Begin typing your search above and press return to search.

12వ సారి టీమిండియాను వెంటాడిన దురదృష్టం... అయినప్పటికీ ఓ గుడ్ న్యూస్!

మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ టాస్ విషయంలో మాత్రం మరోసారి రోహిత్ శర్మ బ్యాడ్ లక్ కంటిన్యూ అయ్యింది. ఇది తాజా మ్యాచ్ తో పన్నెండోసారి కావడం గమనార్హం.

By:  Tupaki Desk   |   23 Feb 2025 10:13 AM GMT
12వ సారి టీమిండియాను వెంటాడిన దురదృష్టం... అయినప్పటికీ ఓ గుడ్ న్యూస్!
X

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ తాజాగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదలైంది. ఈ మ్యాచ్ ను భారత్, పాకిస్థాన్ దేశస్తులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారన్నా అతిశయోక్తి కాదేమో. ఈ సమయంలో భారత్ బ్యాడ్ లక్ మరోసారి కంటిన్యూ అయ్యింది.

అవును... ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. ఈ సమయంలో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సమయంలో ప్రస్తుతం భారత్ బౌలింగ్, ఫీల్డింగ్ ధాటికి పాక్ బ్యాటర్స్ కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. అదేమిటంటే... వన్డేల్లో భారత్ వరుసగా టాస్ ఓడిపోవడం ఇది 12వ సారి కావడం గమనార్హం. అవును... మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ టాస్ విషయంలో మాత్రం మరోసారి రోహిత్ శర్మ బ్యాడ్ లక్ కంటిన్యూ అయ్యింది. ఇది తాజా మ్యాచ్ తో పన్నెండోసారి కావడం గమనార్హం.

అయితే... ఇక్కడ టాస్ ఓడిపోయినప్పటికీ ఓ గుడ్ న్యూస్ ఉంది. ఈ దుబాయ్ స్టేడియంలో ఇప్పటివరకూ మొత్తం 59 మ్యాచ్ లు జరగగా.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం 22 మ్యాచ్ లలో గెలవగా.. ఒకటి ఫలితం తేలలేదు.. మరొకటి టై గా ముగిసింది. దీంతో.. టాస్ ఓడి బౌలింగ్ చేస్తోన్న టీమిండియాకు ఇదోరకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇక... దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ పాకిస్థాన్ కు చావో రేవో తేల్చుకోవాల్సి పోరనే సంగతి తెలిసిందే. ఇప్పటికే న్యూజిలాండ్ తో ఓటమి పాలైన పాక్.. ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. మరోవైపు బంగ్లాతో గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా... గెలుపుపై నమ్మకంతో ఉంది!