంట్ 27 మ్యాచ్ కోసం పీసీఏ న్యూ స్టేడియం ముస్తాబైంది.
By: Tupaki Desk | 13 April 2024 4:30 AM GMTఐపీఎల్ సీజన్ 17లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే టోర్నమెంట్ 27 మ్యాచ్ కోసం పీసీఏ న్యూ స్టేడియం ముస్తాబైంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో ఐదు మ్యాచ్ లలో రెండు గెలిచి, ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉండగా... తమ ఐదు మ్యాచ్ లలో ఒకదానిలో మాత్రమే ఓడి నంబర్ వన్ స్థానంలో నిలిచింది రాజస్థాన్ రాయల్స్!
పంజాబ్ బ్యాటర్స్ లో శిఖర్ ధావన్ ఐదు మ్యాచ్ లు ఆడి 152 పరుగులు చేసి ఆ టీం లో టాప్ స్కోరర్ గా నిలవగా.. శశాంక్ సింగ్ 137 పరుగులు, సాం కురేన్ 120 పరుగులు సాధించారు. ఇక బౌలింగ్ విభాగంలో... అర్షదీప్ సింగ్ 8 వికెట్లు తీసుకోగా.. రబాడా 7 వికెట్లు సాధించారు. ఇప్పటి వరకూ పంజాబ్ గెలిచిన రెండు మ్యాచ్ లలోనూ కీలక భూమిక పోషించారు.
ఇక రాజస్థాన్ విషయానికొస్తే... ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ వరుసగా నాలుగు గెలిచింది. తన చివరి మ్యాచ్ ఓడిపోయింది. రాజస్థాన్ బ్యాటర్స్ లో రియాన్ పరాగ్ 5 మ్యాచ్ లలో 261 పరుగులు సాధించి ఆ టీంలో టాప్ స్కోరర్ గా ఉండగా.. కెప్టెన్ సంజూ శాంసన్ 246 పరుగులు, జోస్ బట్లర్ 143 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
ఇదే క్రమంలో బౌలింగ్ డిపార్ట్ మెంట్ లో యుజ్వేంద్ర చాహల్ 10 వికెట్లు తీసుకోగా.. బర్గర్ 4 మ్యాచ్ లలో 6 వికెట్లు తీసుకున్నాడు.
హెడ్-టు-హెడ్ రికార్డ్స్:
పంజాబ్, రాజస్థాన్ జట్లు ఇప్పటి వరకు 26 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాగా.. వాటిలో 11 మ్యాచ్ లలో పంజాబ్.. 15 మ్యాచ్ లలో రాజస్థాన్ గెలిచాయి. ఇక రాజస్థాన్ పై ఇప్పటివరకు పంజాబ్ హైఎస్ట్ టోటల్ 223 కాగా.. పంజాబ్ పై రాజస్థాన్ అత్యధిక స్కోరు 226గా ఉంది.
పిచ్ రిపోర్ట్!:
ఈ వేదికపై జరగబోయే ఈ మ్యాచ్ మూడోది మాత్రమే కాగా... మునుపటి మ్యాచ్ ల నుండి వచ్చిన పరిశీలనల ఆధారంగా.. ఇక్కడ స్పిన్ బౌలర్లు మరింత ప్రభావవంతంగా ఉంటారని, ఇదే సమయంలో.. కొత్త బంతి స్వింగ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందువల్ల, టాస్ గెలిచిన టీం తొలుత బౌలింగ్ ఎంచుకోవడం ఉత్తమమైన వ్యూహం కావచ్చని అంటున్నారు.