టీమ్ ఇండియా తొలి గెలుపునకు 73 ఏళ్లు.. ప్లేయర్ల ప్రైజ్ మనీ తెలుసా?
ఇవి తప్ప మిగతా సందర్భాల్లో మన జట్టుదే గెలుపు అని ఖాయం చేసుకోవాలి.
By: Tupaki Desk | 10 Feb 2025 11:30 PM GMTఇప్పుడంటే ఆడిన ప్రతి మ్యాచ్ నూ గెలిచే స్థితిలో ఉంది టీమ్ ఇండియా.. అది టి20లు, వన్డేలు, టెస్టులు ఏదైనా సరే.. స్వదేశమా..? విదేశమా..? తటస్థ వేదికనా..? ఎక్కడైనా సరే.. భారత జట్టు అత్యధిక శాతం గెలుపు అంచనాలతోనే మైదానంలోకి దిగుతోంది. కొన్నిసార్లు ఆటగాళ్ల వైఫల్యం, మరికొన్నిసార్లు ప్రత్యర్థి పైచేయి, ఇంకోసారి పరిస్థితులు అనుకూలించక ఓటమి పాలవుతోంది. ఇవి తప్ప మిగతా సందర్భాల్లో మన జట్టుదే గెలుపు అని ఖాయం చేసుకోవాలి.
భారత్ లో క్రికెట్ రూట్స్ వేసిన బ్రిటిషర్లతోనే మన జట్టు తొలుత మ్యాచ్ ఆడింది.. ఇది కూడా స్వాతంత్ర్యానికి 15 ఏళ్ల పూర్వమే కావడం గమనార్హం. కానీ, తొలి గెలుపునకు మాత్రం మొదటి మ్యాచ్ ఆడిన తర్వాత 20 ఏళ్లు ఆగాల్సి వచ్చింది.
తెలుగోడి కెప్టెన్సీలో..
1932లో టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్ ను ఇంగ్లండ్ తో ఆడింది. అప్పటికి మన దేశం బ్రిటిష్ పాలనలోనే ఉంది. క్రికెట్ లో ఇంకా వన్డేలు ప్రవేశించలేదు. ఇక, తొలి మ్యాచ్ కు కెప్టెన్ ఎవరో తెలుసా? తెలుగు తేజం కల్నల్ కఠారి కనకయ్య నాయుడు (సీకే నాయుడు). 1932 జూన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో సీకే తొలి ఇన్నింగ్స్ లో 40 పరుగులు చేశాడు. కానీ, భారత్ 158 పరుగుల తేడాతో ఓడిపోయింది.
సరిగ్గా 20 ఏళ్ల తర్వాత..
తొలి టెస్టు ఆడిన 20 ఏళ్ల తర్వాత కాని టీమ్ ఇండియా తొలి విజయాన్ని అందుకోలేకపోయింది. సరిగ్గా 1952లో ఇంగ్లండ్ తోనే జరిగిన మ్యాచ్ లో మన జట్టు జయకేతనం ఎగురవేసింది. చెన్నైలో జరిగిన ఈ టెస్టులో ఇంగ్లండ్ పై ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.
వినూ మన్కడ్ (8/55, 4/53) అద్భుత బౌలింగ్ తో ఇంగ్లండ్ 266, 183 స్కోర్లకు ఆలౌటైంది. పాలి ఉమ్రిగర్ 130 నాటౌట్, పంకజ్ రాయ్ 111 సూపర్ సెంచరీలతో భారత్ 459/9 (డిక్లేర్డ్) భారీ స్కోరు సాధించింది.
అయితే, తొలి టెస్టు గెలుపు అందించిన అప్పటి ఆటగాళ్లకు ఇచ్చిన పారితోషికం రూ.250