Begin typing your search above and press return to search.

పురుషులు.. మహిళలు.. కుర్రాళ్లు.. టీమ్ ఇండియాకు బ్యాడ్ సండే..

అలాంటి సండే రోజు క్రికెట్ మ్యాచ్ ఉంటేనా పైగా పురుషులు, మహిళలు.. కుర్రాళ్ల మ్యాచ్ లు మూడూ ఉంటేనా.. ఇక పండుగే కదా కానీ, ఈ సండే అభిమానులకు బ్యాడ్ డే మిగిలిపోయింది.

By:  Tupaki Desk   |   8 Dec 2024 4:40 PM GMT
పురుషులు.. మహిళలు.. కుర్రాళ్లు.. టీమ్ ఇండియాకు బ్యాడ్ సండే..
X

సండే హాలీ డే.. అందుకే ఈ వారం ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూస్తుంటారు.. వారం అంతా పనిచేసిన అలసిపోయిన కొందరైతే ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుంటారు. మరికొందరు జాలీ టూర్ లు వేస్తుంటారు. చాలామంది తమ ఫ్యామిలీలతో గడిపేస్తుంటారు. అందుకే సండే హాలీ డేనే కాదు.. జాలీ డే కూడా. అలాంటి సండే రోజు క్రికెట్ మ్యాచ్ ఉంటేనా పైగా పురుషులు, మహిళలు.. కుర్రాళ్ల మ్యాచ్ లు మూడూ ఉంటేనా.. ఇక పండుగే కదా కానీ, ఈ సండే అభిమానులకు బ్యాడ్ డే మిగిలిపోయింది.

కుర్రాళ్లు కుమ్మేస్తారనుకుంటే?

ఆసియా అండర్ 19 కప్ లో టీమ్ ఇండియా ఫైనల్లో ఓటమిపాలైంది. అయితే, ప్రత్యర్థి పాకిస్థాన్ అయితే పోనీలే అనుకోవచ్చు. కానీ, బంగ్లాదేశ్. లీగ్ దశలో పాకిస్థాన్ చేతిలో మన జట్టు ఓడిపోయినా, కానీ, తర్వాత దంచికొట్టి ఫైనల్ కు చేరింది. అయితే, బంగ్లా విసిరిన 199 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక చతికిల పడింది. 13 ఏళ్లకే ఐపీఎల్ లోకి ఎంపికై సంచలనం రేపిన వైభవ్ సూర్యవంశీ (9) విఫలం కావడంతో ఆసియా కప్ ను యువ భారత్ జట్టు అందుకోలేకపోయింది.

అమ్మాయిలు చేతులెత్తేశారు..

పురుషుల జట్టుతో పాటు భారత మహిళలూ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆ దేశ జట్టుతో వన్డే సిరీస్ ఆడుతున్నారు. తొలి వన్డేలో పరాజయం పాలైనప్పటికీ.. రెండో వన్డేలో గెలుస్తారని భావించారు. కానీ, ఈసారి మరింత ఘోరంగా ఓడారు. ఆసీస్ అమ్మాయిలు ఏకంగా 371 పరుగుల భారీ స్కోరు సాధించారు. భారత జట్టు 249 పరుగులకే ఆలౌటైంది. 122 పరుగుల తేడాతో ఓడింది.

పురుషులు ప్చ్..

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమ్ ఇండియా పురుషుల జట్టు ప్రదర్శన మరీ నాసిరకం. తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆలౌటైన టీమ్ ఇండియా, రెండో ఇన్నింగ్స్ లో 175 పరుగులే చేయగలిగింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (42, 42) మినహా మరే బ్యాట్స్ మన్ క్రీజులో నిలవలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులు చేసిన ఆసీస్ కు 19 పరుగుల స్వల్ప లక్ష్యం ఎదురైంది. వికెట్ కోల్పోకుండా దీనిని ఛేదించింది.