Begin typing your search above and press return to search.

'ఇక గుడ్ బై'... బిగ్ షాకిచ్చిన టీం ఇండియా గబ్బర్ శిఖర్ ధావన్!

అవును... టీంఇండియా సీనియర్ స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ సంచలన ప్రకటన చేశాడు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 5:29 AM GMT
ఇక గుడ్  బై... బిగ్  షాకిచ్చిన టీం ఇండియా గబ్బర్  శిఖర్  ధావన్!
X

టీంఇండియా సీనియర్ స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్.. క్రికెట్ అభిమానులకు, తన అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఇందులో భాగంగా తాజాగా ఓ సంచలన ప్రకటన చేశాడు. ఈ మేరకు ఆటకు వీడ్కోకు పలుకుతున్నట్లు గబ్బర్ తెలిపాడు. దీంతో... ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ క్రమంలో గబ్బర్ ఓ వీడియో విడుదల చేశాడు.

అవును... టీంఇండియా సీనియర్ స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ సంచలన ప్రకటన చేశాడు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా తన నిర్ణయం గురించి వెళ్లడించడానికి సోషల్ మీడియాలో ఓ ఉద్వేగభరిత వీడియోను విడుదల చేశాడు. శనివారం ఉదయం దీన్ని పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో గబ్బర్ వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి...!

ప్రస్తుతం తాను ఓ కీలక పాయింట్ వద్ద ఉన్నట్లు చెబుతున్న శిఖర్ ధావన్... వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో జ్ఞాపకాలు కనిపిస్తున్నాయని.. ఇదే సమయంలో ముందుకు వెళ్తే కొత్త జీవితం ఉందని తెలిపాడు. దేశం కోసం ఆడాలనేది తన కల అని.. అదృష్టవసాత్తు ఆ కల నెరవేరిందని చెబుతూ... ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ఫ్యామిలీ, చిన్ననాటి కోచ్ లు, జట్టుకు కృతజ్ఞతలు తెలిపాడు.

ఈ క్రికెట్ వల్లే తనకు ఓ కొత్త ఫ్యామిలీ, పేరు, ఎంతో ప్రేమాభిమానాలు లభించాయని వెల్లడించాడు. అయితే... జీవితంలో ముందుకు వెళ్లాలంటే పేజీలు తిప్పక మానదు అని చెప్పిన గబ్బర్... అందువల్లే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. ఇలా క్రికెట్ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతుంటే తన హృదయం శాంతితో నిండిందని తెలిపారు.

ఇదే క్రమంలో... నాదేశం కోసం నేను ఎంతో ఆడాను అని సగర్వంగా చెప్పుకుంటున్న శిఖర్ ధావన్... ఇకపై మళ్లీ ఆ అవకాశం రాకపోవచ్చని, అందుకే బాధపడాల్సిన అవసరం లేదని తన మనసుకు చెబుతున్నట్లు వివరించాడు. ఏది ఏమైనా... తన తాజా నిర్ణయంతో అటు తన అభిమానులను, టీంఇండియా క్రికెట్ అభిమానులను షాక్ కి గురిచేశాడు శిఖర్ ధావన్ అలియాస్ గబ్బర్!!

కాగా... టీంఇండియా ఓపెనర్ గా తనదైన స్టైల్లో మెరుపులు మెరిపించిన శిఖర్ ధావన్ తన కేరీర్ లో ఇప్పటివరకూ 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఈ క్రమంలో... వన్డేల్లో 6,793.. టెస్టుల్లో 2,315.. టీ20ల్లో 1,759 పరుగులు చేశాడు. ఇందులో వన్డేల్లో 17, టెస్టుల్లో 7 సెంచరీలు ఉన్నాయి.

ఇక ఐపీఎల్ విషయానికొస్తే... హైదరాబాద్ తో పాటు ముంబై, ఢిల్లీ, పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు శిఖర్ ధావన్. ఇదే క్రమంలో... పంజాబ్, ఢిల్లీ జట్లకు కెప్టెన్ గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. మొత్తం మీద ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 222 మ్యాచ్ లు ఆడిన ధావన్... 6769 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.