Begin typing your search above and press return to search.

హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... సచిన్ కి అతి చేరువలో రోహిత్!

అవును... టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువయ్యారు.

By:  Tupaki Desk   |   8 Feb 2025 9:30 PM GMT
హిట్ మ్యాన్  ఫ్యాన్స్  కి గుడ్  న్యూస్... సచిన్  కి అతి చేరువలో రోహిత్!
X

టీమిండియా స్టార్లు వరుస రికార్డులు సృష్టిస్తున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ తో నాగ్ పూర్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో జడేజా 600 వికెట్ల క్లబ్ లో చేరి రికార్డ్ సృష్టించగా.. మరో సంచలన రికార్డుకు చేరువలో టీమిండియా స్టార్ బ్యాటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేరువయ్యారు. ఇప్పుడు ఈ విషయం అత్యంత ఆసక్తిగా మారింది.

అవును... టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువయ్యారు. అతను మరో 50 పరుగులు చేస్తే.. సచిన్ టెండుల్కర్ ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఓపెనర్ గా నిలుస్తాడు. ఈ జాబితాలో ఓపెనర్, చిచ్చరపిడుగు సెహ్వాగ్ 332 మ్యాచ్ లలో 16,119 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఆ తర్వాత స్థానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 346 మ్యాచ్ లలో 15,335 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ 342 మ్యాచ్ ల్లో ఓపెనర్ గా బరిలోకి దిగిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 45.22 సగటుతో 15,285 పరుగులు చేశాడు. అంటే.. సచిన్ రికార్డుకు కేవలం 50 పరుగుల దూరంలో ఉన్నాడన్నమాట.

ఈ సమయంలో తాజా సిరీస్ లో భాగంగా.. ఇంగ్లాండ్ తో మిగిలిన రెండు వన్డేల్లో రోహిత్ కాస్త బ్యాట్ కు పనిచెబితే.. సచిన్ పేరిట ఉన్న రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం ఉంది. మరి.. ఈ రెండు వన్డేల్లోనే ఆ పని పూర్తి చేస్తాడా.. లేక, ఛాంపియన్స్ ట్రోఫీ వరకూ వెయిట్ చేయిస్తాడా అనేది వేచి చూడాలి.

కాగా... ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్ లో ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో శ్రీలంక మాజీ స్టార్ బ్యాటర్ సనత్ జయసూర్య ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. ఇతడు 506 మ్యాచుల్లో ఓపెనర్ గా బరిలోకి దిగి 19,298 పరుగులు చేశాడు. ఈ ఓవరాల్ జాబితాలో రోహిత్ శర్మ ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్ ల జాబితా ఈ కింది విధంగా ఉంది!

సనత్ జయసూర్య (శ్రీలంక) - 506 మ్యాచ్ లు - 19,298 పరుగులు

క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 441 మ్యాచ్ లు - 18,867 పరుగులు

డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) - 374 మ్యాచ్ లు - 18,744 పరుగులు

గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) - 342 మ్యాచ్ లు - 16,950 పరుగులు

డెస్మండ్ హేన్స్ - (వెస్టిండీస్) - 354 మ్యాచ్ లు - 16,120 పరుగులు

వీరేంద్ర సెహ్వాగ్ (భారత్) - 332 మ్యాచ్ లు - 16,119 పరుగులు

సచిన్ టెండుల్కర్ (భారత్) - 346 మ్యాచ్ లు - 15,335 పరుగులు

రోహిత్ శర్మ (భారత్) - 342 మ్యాచ్ లు - 15,285 పరుగులు