Begin typing your search above and press return to search.

ఐపీఎల్ మెగా స్టార్ అతడే.. వచ్చే వేలంలో రూ.50 కోట్లు ధర

అయితే, ఆ లోటును తీరుస్తూ.. రికార్డును తిరగరాస్తూ భారత క్రికెట్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఏకంగా రూ.50 కోట్లకు వేలంలో ధర పలకనున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   24 Aug 2024 3:30 PM GMT
ఐపీఎల్ మెగా స్టార్ అతడే.. వచ్చే వేలంలో రూ.50 కోట్లు ధర
X

బాలీవుడ్ మెగాస్టార్ అంటే అమితాబ్ బచ్చన్.. టాలీవుడ్ మెగాస్టార్ అంటే చిరంజీవి.. సినిమాల్లో వారు స్టార్లే.. మరి క్రికెట్లో..? సునీల్ గావస్కర్ నుంచి విరాట్ కోహ్లి వరకు భారత క్రికెట్లో ఎందరో సూపర్ స్టార్లు పుట్టారు.. ఇంకా మరెందరో స్టార్ క్రికెటర్లు వచ్చారు.. ఇంకెందరో స్టార్లు అయ్యే దిశలో ఉన్నారు. కానీ, ఇప్పుడు వింటున్న ఓ మాట ప్రకారం అయితే.. అతడు భారత క్రికెట్ మెగాస్టార్ అని అనిపిస్తోంది. ఇంతకూ ఏం జరగనుందంటే..?

ధనాధన్ లీగ్ లో ధమాకా ఐపీఎల్ అంటేనే ఫోర్లు.. సిక్సర్ల ధమాకా. అలాంటి ‘ధనా’ధన్ లీగ్ లో ఇప్పటివరకు అత్యధిక ధర పలికింది ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్. 17 ఏళ్ల లీగ్ చరిత్రలో గత ఏడాది వేలంలో స్టార్క్ ను రూ.24.75 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సొంతం చేసుకుంది. అయితే, ఇది మినీ వేలం. ఇదే వేలంలో ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచ కప్ అందించిన ప్యాట్ కమ్మిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ ఆర్ హెచ్) రూ.20.50 కోట్లకు తీసుకుంది. ఇప్పటివరకు రూ.20 కోట్ల మార్క్ దాటిన క్రికెటర్లు వీరిద్దరే.

వారికి రెట్టింపు రేటు బ్యాట్స్ మెన్ ఆధిపత్యం చెలాయించే టి20 ఫార్మాట్లో.. అందులోనూ భారత్ లో జరిగే ఐపీఎల్ లో.. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ పూర్తి పేస్ బౌలర్లకు రికార్డు స్థాయి ధర దక్కడం కొంచెం విచిత్రమే. ఇప్పటివరకు ఏ బ్యాట్స్ మెన్ కూడా రూ.20 కోట్లు ధర పలకకపోవడం విశేషమే. అయితే, ఆ లోటును తీరుస్తూ.. రికార్డును తిరగరాస్తూ భారత క్రికెట్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఏకంగా రూ.50 కోట్లకు వేలంలో ధర పలకనున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే.. 18వ సీజన్ కు డిసెంబరులో మెగా వేలం జరగనుంది. ఇందులో రోహిత్ తన ముంబై ఇండియన్స్ ను వీడనున్నట్లు, లేదా ఫ్రాంచైజీనే అతడిని వదిలేయనున్నట్లు సమాచారం. ఇక రోహిత్ ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఒకదానికి ఒకటి పోటీ పడడం సహజం. ఈ క్రమంలోనే అతడికి ఆల్‌ టైమ్ రికార్డు ధర దక్కడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ పై ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తిగా ఉన్నాయని, రూ.50 కోట్లు చెల్లించేందుకూ సిద్దంగా ఉన్నాయని ఓ క్రీడా చానెల్ ప్రతినిధి అంచనా వేశాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?