Begin typing your search above and press return to search.

పార్టీలకు ప్రియారిటీ ఇచ్చే జట్లు ట్రోఫీలు గెలవవు... రైనా సెటైర్లు వాళ్లకేనా?

అవును... టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

By:  Tupaki Desk   |   21 April 2024 1:22 PM GMT
పార్టీలకు ప్రియారిటీ ఇచ్చే జట్లు ట్రోఫీలు  గెలవవు... రైనా సెటైర్లు వాళ్లకేనా?
X

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా.. మరి ముఖ్యంగా ఇండియాలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది! సాయంత్రం 7 గంటలు దాటితే టీవీలకు అతుక్కుపోతున్న క్రికెట్ అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఆ సంగతి అలా ఉంటే... ఐపీఎల్ లో కొన్ని జట్లే ఎక్కువ సార్లు ట్రోఫీని దక్కించుకొవడం.. మరికొన్ని జట్లు ఎప్పటికప్పుడు కొత్త పరాజయాలను మూటగట్టుకోవడం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో సురేష్ రైనా ఆసక్తికరంగా స్పందించాడు.

అవును... టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుమారు పదేళ్ల పాటు టీమిండియా తరపు ఆడిన రైనా... గెలిచిన అనేక మ్యాచుల్లో కీలక భూమిక పోషించాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున సరికొత్త రికార్డ్స్ నెలకొల్పాడు. ఉదాహరణకు 2014లో పంజాబ్ కింగ్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున రెచ్చిపోయిన రైనా.. కేవలం 25 బంతుల్లోనే 87 పరుగులు చేసి రికార్డ్ నెలకొల్పాడు!

అయితే... ప్రస్తుతం ఐపీఎల్‌ లో కామెంటేటర్‌ గా వ్యవహరిస్తున్న రైనా... ఐపీఎల్‌ లోని కొన్ని జట్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఐపీఎల్ లో కొన్ని జట్లు ప్రాక్టీస్ కంటే ఎక్కువగా పార్టీలకే ప్రయారిటీ ఇస్తున్నాయని సెటైర్లు వేశారు. అలాంటి జట్లే ఇప్పటివరకు ఒక్క ట్రోఫీని కూడా గెలవలేకపోతున్నాయని అన్నారు. దీంతో.. ఆయా జట్లు భుజాలు తడుముకుంటున్నాయనే సెటైర్లు నెట్టింట మొదలైపోయాయి!

ఇదే క్రమంలో... చెన్నై జట్టు ఏనాడూ పార్టీలకు ప్రధాన్యత ఇవ్వలేదని.. అందుకే అన్ని ట్రోఫీలు గెలవగలిగిందని రైనా తెలిపాడు. అదేవిధంగా... ముంబై జట్టు కూడా జల్సాలకు దూరంగా ఉంటుందని వెల్లడించాడు. రాత్రంతా పార్టీలు చేసుకొని.. చిల్ అయ్యే ఆటగాళ్లు తర్వాతి రోజు జరిగే ఆటపై ఫోకస్ ఎలా పెట్టగలుగుతారంటూ కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించాడు.

దీంతో... సురేశ్ రైనా చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. దీంతో... ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్ జట్లను ఉద్దేశించే రైనా ఈ తరహా కామెంట్లు చేసి ఉంటాడంటూ నెట్టింట ఫ్యాన్స్ వార్ స్టార్ట్ అయిపోయింది!