Begin typing your search above and press return to search.

చవకగా దొరికిన రచిన్... మిచెల్‌ స్టార్క్‌ ఆల్ టైం రికార్డ్!

ఇందులో 30 మందివరకూ విదేశీ ఆటగాళ్ల స్లాట్‌ లు ఉన్నాయి. ఈ సమయంలో ఇప్పటివరకూ జరిగిన వేలంలో ఆల్ టైం రికార్డ్ ధర తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   19 Dec 2023 11:51 AM GMT
చవకగా దొరికిన రచిన్... మిచెల్‌  స్టార్క్‌  ఆల్  టైం రికార్డ్!
X

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం దుబాయ్‌ వేదికగా ప్రారంభమైంది. దేశ, విదేశీ ఆటగాళ్లు ఈ వేలం జాబితాలో ఉన్నారు. ఇందులో మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 స్లాట్‌ లు కోసం పోటీపడుతున్నాయి. ఇందులో 30 మందివరకూ విదేశీ ఆటగాళ్ల స్లాట్‌ లు ఉన్నాయి. ఈ సమయంలో ఇప్పటివరకూ జరిగిన వేలంలో ఆల్ టైం రికార్డ్ ధర తెరపైకి వచ్చింది.

మిచెల్ స్టార్క్‌ ఆల్‌ టైం రికార్డ్:

అవును... దుబాయ్‌ వేదికగా ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ - 2024 మినీ వేలంలో రికార్డ్ ధరలు నమోదయ్యాయి. ఇందులో భాగంగా... ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్ స్టార్క్‌ ఆల్‌ టైం రికార్డు సృష్టించాడు. ఈ ఆసిస్ ఎక్స్ ప్రెస్ ని రూ. 24.75 కోట్ల రికార్డ్ ధరకు కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ఈ ఏడాది జరిగిన వన్ డే వరల్డ్ కప్ లో పది మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు.

ప్యాట్ కమిన్స్‌ సరికొత్త రికార్డ్:

అంతక ముందు ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇందులో భాగంగా... రూ. 20.5 కోట్ల ధరను దక్కించుకున్నాడు. తాజా వేలంలో కమిన్స్ ను దక్కించుకునేందుకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో... రూ. 20.5 కోట్లకు సన్‌ రైజర్స్‌ సొంతం చేసుకుంది.

రచిన్‌ రవీంద్రను చవకగా కొట్టేసిన సీఎస్కే:

ఇదే క్రమంలో న్యూజిలాండ్ ఆల్‌ రౌండర్‌ డారిల్‌ మిచెల్‌ సైతం భారీ ధరే పలికాడు. డారిల్‌ మిచెల్‌ ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 14 కోట్లు పెట్టి దక్కించుకుంది. ఈ సమయంలో మిచెల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మరో న్యూజిలాండ్ యువకెరటం రచిన్‌ రవీంద్రను మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ రూ. 1.8 కోట్లకే దక్కించుకోవడం గమనార్హం.

సన్‌ రైజర్స్‌ దూకుడు:

ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ సరికొత్త రికార్డ్ ధర రూ. 20.5 కోట్లతో దక్కించుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్... ఆసీస్‌ టాప్‌ బ్యాటర్ ట్రావిస్‌ హెడ్‌ ను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో భాగంగా... ఈ వరల్డ్ కప్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన హెడ్ ను సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ రూ. 6.80 కోట్లకు సొంతం చేసుకుంది.

ఇదే సమయంలో... శ్రీలంక ఆల్‌ రౌండర్‌ వనిందు హసరంగను హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా... రూ. 1.50 కోట్లకు దక్కించుకుంది.