Begin typing your search above and press return to search.

పాత హిట్ మ్యాన్ - కొత్త రోహిత్ శర్మ... డిమాండ్లు మళ్లీ మొదలు!

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డే సిరీస్ లో భాగంగా నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.

By:  Tupaki Desk   |   7 Feb 2025 5:10 AM GMT
పాత హిట్  మ్యాన్ - కొత్త రోహిత్  శర్మ... డిమాండ్లు మళ్లీ మొదలు!
X

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డే సిరీస్ లో భాగంగా నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 249 పరుగుల లక్ష్యాన్ని కేవలం 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన ఛేదించింది. వరుసగా టెస్టు సిరీసుల్లో పరాభవం తర్వాత.. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో టీమిండియా దూసుకెళ్తుంది.

ఇప్పటికే ఇంగ్లిష్ జట్టును టీ20ల్లో మట్టికరిపించిన భారత్... ఇప్పుడు వన్డేల్లోనూ ఆ దిశగానే దూసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ ను ఘనవిజయంతోనే ఆరంభించింది. ఈ సమయంలో రోహిత్ సేనతో ఇబ్బంది లేదు కానూ.. ఇప్పుడు రోహిత్ ఫామ్ పైనే చర్చ అంతా జరుగుతుంది.

అవును... తాజాగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో రోహిత్ సేన శుభారంభం చేసినా.. రోహిత్ శర్మ పెర్ఫార్మెన్స్ పై ఇప్పుడు తీవ్ర చర్చ మొదలైంది. మరికొన్ని రోజుల్లో అసలు సిసలు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆ మెగా టోర్నీకి ముందు ఇంగ్లాండ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ తరహలో సిరీస్ సాగుతుంటే ఇక్కడ రోహిత్ బ్యాట్ కదలడం లేదు!

తాజాగా జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ కేవలం 2 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఈ విషయం అటు రోహిత్ అభిమానులనే కాదు.. టోటల్ టీమిండియా ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతుందని అంటున్నారు. హిట్ మేన్ నుంచి ఈ తరహా పెర్ఫార్మెన్స్ ను వారు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఇతడు రోహిత్ శర్మేనా అనే సందేహాలు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.

తాజా మ్యాచ్ లో బౌలర్లు సమిష్టిగా కృషి చేసి ఇంగ్లిష్ జట్టును 248 పరుగులకే కట్టడి చేయకపోతే.. శుభ్ మన్ గిల్ (87), శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) కీలక ఇన్నింగ్స్ లు ఆడకపోతే పరిస్థితి ఏమిటనేది సగటు క్రికెట్ అభిమానులను ఆందోళన పెడుతుందని అంటున్నారు.

వాస్తవానికి గత కొన్నాళ్లుగా అతడి ఆటతీరు బాగోలేదని.. వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వినిపిస్తున్న వేళ.. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డే లో గత రోహిత్ శర్మకు పూర్తి భిన్నంగా వణుకుతున్నట్లు కనిపించిన హిట్ మ్యాన్ పై మరోసారి రిటైర్మెంట్ డిమాడ్స్ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి!

ఓపెనర్లు శుభారంభం ఇస్తే మిడిల్ ఆర్డర్ మరింత ధృఢంగా ముందుకు వెళ్తే ఆ లెక్క వేరుంటుందని చెబుతున్నారు. మరి మిగిలిన రెండు మ్యాచ్ లలో అయినా పాత హిట్ మ్యాన్ కనిపిస్తాడా.. లేక, కొత్త రోహిత్ శర్మే కంటిన్యూ అవుతాడా అనేది వేచి చూడాలి!