Begin typing your search above and press return to search.

రాఫెల్ నాదల్ వేవ్స్... చివరి మ్యాచ్ టిక్కెట్ ధర తెలిస్తే షాకే!

ఇందులో భాగంగా ఓ టిక్కెట్ ధర ఏకంగా 34,500 యూరోలు (సుమారు 31 లక్షల రూపాయలు) పలుకుతున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   16 Oct 2024 5:58 PM GMT
రాఫెల్  నాదల్  వేవ్స్... చివరి మ్యాచ్  టిక్కెట్  ధర తెలిస్తే షాకే!
X

టెన్నీస్ లెజెండ్ రాఫెల్ నాదల్ ఇటీవల తన ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఆయన అభిమాన ప్రపంచంలో బిగ్ షాకింగ్ న్యూస్ గా మారింది. ఈ సమయంలో అతని చివరి మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున సిద్ధపడుతున్నారని అంటున్నారు. దీంతో.. టిక్కెట్ రేట్లు ఆకాశానికి వెళ్లాయని చెబుతున్నారు.

అవును.. 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను, 14 ఫ్రెంచ్ ఓపెన్ భారీ టైటిల్స్ ను, 92 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్ ను, ఒక ఒలింపిక్స్ బంగారు పతకాన్ని గెలిచి.. దశాబ్ధాలపాటు టెన్నిస్ అభిమానుల గుండెల్లో నిలిచిన "కింగ్ ఆఫ్ క్లేవ్" తన ఆటకు స్వస్థి పలకనున్నాడు! కోట్ల అభిమానులకు రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించి ఆవేదన కలిగించాడు.

ఈ క్రమంలో ఇటీవల సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వీడియోలో... నాదల్ ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నప్పుడు తన తీపి, చేదు జ్ఞాపకాలను వ్యక్తం చేశాడు. ఇది చాలా కష్టమైన నిర్ణయం అని.. దీన్ని తీసుకోవడానికి చాలా సమయం పట్టిందని.. జీవితంలో ప్రతీదానికీ ఆరంభం, ముగింపు ఉంటాయని తెలిపారు.

ఇక పారిస్ క్లే పై 112 విజయాలు 4 ఓటముల రికార్డును కలిగి ఉన్న నాదల్... నవంబర్ 19 నుంచి 24 వరకూ స్పెయిన్ లోని మలాగాలో జరిగే డేవిస్ కప్ నాకౌట్ దశలో తన చివరి టోర్నమెంట్ ఆడనున్నాడు. దీంతో... టొర్నీ టిక్కెట్లు విడుదలైన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి!

ఈ సమయంలో... అధికారిక ఫ్లాట్ ఫాం లలో అందుబాటులో లేని టిక్కెట్లు ఇప్పుడు రీసెల్లింగ్ సైట్ లపై భారీ ధరలకు విక్రయించబడుతున్నాయి. ఇందులో భాగంగా ఓ టిక్కెట్ ధర ఏకంగా 34,500 యూరోలు (సుమారు 31 లక్షల రూపాయలు) పలుకుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఇదంతా రాఫెల్ నాధల్ వేవ్ అని.. అతని చివరి టోర్నీ చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారని అంటున్నారు.