Begin typing your search above and press return to search.

ఇరువైపులా విధ్వంసం... మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్ సాగిందిలా!

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా... మూడో మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్.. కోక్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది

By:  Tupaki Desk   |   24 March 2024 3:31 AM GMT
ఇరువైపులా విధ్వంసం... మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్ సాగిందిలా!
X

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా... మూడో మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్.. కోక్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో... సునీల్ నరైన్‌, ఫిలిప్‌ సాల్ట్‌ లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు.

స్లోగా మొదలై.. సాల్ట్ మెరుపులతో ప్రారంభం!:

సునీల్ నరైన్, సాల్ట్ లు కోల్ కతా తరుపున ఇన్నింగ్స్ ఆరంభించగా... హైదరాబాద్ నుంచి భూవనేశ్వర్ తొలి ఓవర్ బౌలింగ్ చేశారు. ఈ సమయంలో.. భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్‌ లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో కాస్త స్లోగానే స్టార్ట్ అయ్యింది మ్యాచ్ అనుకునేలోపు... మార్కో జాన్ సన్ వేసిన రెండో ఓవర్ లో సాల్ట్ హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టాడు. దీంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తి పోయింది.

అయితే... ఇదే ఓవర్ లో ఆఖరి బంతికి లేని పరుగుకి ప్రయత్నించిన నరైన్ ను అహ్మద్ స్ట్రైట్ త్రో తో రనౌట్ అయ్యాడు. దీంతో... మొదటి రెండు ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయిన కేకేఆర్ 23 పరుగులు చేసింది.

నటరాజన్ స్ట్రైక్స్.. వరుసగా రెండు వికెట్లు!

నాలుగో ఓవర్ బౌలింగ్ చేసిన నటరాజన్ 3వ బంతికి నటరాజ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ల వికెట్లు తీసుకుని.. కేకేఆర్ వెన్ను విరిచినంత పనిచేశాడు. దీంతో 4 ఓవర్లు ముగిసే సరికి కోల్ కతా నైట్ రైడర్స్ 3 వికెట్లు నష్టపోయి 32 పరుగులు చేసింది. దీంతో... కేకేఆర్ పీకల్లోతు కష్టాల్లో పడినట్లుగా మారిపోయింది పరిస్థితి!

పవర్‌ ప్లే పూర్తయ్యేనాటికి పరిస్థితి ఇది:

హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా భువీతో పాటు నటరాజన్ ఆరో ఓవర్ లో నాలుగు పరుగులు ఇచ్చాడు. దీంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 3 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో సాల్ట్ (24), నితీష్‌ రాణా (7) ఉన్నారు.

నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్:

ఆ సమయానికి హైదరాబాద్ బౌలర్లు విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో స్పిన్నర్‌ మర్కండే వేసిన ఎనిమిదో ఓవర్‌ లో మూడో బంతికి నితీష్ రాణా (9).. రాహుల్‌ త్రిపాఠికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. కేకేఆర్ 8 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.

పుంజుకోవడం మొదలుపెట్టిన కోల్ కతా:

వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కోల్‌ కతా పుంజుకొంది. ఈ క్రమంలో మర్కండే వేసిన 10 ఓవర్‌ లో 11 పరుగులు రాబట్టింది. ఫలితంగా... 10 ఓవర్లకు స్కోరు 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. ఈ సమయంలో ఫిలిప్‌ సాల్ట్ (36) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.

100 దాటిన కేకేఆర్ స్కోరు:

షాబాజ్‌ అహ్మద్‌ వేసిన 12 ఓవర్‌ లో 14 పరుగులు రాబట్టారు కేకేఆర్ బ్యాటర్స్. ఇందులో భాగంగా... తొలి బంతి నో బాల్‌ కాగా రమణ్‌ దీప్‌ (35) సిక్స్‌ బాదాడు. దీంతో 12 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 4 ఓవర్లో 105 పరుగులు సాధించింది.

