Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో ఆర్సీబీ రిటెన్షన్ లిస్ట్ ఇదేనట? మరి కోహ్లి ఉన్నాడా?

ఫామ్, వయసు ప్రకారం చూస్తే కోహ్లిని రిటెన్షన్ చేసుకోవడంపైనా కొంత అనుమానం ఉంది.

By:  Tupaki Desk   |   25 Sep 2024 9:30 AM GMT
ఐపీఎల్ లో ఆర్సీబీ రిటెన్షన్ లిస్ట్ ఇదేనట? మరి కోహ్లి ఉన్నాడా?
X

ఫామ్, వయసు ప్రకారం చూస్తే కోహ్లిని రిటెన్షన్ చేసుకోవడంపైనా కొంత అనుమానం ఉంది. ఇటీవల కోహ్లి పెద్దగా రాణించడం లేదు. పైగా అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికాడు.

అభిమానుల ఆదరణకు, స్టార్లకు కొదవ లేకున్నా.. 17 సీజన్లుగా ప్రయత్నిస్తున్నా.. ప్రతిసారీ ఈ సాలా కప్ నమదే (ఈసారి కప్ మనదే) అంటూ బరిలోకి దిగుతున్నా ఉత్త చేతులతో వెనుదిరగడం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు అలవాటే. అలాంటి జట్టు 18వ సీజన్ కు సిద్ధం అవుతోంది. అయితే, మెగా వేలం ముంగిట ఎంతమందిని రిటైన్ చేసుకుంటుందో? తెలియడం లేదు. చాలా జట్లు ఐదుగురు లేదా ఆరుగురిని రిటైన్ చేసుకుంటామంటూ చెబుతున్నాయి. ఇలానే బెంగళూరు ఎందరిని అట్టిపెట్టుకుంటుందో అనేది స్పష్టత లేదు. అయితే, తాజాగా ఓ జాబితా

ఆ ఇద్దరినీ వదిలేస్తుందా?

17 సీజన్లుగా విరాట్ కోహ్లి వంటి స్టార్ బ్యాట్స్ మన్ ఆడుతున్నప్పటికీ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కప్ కల తీరేది ఎప్పుడో తేలడం లేదు. వచ్చే సీజన్ కు విరాట్ ఉంటాడా? అనేది కూడా చెప్పలేని పరిస్థితి. లక్నో నుంచి కేఎల్ రాహుల్ ను తీసుకొచ్చి కెప్టెన్ చేసే ఆలోచన ఉన్నట్లుగా చెబుతున్నారు. కెప్టెన్ గా ఉన్న డుప్లెసిస్ ను వదిలించుకునే ప్రయత్నం కూడా ఉందట. ఇన్ని ఊహాగానాల మధ్య ఆర్సీబీ రిటెన్షన్ జాబితా ఇదిగో అంటూ ఓ లిస్ట్ బయటకు వచ్చింది. ఇదేమీ అఫీషియల్ ప్రకటన కాదు. అయితే, ఎంతో కొంత నిజం ఉండొచ్చని మాత్రం చెబుతున్నారు. దీనిప్రకారం ఇద్దరు స్టార్ క్రికెటర్లను ఆర్సీబీ విడుదల చేసిందని తెలుస్తోంది. బీసీసీఐ నుంచి స్పష్టత రానప్పటికీ రిటెన్షన్‌ + రైట్‌ టు మ్యాచ్‌ ఆప్షన్‌ తో కలిపి ఆరుగురిని అట్టిపెట్టుకునే చాన్సున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐదుగురితో కూడిన రిటెన్షన్ లిస్ట్‌ను ఆర్సీబీ సిద్ధం చేసినట్లు సమాచారం.

మరి కోహ్లి ఉన్నాడా?

టీమ్ ఇండియా పేసర్లు హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్, యూపీకి చెందిన యశ్ దయాళ్‌, మిడిలార్డర్ బ్యాట్స్ మన్ రజత్ పటీదార్, విధ్వంసక ఓపెనర్ విల్‌ జాక్స్‌ ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంటుందట. డుప్లెసిస్‌ ను వదిలేయడం ఖాయమట. గత ఎడిషన్‌లో పెద్దగా రాణించకపోవడంతో పాటు ఫాఫ్‌ 40 ఏళ్లకు చేరిన డుప్లెసి బదులు వేరే యువకుడిని తీసుకుని కెప్టెన్సీ ఇవ్వాలనేది ఆర్సీబీ యోచనగా చెబుతున్నారు. అంతేకాదు.. గత

సీజన్‌ లో ఘోరంగా విఫలమైన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌ వెల్‌ నూ కొనసాగించే ఉద్దేశమే లేదట. అయితే, మంచి ఆల్ రౌండర్ గా భారీ అంచనాలు ఉన్న కామెరూన్ గ్రీన్ నూ తీసుకోవడం లేదట. మరి మిగిలింది ఒక్కస్థానం.. అది విరాట్ కోహ్లి. ఫామ్, వయసు ప్రకారం చూస్తే కోహ్లిని రిటెన్షన్ చేసుకోవడంపైనా కొంత అనుమానం ఉంది. ఇటీవల కోహ్లి పెద్దగా రాణించడం లేదు. పైగా అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకుంటుందా? అంటే రిటైన్ చేసుకుంటుంది.. అనే సమాధానం వస్తోంది. కాగా, ఐపీఎల్ మెగా వేలం నవంబరు రెండో వారంలో జరిగే అవకాశం ఉంది. మళ్లీ దుబాయ్ లోనే నిర్వహించాలని చూస్తోంది బీసీసీఐ.

ఆ మూడు జట్ల రిటైన్ జాబితా కూడా..?

డిఫెండింగ్ చాంపియన కోల్‌కతా నైట్ రైడర్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రిటెన్షన్ జాబితాలను సిద్ధం చేసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. వాటిప్రకారం.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబె, మతీశా పతిరణలను చెన్నై రిటైన్ చేసుకుంటుంది. కెప్టెన్ రిషభ్‌ పంత్, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, చైనామన్ స్పిన్నర్ కుల్‌ దీప్‌ యాదవ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా యువ సంచలనాలు జేక్ ఫ్రేజర్, ట్రిస్టన్ స్టబ్స్‌లను ఢిల్లీ అట్టిపెట్టుకుంటుంది. కెప్టెన శ్రేయస్ అయ్యర్, హిట్టర్లు రింకు సింగ్‌, ఆండ్రి రస్సెల్, ఓపెనర్ ఫిల్‌ సాల్ట్, మిస్టరీ స్పిన్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ లను కోల్ కతా కొనసాగిస్తుంది.