Begin typing your search above and press return to search.

బ్రేకింగ్... విశ్వవిజేత భారత అమ్మాయిల జట్టు!

ఖోఖో ప్రపంచకప్ లో భారత అమ్మాయిల జట్టు సత్తా చాటింది. ఇందులో భాగంగా.. ఖోఖో తొలి ప్రపంచకప్ లో విజేతగా నిలిచింది.

By:  Tupaki Desk   |   19 Jan 2025 3:31 PM GMT
బ్రేకింగ్... విశ్వవిజేత భారత అమ్మాయిల జట్టు!
X

ఖోఖో ప్రపంచకప్ లో భారత అమ్మాయిల జట్టు సత్తా చాటింది. ఇందులో భాగంగా.. ఖోఖో తొలి ప్రపంచకప్ లో విజేతగా నిలిచింది. ఆదివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్ లో 78-40 తో నేపాల్ ను చిత్తుచేసిన భారత్ విశ్వవిజేతగా నిలిచింది. సరికొత్త రికార్డ్ సృష్టించింది.


అవును... ఖోఖో ప్రపంచకప్ ను తొలిసారిగా ఈ ఏడాది నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్ లో భారత్ సత్తా చాటింది. పోరు మొదటి టర్న్ లో దూకుడుగా ఆడిన భారత్ 34-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలవగా.. తర్వాత రెండో టర్న్ లో నేపాల్ కాస్త పుంజుకుని.. 35-24 తో ముగించింది.

అనంతరం జరిగిన మూడో టర్న్ లో భారత్ మళ్లీ దూకుడు పెంచడంతో.. పాయిట్ల పట్టికలో ఆధిక్యాన్ని 49కి పెంచుకుంది. ఇక చివరి టర్న్ లో కాస్త పుంజుకున్న నేపాల్ 16 పాయింట్లు సాధించగా.. భారత్ 38 పాయింట్లతో ఘన విజయం సొంతం చేసుకుంది. తొలి ఖోఖో ప్రపంచకప్ లో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది.

కాగా... ఈ ఏడాది మొదటి ఖోఖో ప్రపంచ కప్ జనవరి 13న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన మొదటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై 176 పాయింట్లు సాధించిన భారత అమ్మాయిల జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. తదుపరి ప్రత్యర్థులకు స్పష్టమైన సంకేతాలు పంపించింది.

ఈ క్రమంలో తర్వాత జరిగిన ప్రతీ మ్యాచ్ లోనూ ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇక ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు తన ఆశయాలను నిజం చేస్తూ టైటిల్ ను కైవసం చేసుకుంది. కోట్లాది మంది భారతీయల అభినందనలు అందుకుంటుంది.