ఇప్పుడు రోహిత్ పై వేటు.. నీతా అంబానీ చిట్ చాట్ ఉద్దేశమిదే?
ఇక రోహిత్ శర్మ ఫామ్ మరింత ఆందోళనకరంగా మారుతోంది. మరొక్క నెల రోజుల్లో 38 ఏళ్లు నిండనున్న రోహిత్ కుర్రాళ్ల గేమ్ అయిన టి20ల్లో సత్తా చాటలేకపోతున్నాడు.
By: Tupaki Desk | 1 April 2025 12:11 PMటీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ మళ్లీ తెరపైకి వచ్చింది. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ లో దారుణ ఫెయిల్యూర్.. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేస్తారా? అన్న అనుమనాలు.. ఇప్పుడు ఐపీఎల్ లో దారుణ ప్రదర్శన.. దీంతో రోహిత్ అవసరం ఇంకా ఉందా? అంటూ కొన్ని వర్గాల నుంచి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్స్ కు ప్రశ్నలు వస్తున్నాయి.
ముంబై ఐదుసార్లు చాంపియన్ గా నిలవడంలో కచ్చితంగా రోహిత్ శర్మదే ప్రధాన పాత్ర. అయినప్పటికీ గత సీజన్ ముందు అతడిని తప్పించి అనూహ్యంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ నుంచి తీసుకొచ్చి కెప్టెన్ ను చేశారు. ఆ సీజన్ లోనే కాదు.. ఈ సీజన్ లోనూ ముంబై ప్రదర్శన బాగోలేదు.
ఇక రోహిత్ శర్మ ఫామ్ మరింత ఆందోళనకరంగా మారుతోంది. మరొక్క నెల రోజుల్లో 38 ఏళ్లు నిండనున్న రోహిత్ కుర్రాళ్ల గేమ్ అయిన టి20ల్లో సత్తా చాటలేకపోతున్నాడు. 0, 8, 13.. ఇవీ గత మూడు మ్యాచ్ లలో రోహిత్ స్కోర్లు. సోమవారం కోల్ కతాతో మ్యాచ్ లో ఆండ్రీ రస్సెల్ వంటి పార్ట్ టైమ్ బౌలర్ చేతిలో ఔటయ్యాడు.
ఈ మ్యాచ్ లో ముంబై గెలిచింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఓడిపోయి ఉంటే గనుక ముందుగా రోహిత్ పై విమర్శలు వెల్లువెత్తేవి. కాగా, మ్యాచ్ అనంతరం రోహిత్ తో ముంబై ఓనర్ నీతా అంబానీ సంభాషిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గత మూడు మ్యాచ్ లలో 21 పరుగులే చేసిన రోహిత్ తో నీతా అంత తీవ్రంగా చర్చించడాన్ని బట్టి చూస్తే వ్యవహారం సీరియస్ అనే అభిమానులు భావిస్తున్నారు.
ఐపీఎల్ అంటే ఆట-వ్యాపారం. ఇక్కడ ఆడినంత కాలమే గౌరవం. పైగా ఫ్రాంచైజీల ఓనర్లు ఫక్తు వ్యాపారులు. నిరుడు కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఇలాగే మ్యాచ్ అనంతరం తీవ్రంగా చర్చించుకున్నారు. తర్వాత రాహుల్ ఆ జట్టుకు దూరమయ్యాడు. మరి ఇప్పుడు రోహిత్-నీతా అంబానీ సీరియస్ డిస్కషన్ సారాంశం కూడా ఇదేనా?