తుపాకీ చెప్పినట్లే.. యువ ఓపెనర్ 2 మ్యాచ్ లకు దూరం.. మూడోదీ డౌటే?
అయితే అతడు డెంగీ బారిన పడ్డాడు. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడలేదు. రెండో మ్యాచ్ బుధవారం అఫ్ఘానిస్థాన్ తో ఉంది. దీనికీ గిల్ దూరమయ్యాడు.
By: Tupaki Desk | 10 Oct 2023 12:29 PM GMTఏడాది నుంచి మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తూ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ దుమ్మురేపుతున్న టీమిండియా యువ క్రికెటర్ కు తొలి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడాలన్న కల నెరవేరేందుకు కాస్త సమయం పట్టేలా ఉంది. ప్రస్తుతం టాప్ ప్లేయర్ గా ఉన్న అతడు అనూహ్యంగా మూడు మ్యాచ్ లకు దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికైతే రెండో మ్యాచ్ కూ బరిలో దిగడం లేదని స్పష్టమైంది. మూడోదీ కష్టమే అని అంటున్నారు.
స్టార్ హోటళ్లలోనూ దోమలా?
టీమిండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ ప్రస్తుతం ఏస్థాయిలో ఆడుతున్నాడో తెలిసిందే. మ్యాచ్ మ్యాచ్ కూ రాటుదేలుతూ మంచి నీళ్ల ప్రాయంలా సెంచరీలు కొడుతున్నాడు. అలాంటి ఓపెనర్ కు ప్రపంచ కప్ మహా అవకాశం. అందులోనూ సొంతగడ్డంపై జరుగుతున్న టోర్నీ కావడంతో పరుగులు భారీగా సాధిస్తాడని అంచనాలు పెట్టుకున్నారు. అయితే అతడు డెంగీ బారిన పడ్డాడు. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడలేదు. రెండో మ్యాచ్ బుధవారం అఫ్ఘానిస్థాన్ తో ఉంది. దీనికీ గిల్ దూరమయ్యాడు. పాకిస్థాన్ తో శనివారం అహ్మదాబాద్ లో జరిగే మూడో మ్యాచ్ లోనూ గిల్ ఆడడం డౌటే. కాగా, జాతీయ క్రికెటర్లదంతా హై లైఫ్ స్టైల్. స్టార్ హోటళ్లలోనే బస చేస్తారు. అలాంటిది గిల్ ను దోమలు కుట్టడం ఏమిటో?
స్టేడియంలో కుట్టి ఉంటాయా?
స్టార్ హోటళ్లను నిందించలేం కాబట్టి.. గిల్ ను స్టేడియంలో దోమలు కుట్టి ఉంటాయా? అని అనుమానించాలి. ప్రపంచ కప్ నకు ముందు గిల్.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడాడు. ఆ సమయంలో మైదానంలో ప్రాక్టీస్ సందర్భంగానో, మ్యాచ్ జరిగేటప్పుడు డగౌట్ లోనో దోమలు కుట్టి ఉంటాయని భావించాలి.
పాక్ తో మ్యాచ్ కూ లేకుంటే ఎలా?
ప్రస్తుతం టీమ్ లో అత్యంత నిలకడగా ఆడుతున్నది గిల్ ఒక్కడే. అలాంటివాడు ప్రపంచ కప్ లో కీలకమైన పాకిస్థాన్ తో మ్యాచ్ కు అందుబాటులో లేకుంటే ఇబ్బందే. ఏ విషయమైనదీ నిర్ధారణ కానప్పటికీ గిల్ పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడడం అనుమానంగానే ఉంది.
కొసమెరుపు: వన్డే ప్రపంచ కప్ పూర్తిగా భారత్ లోనే జరుగతోంది. ఈ సందర్భంగానే గిల్ విష జ్వరం బారినపడ్డాడు. అతడి ప్లేట్ లెట్స్ లక్ష లోపునకు పడిపోయాయి. ఇది భారత ప్లేయర్ కు జరిగింది కాబట్టి ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. అదే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాడి విషయంలో జరిగి ఉంటే నానాయాగీ చేసేవారనడంలో సందేహం లేదు.