Begin typing your search above and press return to search.

ఆ యువ క్రికెటర్ కు ఎట్టకేలకు పదేళ్ల కు టీమిండియా పిలుపు

45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 66 ఇన్నింగ్స్ 3,912 పరుగులు.. సగటు దాదాపు 70. కానీ ,ఆ యువ క్రికెటర్ కొన్నేళ్లుగా టీమిండియాకు మాత్రం ఎంపికకాలేదు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 1:30 AM GMT
ఆ యువ క్రికెటర్ కు ఎట్టకేలకు పదేళ్ల కు టీమిండియా పిలుపు
X

45 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 66 ఇన్నింగ్స్ 3,912 పరుగులు.. సగటు దాదాపు 70. కానీ ,ఆ యువ క్రికెటర్ కొన్నేళ్లుగా టీమిండియాకు మాత్రం ఎంపికకాలేదు.. కేవలం 12 ఏళ్ల వయసులో స్కూల్ క్రికెట్ లో అత్యధిక పరుగుల (439) రికార్డు సాధించిన అతడు 14 తర్వాత కానీ టీమిండియా గడప తొక్కలేకపోయాడు. అయితే, ఈ మధ్యలో చాలా డ్రామా నడిచింది. వయసు విషయంలో మోసం చేశాడంటూ ఆరోపణలతో సస్పెన్షన్ కు గురయ్యాడు. అయితే, అవన్న తప్పని తేలింది. అండర్ 19 దేశవాళీ జట్టులో అదరగొట్టి.. జాతీయ జట్టులోనూ దుమ్మురేపాడు. మళ్లీ అంతలోనే సొంత రాష్ట్ర అసోసియేషన్ తో విభేదాలు.. ఎక్కడో ఉన్న ఉత్తరప్రదేశ్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం. భారీగా బరువు పెరిగి ఓ దశలో అతడి కెరీర్ అయిపోయిందా? అనే అనుమానాలు.. మధ్యలో ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి జట్టుకు అత్యంత చిన్న వయసులో కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడి స్టార్ బ్యాటర్ కోహ్లితోనే ప్రశంసలు.. మళ్లీ బ్యాడ్ టైమ్.. చివరకు సొంత రాష్ట్రానికి వచ్చి రంజీల్లో సూపర్ ఫామ్.. అయినా జాతీయ జట్టు అవకాశం చిక్కలేదు.. ఇలా ఎన్నో మలుపులు.. కానీ, అవన్నీ దాటుకుని వచ్చిన అతడు తన కష్టానికి ప్రతిఫలం పొందాడు.

సర్ఫరాజ్ ఖాన్.. భారత క్రికెట్ లో 2012 నుంచి వినిపిస్తున్న పేరు. అప్పటికి 12 ఏళ్లుంటాయేమో..? 2012లో హారిస్ షీల్డ్ ట్రోఫీలో రిజ్వి స్ప్రింగ్ ఫీల్డ్ తరఫున బరిలో దిగి 439 పరుగులు చేశాడు అతడు. కొన్నేళ్లలోనే టీమిండియాకు ఆడతాడని అనుకుంటే ఆ నిరీక్షణ 12 ఏళ్లు పట్టింది. మూడేళ్లుగా అత్యంత నిలకడ చూపుతున్న అతడిని ఎట్టకేలకు సెలక్టర్లు కరుణించారు. సెంచరీల మీద సెంచరీలు బాదుతున్న అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడడంతో సర్ఫరాజ్ కు పిలుపొచ్చింది.

తుది జట్టులో చోటుంటుందా..?

ఇన్నాళ్లూ మిడిలార్డర్ లో ఖాళీ లేకపోవడంతో సర్ఫరాజ్ కు టీమిండియా ఎంట్రీ కష్టమైంది. దీంతో పాటు భారీకాయం. ఫిట్ నెస్ పై సందేహాలతో చాన్స్ రాలేదు. కాగా, సర్ఫరాజ్‌ ఖాన్‌ ప్రస్తుతం ఇంగ్లండ్ లయన్స్ (ఇంగ్లండ్ -ఎ) జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. రెండో టెస్టులో గత గురువారం భారీ సెంచరీ (161; 160 బంతుల్లో 18×4, 5×6) కొట్టాడు. కాగా, విశాఖపట్నంలో వచ్చే నెల 2 నుంచి జరగనున్న రెండో టెస్టులో సర్ఫరాజ్ మైదానంలోకి దిగుతాడా? అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడా? అనేది చర్చనీయాంశం కానుంది. సీనియర్లు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలను కాదని సర్ఫరాజ్ ను తీసుకున్నారు సరే.. తుది జట్టులోనూ ఉంటాడా? అంటే చెప్పడం కష్టమే. కేఎల్ రాహుల్ స్థానంలో నాలుగో నంబరు బ్యాట్స్ మన్ గా సర్ఫరాజ్ ను ఆడిస్తారని భావించవచ్చు. అయితే అతడికి రజత్ పటీదార్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. వాస్తవానికి సర్ఫరాజ్ ప్యూర్ మిడిలార్డర్ బ్యాట్స్ మన్. పటీదార్ మాత్రం టాప్ ఆర్డర్. కానీ, ఇద్దరిలో పటీదార్ కే కాస్త మార్కులు ఎక్కువ పడుతున్నాయి. అతడి టెక్నిక్ కాస్త మెరుగ్గా ఉండడమే దీనికి కారణం. మిడిలార్డర్ కోసమే ఆలోచిస్తే మాత్రం సర్ఫరాజ్ కు చాన్స్ దక్కడం ఖాయం.

మిగతా టెస్టులకూ చోటు..

సర్ఫరాజ్ కు గనుక విశాఖ టెస్టులో చోటిస్తే మిగతా మూడు మ్యాచ్ లకూ ఆడించడం ఖాయమే. శుబ్ మన్ గిల్ ఫామ్ తగ్గుతోంది. రాహుల్ గాయం ఎప్పటికి నయం అవుతుందో చెప్పలేం. కోహ్లి తిరిగొస్తే గిల్ ను పక్కనపెట్టొచ్చు. అలా చూసినా ఒక బ్యాట్స్ మన్ స్థానం ఖాళీ. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ కు చాన్సులు దక్కొచ్చనేది అంచనా.