Begin typing your search above and press return to search.

కెప్టెన్ ‘డకౌట్’.. ఈ విషయంలో ధోనీ సరసన రోహిత్.. టాప్ లో ఎవరంటే?

న్యూజిలాండ్ తో పుణెలో జరుగుతున్న రెండో టెస్టులో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టీమ్ ఇండియా తొలి రోజు చివర్లో బ్యాటింగ్ కు దిగింది.

By:  Tupaki Desk   |   25 Oct 2024 4:30 PM GMT
కెప్టెన్ ‘డకౌట్’.. ఈ విషయంలో ధోనీ సరసన రోహిత్.. టాప్ లో ఎవరంటే?
X

న్యూజిలాండ్ తో పుణెలో జరుగుతున్న రెండో టెస్టులో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టీమ్ ఇండియా తొలి రోజు చివర్లో బ్యాటింగ్ కు దిగింది. అయితే, కివీస్ ను తక్కువ స్కోరుకే ఆలౌట్ (259) చేసిన ఆనందం అంతలోనే ఆవిరైంది. దీనికి కారణం.. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరగడం. స్పిన్ విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్ పై న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌధీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు రోహిత్. దీంతో ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు మూడేళ్ల కిందటి వరకు టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడు కాని రోహిత్.. తన ఆటతీరును కొద్దిగా మార్చుకుని ఇప్పుడు కెప్టెన్ కూడా అయ్యాడు. కొన్ని కీలక ఇన్నింగ్స్ లూ ఆడాడు. కానీ.. కొన్నిసార్లు వికెట్ ఇచ్చేస్తున్నాడు.

రోహిత్ నిలిచి ఉంటే..

న్యూజిలాండ్ తో టెస్టులో స్టార్ బ్యాటర్ కోహ్లి (1) కూడా విఫలమయ్యాడు. అయితే, రోహిత్ తొలి రోజు గురువారం నిలిచి ఉంటే కథ వేరేగా ఉండేది. తనదైన శైలిలో రోహిత్ పరుగులు చేసి ఉంటే ప్రత్యర్థి స్కోరుకు దగ్గరగా అయినా వెళ్లేది. కానీ, అలా జరగకపోవడంతో 156 పరుగులకు ఆలౌటైంది. ఇక రోహిత్ డకౌట్ కావడంతోటే ఈ టెస్టులో భారత్ అవకాశాలకు దెబ్బపడింది. మరోవైపు డకౌట్ల విషయంలో మాజీ కెప్టెన్‌ మ‌హేంద్ర సింగ్ ధోని రికార్డును చేరాడు రోహిత్. భారత జట్టు కెప్టెన్‌ గా అంత‌ర్జాతీయ క్రికెట్‌ లో రోహిత్‌ కు మొత్తమ్మీద ఇది 11వ డ‌కౌట్. ధోనీ కూడా కెప్టెన్ గా ఉన్న స‌మ‌యంలో 11 సార్లు డ‌కౌటయ్యాడు.

కోహ్లినే టాప్..

ధోనీ 2007 నుంచి 2016 వరకు టీమ్ ఇండియాకు కెప్టెన్ గా ఉన్నాడు. రోహిత్ 2022 నుంచి టెస్టుల్లోనూ కెప్టెన్ అయ్యాడు. దీనికి అటుఇటుగా కొద్దిగా ముందు వన్డేలు, టి20ల్లో కెప్టెన్ అయ్యాడు. ఇక కోహ్లి 2014 చివర్లో టెస్టుల్లో, 2016 నుంచి వన్డేలు, టి20ల్లో సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌ గా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌటైన ఆట‌గాళ్లలో కోహ్లినే టాప్ లో ఉన్నాడు. 250 ఇన్నింగ్స్‌ లో అతడు 16 సార్లు డ‌కౌటయ్యాడు. తర్వాత సౌర‌భ్ గంగూలీ 13 సార్లు సున్నాకే వెనుదిరిగాడు. క‌పిల్ దేవ్ 115 ఇన్నింగ్స్‌ల్లో 10 సార్లు డకౌటయ్యాడు.