Begin typing your search above and press return to search.

టి20 ప్రపంచ కప్.. ఇండియా వర్సెస్ రెండు మినీ ఇండియాలు

భారత్ కు అండర్ 19 ప్రపంచ కప్ ఆడిన పేసర్ సౌరభ్‌ నేత్రావాల్కర్‌, స్పిన్నర్ హర్మీత్‌సింగ్, జస్దీప్ సింగ్, నితీశ్‌ కుమార్‌.. ఇలా మొత్తం 15 మంది సభ్యుల్లో 8 మంది భారతీయులే.

By:  Tupaki Desk   |   12 Jun 2024 12:26 PM GMT
టి20 ప్రపంచ కప్.. ఇండియా వర్సెస్ రెండు మినీ ఇండియాలు
X

ఓ 25 ఏళ్ల కిందట క్రికెట్ లో క్రికెట్ లో అమెరికా జట్టు.. అసలు ఊహలోనే లేదు. ఒకవేళ ఆ దేశం క్రికెట్ లో కనుక అడుగుపెడితే.. బాగా డబ్బున్న దేశం కాబట్టి.. ఇతర దేశాల ఆటగాళ్లను కొనేసి ఓ మేటి జట్టును తయారు చేస్తుందేమో? అనుకునేవారం. అయితే, పూర్తిగా ఇలా జరగనప్పటికీ.. కొంత దగ్గరగా మాత్రం జరిగిందని చెప్పొచ్చు.

అమెరికాలో వరల్డ్ కప్పా?

అసలు క్రికెట్ వాసనలే లేని అమెరికాలో ఇప్పుడు ఏకంగా ప్రపంచ కప్ జరుగుతోంది. ఆతిథ్య హోదాలో అమెరికా కూడా ప్రపంచ కప్ లో ఆడుతోంది. లీగ్ దశలో ఒక మ్యాచ్ గెలుస్తుందని భావించారు. కానీ, ఏకంగా మాజీ చాంపియన్ పాకిస్థాన్ కు షాకిచ్చింది. అంతకుముందు సైతం కెనడాపై గెలిచింది. మరొక్క మ్యాచ్ లోనూ విజయం సాధిస్తే సూపర్ 8 బెర్తు దక్కుతుంది.

మనోళ్లు 8 మంది..

అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లు 8 మంది ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ ఇండియా వర్సెస్‌ మినీ ఇండియాగా మారింది. కాగా, అమెరికా జట్టులోని భారత సంతతి ఆటగాళ్లదే జట్టు విజయాల్లో కీలకపాత్ర. గుజరాత్ కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ మోనాంక్ పటేల్‌ కెప్టెన్ గా ఉన్నాడు. భారత్ కు అండర్ 19 ప్రపంచ కప్ ఆడిన పేసర్ సౌరభ్‌ నేత్రావాల్కర్‌, స్పిన్నర్ హర్మీత్‌సింగ్, జస్దీప్ సింగ్, నితీశ్‌ కుమార్‌.. ఇలా మొత్తం 15 మంది సభ్యుల్లో 8 మంది భారతీయులే.

కెనడాలో ఆరుగురు..

స్పష్టంగా చెప్పాలంటే కెనడా జాతీయ క్రికెట్ జట్టులోనూ ఆరుగురు భారతీయ మూలాలున్న క్రికెటర్లు ఉన్నారు. తుది జట్టులో ఐదుగురు ఆడుతున్నారు. మరోవైపు కెనడా వికెట్ కీపర్ శ్రేయస్ మొవ్వా. ఇతడి ఇంటి పేరు ప్రకారం చూస్తే తెలుగు వాడి లాగానే ఉన్నాడు.