Begin typing your search above and press return to search.

బ్యాట్ మార్చి ఉంటే... సైనా నెహ్వాల్ మనసులో మాట!

ఇండియన్ బ్యాట్మింటన్ గురించి రేపటి జనరేషన్ మాట్లాడుకోవాలంటే... సైనా నుంచే మొదలుపెట్టాలన్నా అతిశయోక్తి కాదు.

By:  Tupaki Desk   |   12 July 2024 5:41 AM GMT
బ్యాట్ మార్చి ఉంటే... సైనా నెహ్వాల్ మనసులో మాట!
X

సైనా నెహ్వాల్... ఇండియన్ బ్యాట్మింటన్ కి సరికొత్త గౌరవం తెచ్చిన క్రీడాకారిని. ఇదే సమయంలో ఈ క్రీడకు జనాల్లో ఆసక్తి, ఆదరణ తెచ్చిన క్రీడాకారిణి. బ్యాట్మింటన్ లో ప్రపంచ నంబర్ ర్యాంక్ సాధించిన క్రీడాకారిణి. ఇండియన్ బ్యాట్మింటన్ గురించి రేపటి జనరేషన్ మాట్లాడుకోవాలంటే... సైనా నుంచే మొదలుపెట్టాలన్నా అతిశయోక్తి కాదు.

ఆ విధంగా.. బ్యాడ్మింటన్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకుతో పాటు ఒలింపిక్స్ లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులు సృష్టించిన సైనా నెహ్వాల్.. ఇండియాలో బ్యాట్మింటన్ కు సరికొత్త ఆదరణ, ఆకర్షణ తెచ్చిన సైనా నెహ్వాల్... తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తాను టెన్నీస్ బ్యాట్ పట్టుకుని ఉంటే... అంటూ స్పందించారు.

అవును... బ్యాట్మింటన్ రంగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకుతో పాటు ఒలింపిక్స్ లో పథకం సాధించిన సైనా నెహ్వాల్... బ్యాట్మింటన్ బదులు టెన్నీస్ ను కెరీర్ గా ఎంచుకుని ఉంటే మరిన్ని గొప్ప విజయాలు అందుకునే దాన్నని ఇండియన్ షెట్లర్ సైనా నెహ్వాల్ తెలిపారు. టెన్నీస్ లో ఎక్కువ డబ్బు కూడా ఉందని అన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన సైనా నెహ్వాల్... తన తల్లితండ్రులు తనను టెన్నీస్ లో చేర్చివుంటే బాగుండని కొన్నిసార్లు అనిపిస్తుంటుందని.. టెన్నిస్ లో ఎక్కువ డబ్బు ఉందని అన్నారు. ఇదే సమయంలో... బ్యాడ్మింటన్ లో కంటే టెన్నిస్ లో మరింత గొప్పగా రాణించే అవకాశం ఉండేది అని తెలిపారు.

అయితే... బ్యాడ్మింటన్ ఆరంభించేటప్పుడు తనకంటూ ఆదర్శం ఎవరూ లేరని.. మరొకరిలా ప్రపంచ నంబర్ వన్ కావాలని, ఒలింపిక్స్ పతకం సాధించాలని అనుకునే పరిస్థితి అప్పుడు తనకు లేదని అన్నరు. అందుకు గల కారణం... తనకంటే ముందు ఎవరూ బ్యాడ్మింటన్ లో ఆ ఘనతలు అందుకోలేదని సైనా స్పష్టం చేశారు.

అయితే భారత్ లో బ్యాడ్మింటన్ కంటే టెన్నిస్ కు ఎక్కువ ఆదరణ ఉందని, బ్రాండ్ అంబాసిడర్స్ గా కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కి తక్కువ అవకాశాలుంటున్నాయనే ఆవేదనతోనే సైనా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.