Begin typing your search above and press return to search.

ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్... వారికి గుడ్ న్యూస్ చెబుతున్న పిచ్!

ఇరువైపులా బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఈ రెండు టీంలకు ఈ పిచ్ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   29 March 2024 4:23 AM GMT
ఆర్సీబీ వర్సెస్  కేకేఆర్... వారికి గుడ్  న్యూస్  చెబుతున్న  పిచ్!
X

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా 10వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య శుక్రవారం, చినస్వామి స్టేడియంలో జరగనుంది. ఇరువైపులా బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఈ రెండు టీంలకు ఈ పిచ్ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని అంటున్నారు. టాప్ ఆర్డర్స్ కాస్త నిలదొక్కుకుంటే... రికార్డ్ స్కోర్ బోర్డ్ ఖాయమని చెబ్బుతున్నారు.

అవును... ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ – కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్.. నాలుగు పరుగుల తేడాతో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ ను ఓడించి నైట్ రైడర్స్.. ప్రారంభ పాయింట్లను సంపాదించిన ఉత్సాహంలో ఉండటంతో.. ఈ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది!

ఈ సీజన్ లో బెంగళూరు 2 మ్యాచ్ లు ఆడి 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉండగా... ఒక మ్యాచ్ ఆడి 2 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది కోల్ కతా.

ఈ క్రమంలో... పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 177 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ చేసినప్పుడు విరాట్ కొహ్లీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి ఉండొచ్చు కానీ... కెప్టెన్ డుప్లెసిస్, మాక్స్‌ వెల్, కామెరూన్ గ్రీన్, రజత్ పాటిదార్ ల పెర్ఫార్మెన్స్ మాత్రం ఆర్సీబీకి ఆందోళనకరంగానే ఉందని చెప్పొచ్చు. వీరంతా రాణిస్తేనే చివర్లో ఫినిషర్ గా డీకే పని పూర్తిచేసే అవకాశం ఉంది.

ఇక కేకేఆర్ విషయనికొస్తే... సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో చివర్లో రస్సెల్ రాణించకపోతే పరిస్థితి వేరుగా ఉండేది. కేకేఆర్ టాప్ ఆర్డర్ ఆ మ్యాచ్ లో ఘోరంగా విఫలమైంది. ఇందులో భాగంగా... సునీల్ నరైన్ (2), వెంకటేష్ అయ్యర్ (7), శ్రేయస్స్ అయ్యార్ (0), నితీశ్ రాణా (9) పరుగులు మాత్రమే చేశారు. ఈ సమస్యలను అదిగమిస్తే.. కేకేఆర్ ఫ్యాన్స్ కి పండగే!

హెడ్ టు డెడ్ రిపోర్ట్:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు 32 ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడాయి. వాటిలో బెంగళూరు 14 మ్యాచ్ లు గెలవగా.. కోల్‌ కతా 18 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇక కేకేఆర్ పై బెంగళూరు అత్యధిక స్కోరు 213 కాగా... బెంగళూరుపై కేకేఆర్ అత్యధిక స్కోరు 222.

ఆర్సీబీ వర్సెస్ కేకేఅర్ పిచ్ రిపొర్ట్!:

బెంగళూరు చినస్వామి స్టేడియం సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉండే ఫ్లాట్ పిచ్ లనే అందిస్తుంది! ఈ సమయంలో... రెండు జట్లూ హార్డ్ హిట్టర్ లను కలిగి ఉండటంతో.. బంతి రెగ్యులర్ గా స్టాండ్స్ లోకి వచ్చే అవకాశం ఉంది! ఇదే సమయంలో స్పినర్లకు కూడా అనుకూలంగా ఉండొచ్చని అంటున్నారు!