Begin typing your search above and press return to search.

సింగిల్ పేరెంట్ కిడ్... బుమ్రా ఫ్లాష్ బ్యాక్ తెలుసా?

ఈ తరం అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ ప్రీత్ బుమ్రా గురించి ఏమాత్రం పరిచయం అక్కర్లేని సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 July 2024 11:30 AM GMT
సింగిల్  పేరెంట్  కిడ్... బుమ్రా ఫ్లాష్  బ్యాక్  తెలుసా?
X

ఈ తరం అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ ప్రీత్ బుమ్రా గురించి ఏమాత్రం పరిచయం అక్కర్లేని సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారతీయ క్రికెట్ అభిమానులంతా ఓటమి ఒత్తిడిలో ఉన్న సమయంలో మ్యాచ్ ని మలుపుతిప్పిన సూపర్ స్టార్ బౌలర్. ఈ నేపథ్యంలో... నేటి ఈ స్టార్ ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు తెరపైకి వచ్చింది.

అవును... మ్యాచ్ భారత్ చేజారిపోతుందనుకునే టెన్షన్ సమయంలో బంతి అందుకుని మలుపుతిప్పే స్టార్ బౌలర్ జస్ ప్రిత్ బుమ్రా... ఇటీవల జరిగిన టీ20 సిరీస్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఛాంపియన్ గా నిలబెట్టడంలో కీలక భూమిక పోషించాడు. ఈ క్రమంలో తాజాగా బుమ్రా ఫ్లాష్ బ్యాక్.. అతడు చిన్నతనంలో పడిన ఇబ్బందులు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... పంజాబీ కుటుంబానికి చెందిన జస్వీర్ సింగ్ – దల్జిత్ కౌర్ బుమ్రా దంపతుల ముద్దుల కుమారుడే జస్ ప్రిత్ బుమ్రా. అయితే ఇతడికి ఆరేళ్ల వయసున్నప్పుడు తండ్రి జస్వీర్ సింగ్ మరణించారు. ఈ సమయంలో మనవడికి, కోడలికి అండగా ఉండాల్సిన తాత సంతోక్ సింగ్.. వాళ్లను వదిలి వేరే ఊరికి వెళ్లిపోయాడు.

ఇలా కొడుకు చిన్నతనంలోనే తన భర్త మరణించడం, మామ పట్టించుకోకుండా తనదారి తాను చూసుకోవడంతో... బుమ్రా తల్లి ఒంటరైపోయింది. ఈ సమయంలో ఎలాగైనా తన కొడుకుని గొప్పవాడ్ని చేయాలనే కసిని పెంచుకుంది. అయితే అప్పటికే ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆమె... తన కుమారుడి ఉజ్వల భవిష్యత్ కోసం మరింత కష్టపడింది.

కుమారుడి ఇష్టాన్ని గ్రహించి.. అతన్ని క్రికెట్ వైపు ప్రోత్సహించింది. భర్త అండ లేకపోయినా, అత్తింటివారి సహకారం లేకపోయినా, కొడుకు అప్పటికి అందిరాకపోయినా... అతడిని ఓ గొప్ప క్రికెటర్ గా తయారు చేసింది. టీంఇండియాకు ఓ వజ్రాయుధాన్ని అందించింది. దీంతో... ఈ ఫ్యాష్ బ్యాక్ తెలిసిన నెటిజన్లు... జిజియా భాయ్, శివాజీని పెంచినట్లు బుమ్రా తల్లి అతడిని పెంచిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా... జస్ ప్రీత్ బుమ్రా... ఇప్పటివరకూ 36 టెస్ట్ మ్యాచ్ లలో 69 ఇన్నింగ్స్ లలో 159 వికెట్లు తీశాడు. ఇదే సమయంలో... 89 వన్డే లు ఆడి 4.6 ఎకానమీతో 149 వికెట్లు, 70 టీ20 మ్యాచ్ లలో 6.28 ఎకానమీతో 89 వికెట్లూ తీశాడు. ఇదే క్రమంలో... ఐపీఎల్ లో 133 మ్యాచ్ లు ఆడి 165 వికెట్లు దక్కించుకున్నాడు.