ఆఫ్ సెంచరీ తర్వాత ఔటైన సాల్ట్:

మయాంక్‌ మర్కండే వేసిన 14 ఓవర్‌ లో 2వ బంతికి బౌండరీతో హాఫ్‌ సెంచరీ సాధించిన సాల్ట్... 40 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇదే ఓవర్‌ లో ఐదో బంతికి మార్కో జాన్సెన్‌ కు దొరికాడు. దీంతో... 14 ఓవర్లకు కేకేఆర్ స్కోరు 6 వికెట్లకు 119కి చేరుకుంది.

ఆండ్రూ రస్సెల్ బాదుడు:

సాల్ట్ అవుటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రస్సెల్... మర్కండే వేసిన 16 ఓవర్‌ లో తొలి బంతికి, నాలుగో బంతికి, ఐదో బంతికి సిక్స్ లు కొట్టాడు. దీంతో స్టేడియం మొత్తం గోల గోలగా మారిపోయింది. ఫలితంగా.. 16 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ 141 పరుగులు చేసింది. ఈ సమయంలో రస్సెల్ (20), రింకు సింగ్ (10) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ:

17వ సీజన్ లో ఆండ్రూ రస్సెల్ విధ్వంసం సృష్టించాడు. భువనేశ్వర్‌ వేసిన 19 ఓవర్‌ లో రెండు సిక్స్‌ లు, రెండు ఫోర్లు బాదాడు. దీంతో 19 ఓవర్లకు కేకేఆర్ స్కోరు 6 ఓవర్లకు 200కు చేరుకుంది. ఈ సమయంలో రస్సెల్ (62), రింకు సింగ్ (23) పరుగులతో క్రీజ్ లో కొనసాగారు.

హైదరాబాద్‌ ముందు భారీ టార్గెట్:

ఇలా ఆండ్రూ రస్సెల్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ లతో విధ్వంసం సృష్టించి 64 పరుగులు సాధించగా... ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్ 40 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 54 పరుగులతో రాణించాడు. దీంతో కోల్‌ కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

చేజింగ్ కి దిగిన హైదరాబాద్... శుభారంభం!

209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్ లో 12 పరుగులు సాధించింది. ఓపెనర్లలో మయాంక్ అగర్వాల్ (7), అభిషేక్ శర్మ (0) క్రీజ్ లో ఉన్నారు.

ఐదో ఓవర్లో డోస్ పెరిగింది:

వరుణ్ చక్రవర్తి వేసిన ఐదో ఓవర్లో అభిషేక్ శర్మ రెండు సిక్స్ లు ఒక ఫోర్ బాదాడు. దీంతో ఐదు ఓవర్లకు వికెట్లేమీ నష్టపోకుండా 58 పరుగులు చేసింది హైదరాబాద్.

ఫస్ట్ వికెట్ @ ఎండ్ ఆఫ్ పవర్ ప్లే!:

నిలకడగా సాగుతున్న దశలో హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. ఇందులో భాగంగా... హర్షిత్ రానా వేసిన ఆరో ఓవర్లో మూడో బంతికి మయాంక్‌ అగర్వాల్‌ (32 ) రింకూ సింగ్‌ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం రాహుల్‌ త్రిపాఠి క్రీజులోకి వచ్చాడు. ఈ సమయంలో పవర్ ప్లే ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయిన హైదరాబాద్ 65 పరుగులు సాధించింది.

రస్సెల్ పట్టిందల్లా బంగారమే!:

ఈరోజు మ్యాచ్ లో రస్సెల్ కు పట్టిందళ్లా బంగారవుతుందనే కామెంట్స్ వినిపించాయి. ఇందులో భాగంగా... అతను వేసిన 8వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్‌ కు ప్రయత్నించి చక్రవర్తికి క్యాచ్‌ ఇవ్వడంతో అభిషేక్‌ శర్మ (32) ఔటయ్యాడు. దీంతో 8 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 77 పరుగులు చేసింది.

