Begin typing your search above and press return to search.

టీ20 ప్రపంచ కప్ లో సంచలనం.. పాక్ ను చిత్తు చేసిన అమెరికా

అటు బౌలింగ్ లోనూ.. ఇటు బ్యాటింగ్ లోనూ తన సత్తా చాటటం ద్వారా మాజీ చాంపియన్ ను చిత్తు చేయటం క్రికెట్ ప్రపంచంలో కొత్త సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   7 Jun 2024 5:30 AM GMT
టీ20 ప్రపంచ కప్ లో సంచలనం.. పాక్ ను చిత్తు చేసిన అమెరికా
X

తాజాగా జరుగుతున్న టీ 20 ప్రపంచ కప్ పోటీల్లో సంచలన విజయం ఒకటి నమోదైంది. పిల్ల జట్టు అమెరికా.. ఏకంగా పాక్ జట్టును చిత్తు చేయటం షాకింగ్ గా మారింది. తొలిసారి వరల్డ్ కప్ బరిలోకి దిగిన అతిథ్య అమెరికా జట్టు తన అద్భుత ప్రదర్శన చేసింది. అటు బౌలింగ్ లోనూ.. ఇటు బ్యాటింగ్ లోనూ తన సత్తా చాటటం ద్వారా మాజీ చాంపియన్ ను చిత్తు చేయటం క్రికెట్ ప్రపంచంలో కొత్త సంచలనంగా మారింది.

నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు సమానంగా స్కోర్టు చేయటంతో తుది నిర్ణయాన్ని డిసైడ్ చేసేందుకు సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇందులో అమెరికా జట్టు చూసిన ప్రతిభతో పాక్ ఓటమిపాలై.. షాకింగ్ అనుభవాన్ని చవి చూసింది. 2009 విజేగ పాక్ జట్టు తాజా మ్యాచ్ లో ఎదురైన పరాభవంతో టోర్నీని షురూ చేయగా.. తొలి మ్యాచ్ పై కెనడాపై నెగ్గిన యూఎస్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయటం ఆసక్తికరంగా మారింది.

టాప్ ఓడిన తొలుత బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇందులో బాబర్ ఆజమ్ 43 బంతుల్లో 44 పరుగులు.. షాదాబ్ ఖాన్ 25 బంతుల్లో 40 పరుగులు చేసి రాణించారు. చివర్లో షాహిన్ అఫ్రిది 16 బంతుల్లో 23 పరుగులు చేశారు. అమెరికా బౌలర్లలో నాస్తుష్.. కెన్ జిగేలు మూడేసి వికెట్లు చొప్పున పడగొట్టారు. సౌరభ్ నేత్రావల్కర్ రెండు వికెట్లు తీశారు.

బ్యాటింగ్ మొదలుపెట్టిన అమెరికా జట్టు 20 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. కెప్టెన్ మోనాంక్ పటేల్ 38 బంతుల్లో 50 పరుగులు.. ఆరోన్ జోన్స్ 26 బంతుల్లో 36 పరుగులు.. గూస్ 26 బంతుల్లో 35 పరుగులు చేయటంతో మ్యాచ్ లోస్కోర్ సమం అయ్యింది. దీంతో.. సూపర్ ఓవర్ ను తీసుకురాగా.. 5 పరుగులతో పాక్ ను అమెరికా జట్టు ఓడించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో పాక్ కు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ రోజు న్యూయార్క్ వేదికగా జరిగే మ్యాచ్ లో ఐర్లాండ్ - కెనడా జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. స్టార్ స్పోర్స్.. హాట్ స్టార్ లో లైవ్ మ్యాచ్ ను చూడొచ్చు.