వన్డేల్లో రిటైర్మెంట్ పై రోహిత్ రియాక్షన్ ఇదే
ఇటీవల జరిగిన టీ20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ విజయతీరాలకు చేర్చి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 July 2024 7:24 AM GMTఇటీవల జరిగిన టీ20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ విజయతీరాలకు చేర్చి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 17 ఏళ్ల తర్వాత భారత్ ఖాతాలో టీ20 ప్రపంచ కప్ చేరడంలో హిట్ మాన్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే యువతరం క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ మ్యాచ్ పూర్తవగానే విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా రిటర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు గౌతీ కొన్ని కండిషన్లు పెట్టాడని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లోనే వారిద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తారన్న పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రోహిత్ శర్మ ఆ వ్యవహారంపై స్పందించాడు. తాను రిటైర్మెంట్ గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని, మరీ అంత దూరం ఆలోచించే మనసత్వం తనది కాదని రోహిత్ క్లారిటీనిచ్చాడు. మరికొంత కాలం తన ఆటను చూస్తారని రోహిత్ శర్మ చేసిన ప్రకటనతో ఇప్పట్లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ లేదన్న క్లారిటీ వచ్చేసింది.
ఇప్పటివరకు టీ20 అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ 1509 మ్యాచ్ లు ఆడి 4231 పరుగులు చేశాడు. ఇంటర్నేషనల్ టీ20 లలో అత్యధికంగా 5 సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మకు రికార్డు ఉంది. ఇక, 2007 టీ20 ప్రపంచ కప్ తో పాటు 2024 టీ20 ప్రపంచ కప్ లో ఆడిన ఆటగాడు రోహిత్ శర్మ. తాజాగా, తన రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ చేసిన ప్రకటనతో హిట్ మాన్ ఫాన్స్ ఖుషీగా ఉన్నారు.