10 ఓవర్లకు హైదరాబాద్ పరిస్థితి ఇది!:

సుయాశ్‌ శర్మ వేసిన 10 ఓవర్‌ లో 14 పరుగులు రావడంతో... పదిఓవర్లు పూర్తయ్యే సరికి హైదరాబాద్ స్కోరు రెండు వికెట్లు కోల్పోయి 99 పరుగులు కాగా... ఈ సమయంలో త్రిపాఠి (14), మార్క్రమ్‌ (15) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుత ఈ ఇద్దరు బ్యాటర్లు కూల్ గా ఆడుతున్నారు.

మార్క్రమ్‌ ఔట్:

వరుణ్ చక్రవర్తి వేసిన 12 ఓవర్ 4వ బంతికి రింకూ సింగ్ కి క్యాచ్ ఇచ్చి మార్క్రమ్‌ ఔటయ్యాడు. దీంతో 12 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 108 పరుగులు చేసింది. ఈ సమయంలో క్లాసెన్ (1), రాహుల్ త్రిపాఠి (19) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

నాలుగో వికెట్ కోల్పోయిన హైదరాబాద్:

12 వ ఓవర్ లో మార్క్రమ్‌ ఔట్ కాగా.. నరైన్‌ వేసిన 13 ఓవర్‌ లో హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చిన రాహుల్ త్రిపాఠి (20) ఔటయ్యాడు. దీంతో... 13 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు 111 పరుగులు చేసింది. ఈ సమయంలో అబ్దుల్ సమద్‌ (0), క్లాసెన్ (3) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

30 బంతులు 81 పరుగులు:

వరుణ్‌ చక్రవర్తి వేసిన 15 ఓవర్‌ లో 13 పరుగులు రాగా... 15 ఓవర్లకు స్కోరు 4 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు 128 పరుగులు చేసింది. ఈ సమయంలో... క్లాసెన్ (18) సమద్‌ (2) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. దీంతో మిగిలిన 30 బంతుల్లో హైదరాబాద్ కు 81 పరుగులు అవసరం ఉంది!

ఐదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్‌:

రస్సెల్ వేసిన 17 ఓవర్‌ లో ఐదో బంతికి వెంకటేశ్ అయ్యర్‌ కు క్యాచ్ ఇచ్చిన అబ్దుల్ సమద్‌ (15) ఔటయ్యాడు. దీంతో 17 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 5 వికెట్లకు 149గా ఉంది.

18 ఓవర్లో 21 పరుగులు:

మ్యాచ్ పై ఇంకా పట్టుకోల్పోలేదనే సంకేతాలు పంపుతూ... 18వ ఓవర్లో క్లాసెన్ రెండు సిక్స్ లు కొట్టగా.. షాబాజ్ ఒక సికర్స్ బాదాడు. దీంతో... వరుణ్ చక్రవర్తి వేసిన 18 ఓవర్ లో హైదరాబాద్ 21 పరుగులు రాబట్టింది. ఈ సమయంలో 18 ఓవర్లకు 170 పరుగులు చేసింది హైదరాబాద్.

25 బంతులకు 55 పరుగులు చేసిన క్లాసెన్:

మిచెల్ స్టార్క్‌ వేసిన 19 ఓవర్‌ లో 1, 3, 4 బంతుల్లో మూడు సిక్స్‌ లు బాదాడు క్లాసెన్. చివరి బంతికి షాబాజ్‌ అహ్మద్‌ (16) కూడా సిక్సర్ బాదాడు. ఈ సమయంలో క్లాసెన్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 19 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 196 పరుగులు చేసింది. ఈ సమయంలో క్లాసెన్ (56) పరుగులతో కీజ్ లో ఉన్నాడు.

ఓ.ఎం.జీ... క్లాసెన్ అవుట్:

రెండు బంతులకు 5 పరుగులు సాధించాల్సిన సమయంలో క్లాసెన్ అవుటయ్యాడు. 29 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. దీంతో 4 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ గెలిచింది.