Begin typing your search above and press return to search.

రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ... రియాన్ పరాగ్ వన్ మ్యాన్ షో!

ఈ క్రమంలో... తొలి మ్యాచ్ విజయంతో రాజస్థాన్ ఉత్సాహంగా ఎంట్రీ ఇవ్వగా.. బోణి కొట్టాలనే కసితో ఢిల్లీ బరిలోకి దిగింది.

By:  Tupaki Desk   |   29 March 2024 4:16 AM GMT
రాజస్థాన్  వర్సెస్  ఢిల్లీ... రియాన్  పరాగ్  వన్  మ్యాన్  షో!
X

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా 9వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరిగింది. ఈ సమయంలో... టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకుని, రాజస్థాన్ ను బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. ఈ క్రమంలో... తొలి మ్యాచ్ విజయంతో రాజస్థాన్ ఉత్సాహంగా ఎంట్రీ ఇవ్వగా.. బోణి కొట్టాలనే కసితో ఢిల్లీ బరిలోకి దిగింది. మరి ఈ మ్యాచ్ ఆధ్యాంతం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం...!

ఢిల్లీ కట్టుదిట్టమైన ప్రారంభం!:

తొలుత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నుంచి ఓపెనర్లుగా జైస్వాల్‌, బట్లర్‌ మైదానంలో అడుగుపెట్టారు. ఈ సమయంలో బంతి అందుకున్న ఖలీల్ అహ్మద్ తొలి ఓవర్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఇందులో భాగంగా... 3 డాట్ బాల్స్ వేసి, 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

తొలి వికెట్‌ ను కోల్పోయిన రాజస్థాన్‌:

ముకేష్ కుమార్ వేసిన రెండో ఓవర్ లో జైస్వాల్ (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో.. 2 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 9 పరుగులుగా ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ సంజు శాంసన్ క్రీజ్ లోకి వచ్చాడు.

రాజస్థాన్‌ రెండో వికెట్‌ డౌన్‌:

స్లోగా మొదలై స్లోగా సాగుతోన్న రాజస్థాన్ ఇన్నింగ్స్ లో రెండో వికెట్ కూడా పడింది. ఇందులో భాగంగా.. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఆరో ఓవర్‌ లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి సంజు (15) ఔటయ్యాడు. దీంతో... పవర్ ప్లే ముగిసే సరికి రాజస్థాన్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 31 పరుగులకు చేరుకుంది.

మూడో వికెట్ డౌన్:

రాజస్థాన్ కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు ఢిల్లీ బౌలర్లు. గ్యాప్ ఇవ్వకుండా వరుసపెట్టి వికెట్లు తీస్తున్నారు. ఈ క్రమంలో కుల్‌ దీప్‌ వేసిన 7.2 బంతికి బట్లర్‌ (11) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 8 ఓవర్లలో రాజస్థాన్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 38 పరుగులకు చేరుకుంది.

10 ఓవర్లకు రాజస్థాన్ పరిస్థితి ఇది:

ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసుండటం.. క్రమం తప్పకుండా వికెట్లు తీసుండటంతో రాజస్థాన్ స్కోర్ బోర్డు నెమ్మదిగా కదులింది. 10 ఓవర్లో ఫస్ట్ సిక్స్ పడిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ సమయంలో 10 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ స్కోరు 3 వికెట్లకు 58 పరుగులకు చేరుకుంది.

నాలుగో వికెట్ డౌన్!:

రాజస్థాన్ బ్యాటర్స్ ని క్రీజ్ లో నాలువు ఓవర్ల పాటు కుదురుగా నిలబడే అవకాశం ఇవ్వడం లేదు ఢిల్లీ బౌలర్లు. ఈ క్రమంలో నాలుగో వికెట్ కూడా పడగొట్టారు. ఇందులో భాగంగా... అశ్విన్ (29) ఔటయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి.. బౌండరీ లైన్ వద్ద దొరికేశాడు. దీంతో... రాజస్థాన్ స్కోరు 14 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 93కు చేరింది.

100 దాటిన రాజస్థాన్‌ స్కోర్‌!

చాలా స్లోగా గా స్టార్ట్ అయ్యి, అంతే స్లోగా నడుస్తున్నట్లున్న రాజస్థాన్... 14.3 ఓవర్లో 100 పరుగులకు చేరుకుంది. ఖలీల్ అహ్మద్ వేసిన 15 ఓవర్లో పరాగ్ (40*) రెండు ఫోర్లు కొట్టడంతో 100 పరుగులును దాటింది. దీంతో.. 15 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోరు 4 వికెట్ల నష్టానికి 108 పర్గులకు చేరుకుంది.

దూకుడు పెంచిన పరాగ్... అర్ధసెంచరీ!

ఢిల్లీతో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పరాగ్ (50*) హాఫ్ సెంచరీ చేశాడు. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ తరుపున ఇదే బెస్ట్ స్కోర్. దీంతో... 16 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వైకెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది రాజస్థాన్.

