Begin typing your search above and press return to search.

మిచెల్ మార్ష్‌ పై మహ్మద్ షమీ ఫైర్... కీలక వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా మార్ష్ తీరుపై విచారం వ్యక్తం చేశాడు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 12:04 PM GMT
మిచెల్  మార్ష్‌  పై మహ్మద్  షమీ ఫైర్... కీలక వ్యాఖ్యలు!
X

వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌ లో భారత్‌ పై విజయం సాధించాక ఆస్ట్రేలియా ఆటగాళ్ల సెలబ్రేషన్‌ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారిన సంగతి తెలిసిందే. గెలిచిన వాళ్లు సంబరాలు చేసుకోవడం, ఓడిన వాళ్లు దిగాలుగా కూర్చోవడం అత్యంత సహజం. అంతవరకూ సరే కానీ... ప్రధానంగా ఆసీస్ ఆల్‌ రౌండర్‌ మిచెల్ మార్ష్ చేసిన ఒక బలుపు పనిమాత్రం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. తాజాగా ఈ విషయంపై షమీ స్పందించాడు.

వరల్డ్ కప్ ఫైనల్ లో గెలిచిన అనంతరం ఆసిస్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఎవరి ఆనందంలో వారు మునిగి తేలారు. వారికి ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి. ఈ సమయంలో చేతిలో బీరు పట్టుకుని, సోఫాలో కూర్చిని, కాళ్లు తెచ్చి వరల్డ్ కప్ ట్రోఫీపై పెట్టిన మార్ష్ ఫోటోలు వైరల్ గా మారాయి. మార్ష్‌ బలుపు వ్యవహారంపై క్రికెట్ అభిమానులు తీవ్రంగా విరుచుకుపడ్డారు.

అటు క్రికెట్ అభిమానులే కాకుండా... పలువురు మాజీలు సైతం మిచెల్ మార్ష్ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. మరోపక్క భారత్ లో ఇప్పటికే మార్ష్ పై ఎఫ్.ఐ.ఆర్. నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా మార్ష్ తీరుపై విచారం వ్యక్తం చేశాడు. ఇందులో భాగంగా మిచెల్ మార్ష్ వ్యవహరించిన తీరు తనకు ఏ మాత్రం నచ్చలేదని మహ్మద్ షమీ సూటిగా చెప్పాడు.

ఈ క్రమంలో... వన్డే ప్రపంచకప్ ట్రోఫీ మీద మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టిన ఫోటో చూసి తాను చాలా బాధపడినట్లు చెప్పిన షమీ... ప్రతి జట్టు పోటీపడే ట్రోఫీ అది.. అందరూ సాధించాలని కలలు కనే ట్రోఫీ అది.. అలాంటి ట్రోఫీపై కాళ్లు పెట్టడం సంతోషాన్ని కలిగించలేదని షమీ అన్నాడు. ఇది ఏమాత్రం సరైన చర్య కాదని నొక్కి చెప్పాడు!

కాగా... ప్రపంచకప్‌ 2023లో షమీ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్ ల అనంతరం ఎంట్రీ ఇచ్చిన షమీ... 7 మ్యాచ్ లలో 5.26 ఎకానమీతో 24 వికెట్లు తీశాడు. ఫలితంగా వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ గా నిలిచాడు. ఇందులో మూడుసార్లు ఐదేసి వికెట్లు తీశాడు!

ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమైన తరుణంలో తుది జట్టులో మహ్మద్ షమీ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. లీగ్‌ దశలో మొదటి నాలుగు మ్యాచ్ లూ ఆడని షమీ... న్యూజిలాండ్‌ పై జరిగిన మ్యాచ్ లో ఫైవ్‌ వికెట్ల హాల్‌ నమోదు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌ పై నాలుగు, శ్రీలంకపై ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ లో రెండు వికెట్లు తీసిన షమీ.. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ పై ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు.