స్మృతి మంధానకు నచ్చే అబ్బాయిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఇవే!
"ఇన్ స్టాలోనూ.. సోషల్ మీడియా అకౌంట్లలో మిమ్మల్ని ఎక్కువగా అబ్బాయిలు ఫాలో అవుతుంటారు. మీకు నచ్చే కుర్రాడిలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి?" అంటూ ప్రశ్నించాడు.
By: Tupaki Desk | 28 Dec 2023 8:30 AM GMTయూత్ కు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరుగా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన. టీమిండియా మహిళా క్రికెటర్లలో అత్యధిక ఫాలోయింగ్ ఉండటమే కాదు.. ఆమె గురించి ఆసక్తిగా చదివేవారు.. చూసేవారు ఎంత భారీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆమె ఆటలోనే కాదు.. అందంలోనూ అదరగొట్టేస్తుంటారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్న ఫాలోయర్ల లెక్క చూస్తే.. యూత్ లో ఆమెకున్న క్రేజ్ ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. కొందరైతే ఆమె మీద కవిత్వం చెప్పేందుకు అస్సలు మొహమాటపడరు.
అలాంటి స్మృతి మంధాన తాజాగా బిగ్ బి ప్రయోక్తగా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాంకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమెను ఒక అభిమాని ఆసక్తికర ప్రశ్నను సంధించాడు. "ఇన్ స్టాలోనూ.. సోషల్ మీడియా అకౌంట్లలో మిమ్మల్ని ఎక్కువగా అబ్బాయిలు ఫాలో అవుతుంటారు. మీకు నచ్చే కుర్రాడిలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి?" అంటూ ప్రశ్నించాడు. అతగాడి ప్రశ్నకు స్మృతి మంధాన పెద్దగా నవ్వేయగా.. అమితాబ్ కలుగజేసుకొని.. మీకు పెళ్లైందా? అని అడగ్గా.. కాలేదని ఆ కుర్రాడు చెప్పాడు.
తన సమాధానంగా ఆమె ఏం చెప్పాలా? అన్నట్లుగా ఉండిపోయారు. తనను ఇలాంటి ప్రశ్నను అడుగుతారని తాను అనుకోలేదన్న ఆమె.. "అచ్చా లడ్కా హూ" (మంచి అబ్బాయి అయి ఉండాలి) అని చెప్పగా.. బిగ్ బి కలుగజేసుకొని.. మీ ఉద్దేశంలో మంచి అబ్బాయి అంటే అర్థం ఏమిటి? అని ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఆమె.. తనను కేరింగ్ గా చూసుకోవాలని.. తన ఆటను అర్థం చేసుకోవాలని.. ఈ రెండే ముఖ్యమైన అంశాలుగా పేర్కొన్నారు.
ఒక అమ్మాయిగా తాను సదరు అబ్బాయికి ఎక్కువ టైం ఇవ్వలేనని.. అలాంటప్పుడు ఆ విషయాన్ని అతను అర్థం చేసుకోవాలని.. ఆ రెండు లక్షణాలున్న అబ్బాయి తనకు నచ్చుతాడంటూ ఓపెన్ అయ్యారు. ఆమె మాటల చిట్టివీడియో ఇప్పుడు పెద్దఎత్తున వైరల్ గా మారింది. మొత్తానికి కోట్లాది కుర్రకారు మనసుల్ని దోచేసిన స్మృతి మంధానకు ఎలాంటి మైండ్ సెట్ ఉన్నఅబ్బాయి అవసరమన్న విషయాన్ని ఆమె షేర్ చేసుకోవటం ద్వారా అందరికి అర్థమైందని చెప్పాలి.