పరాగ్ వన్ మ్యాన్ షో... ఆఖరి ఓవర్లో పాతిక పరుగులు!

ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ బ్యాటర్స్ లో రియాన్ పరాగ్ వన్ మ్యాన్ షో చేశాడు. ఇందులో భాగంగా... నోర్జే వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా... 4, 4, 6, 4, 6, 1 తో 25 పరుగులు రాబట్టాడు. దీంతో... రాజస్థాన్ స్కోరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

ఈ సమయమో రియాన్ పరాగ్ వ్యక్తిగత స్కోరు 84 (45 బతుల్లో, 7 ఫోర్లు, 6 సిక్స్లు) పరుగులు.

ఢిల్లీ బ్యాటింగ్ స్టార్ట్:

186 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నుంచి డెవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లు క్రీజ్ లోకి వచ్చారు. మరోపక్క రాజస్థాన్ నుంచి ట్రెంట్ బంతి అందుకున్నాడు. తొలిఓవర్ లో కట్టు దిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో ఫస్ట్ ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 2 పరుగులు.

ఒకే ఓవర్ లో రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ!:

ఢిల్లీ బ్యాటర్స్ లో 12 బంతుల్లో 23 పరుగులతో దూకుడు మీదున్న మిచెల్ మార్ష్ కు బర్గర్ కళ్లెం వేశాడు. ఇందులో భాగంగా నాలుగో ఓవర్ రెండో బంతికి మిచెల్ మార్ష్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం... ఇదే ఓవర్ నాలుగో బంతికి రికీ బుయ్ ను గోల్డేన్ డక్ గా పెవిలియన్ కు పంపాడు. ఈ సమయంలో కెప్టెన్ పంత్ క్రీజ్ లోకి వచ్చాడు.

దీంతో 4 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోరు 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు.

10 ఓవర్లకు ఢిల్లీ పరిస్థితి ఇది!:

తడబడుతూ స్టార్ట్ అయినా.. నిలకడగా సాగిన ఢిల్లీ ఇన్నింగ్స్ లో మొదటి 10 ఓవర్లు పూర్తయ్యే సరికి 2 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. దీంతో... ఢిల్లీ విజయానికి ఇంకా 60 బంతుల్లో 97 పరుగులు కావాలి.

హాఫ్‌ సెంచరీ మిస్‌.. వార్నర్‌ ఔట్‌!

డెవిడ్ వార్నర్ కు తృటిలో హాఫ్ సెంచరీ మిస్సయ్యింది. 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆవేశ్ ఖాన్ బౌలింగ్ లో సందీప్ శర్మకు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరిగాడు. దీంతో... ఢిల్లీ స్కోరు 12 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు.

100 దాటగానే పంత్ ఔట్!:

12 ఓవర్లో వార్నర్ ఔట్ అయిన అనంతరం... 14వ ఓవర్ లో చాహల్‌ బౌలింగ్‌ లో కెప్టెన్ పంత్‌ (28) కీపర్ కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సమయంలో ఢిల్లీ స్కోరు 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు కాగా... ఇంకా విజయానికి 36 బంతుల్లో 77 పరుగులు కావాలి!

ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ!:

రాజస్థాన్ బౌలర్లు గ్యాప్ ఇవ్వడం లేదు. కీలకమైన సమయంలో వరుసగా వికెట్లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా... 16 ఓవర్ 3వ బంతికి ఇంపాక్ట్ ప్లేయర్ గా క్రీజ్ లోకి వచ్చిన అభిషేక్ పోరల్ (9) ని యుజ్వేంద్ర చాహల్ ఔట్ చేశాడు. దీంతో 16 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోరు 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు కాగా... విజయానికి ఇంకా 24 బంతుల్లో 60 పరుగులు అవసరం.

రసవత్తరంగా మారిన మ్యాచ్!:

17 ఓవర్లో 19 పరుగులు రావడంతో, తర్వాత 18వ ఓవర్ లో 9 పరుగులు రావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. దీంతో... చివరి 2 ఓవర్లలో ఢిల్లీ విజయానికి 32 పరుగులు కావాలి. ఈ సమయంలో క్రీజ్ లో ట్రిస్టన్ స్టబ్స్ (30*), అక్షర్‌ పటేల్‌ (10*) లు ఉన్నారు.

6 బంతుల్లో 17 పరుగులు:

సందీప్‌ శర్మ వేసిన 19 ఓవర్లో 15 పరుగులు రాబట్టడంతో ఇక ఢిల్లీ విజయానికి 6 బంతుల్లో 17 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో ట్రిస్టన్ స్టబ్స్ (42*) ఫైర్ మీద ఉన్నాడు! అయితే... ఆవేశ్ ఖాన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఈ ఓవర్ లో కేవలం 4 పరుగులు రావడం గమనార్హం!

దీంతో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రియాన్ పరాగ్‌ నిలిచాడు. చెన్నై తర్వాత ఆడిన రెండు మ్యాచ్ లలోనూ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.