Begin typing your search above and press return to search.

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్

టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకోగా, రోహిత్ 261 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.

By:  Tupaki Desk   |   20 Feb 2025 2:48 PM GMT
వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్
X

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో విశేషమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ ఘనత సాధించాడు. చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద, ఒక బౌండరీ కొట్టి ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు సచిన్ టెండూల్కర్. రోహిత్ శర్మ 261 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ రికార్డుతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకోగా, రోహిత్ 261 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.

ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. అతను కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. రికీ పాంటింగ్ (286), సౌరవ్ గంగూలీ (288), జాక్వస్ కల్లీస్ (293) టాప్-6లో కొనసాగుతున్నారు.

-వన్డేల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..

1. విరాట్ కోహ్లీ -222 ఇన్నింగ్స్ లో

2.రోహిత్ శర్మ -261 ఇన్నింగ్స్ లో

3.సచిన్ -276 ఇన్నింగ్స్ లో

4. రికీపాంటింగ్ -286 ఇన్నింగ్స్ లో

5. సౌరవ్ గంగూలీ - 288 ఇన్నింగ్స్ లో

6. జాక్వెస్ కలిస్ -293 ఇన్నింగ్స్ లలో

అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేల్లో 11,000 పరుగుల మైలురాయిని చేరుకున్న పదో ఆటగాడిగా రోహిత్ శర్మ తన పేరును రికార్డుల్లో నమోదు చేసుకున్నాడు. ఇంతకు ముందు కేవలం తొమ్మిది మంది ఆటగాళ్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లెజెండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి తరువాత కుమార సంగక్కర, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.

- రోహిత్ శర్మ రికార్డులు

- వన్డేల్లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 11 వేల పరుగులు చేసిన రెండో ప్లేయర్ గా రోహిత్ కొనసాగుతున్నారు.

-మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్

- వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు

రోహిత్ శర్మ తన స్టైల్‌ ఆఫ్‌ ప్లే ద్వారా ఎన్నో చరిత్రలు సృష్టిస్తూ భారత క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడంలో ముందున్నాడు. ఇప్పటికే అభిమానుల హృదయాల్లో ‘హిట్‌మ్యాన్’గా గుర్తింపు పొందిన రోహిత్, భవిష్యత్తులో మరిన్ని రికార్డులను తన పేరిట లిఖించేందుకు సిద్ధంగా ఉన్నాడు!