టీమ్ ఇండియా తదుపరి సిరీస్ బంగ్లాతోనే.. అసలు ఆ జట్టు వస్తుందా?
చాలా రోజుల తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ తో సిరీస్ ఆడనుంది. రెండు టెస్టులు, మూడు టి20లు ఆడనుంది.
By: Tupaki Desk | 9 Aug 2024 8:30 PM GMTబంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత దేశంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె లండన్ కు కాకుండా తిరిగి బంగ్లాదేశ్ కు వెళ్లేవరకు భారత్ లోనే ఉండే చాన్సుంది.
జనవరి నుంచి మొన్నటి శ్రీలంక సిరీస్ వరకు ఊపిరి సలకుండా క్రికెట్ ఆడిన టీమ్ ఇండియా.. ప్రస్తుతం కాస్తంత విశ్రాంతి తీసుకుంటోంది. వన్డే ప్రపంచకప్, ఆస్ట్రేలియాతో టి20లు, ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్, రెండున్నర నెలల ఐపీఎల్, ఆ వెంటనే టి20 ప్రపంచ కప్, జింబాబ్వేతో టి20 సిరీస్.. ఇలా ఆడుతూనే ఉంది భారత జట్టు. కొద్దిమంది ప్లేయర్లు మినహా జట్టయితే ప్రయాణం చేస్తూనే ఉంది.
నెలకు పైగా విరామం..
టీమ్ ఇండియాకు ఇప్పుడు నెలకు పైగా విరామం దొరికింది. బుధవారం శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసింది. సెప్టెంబరు 19వరకు మరో మ్యాచ్ లేదు. అంటే.. 40 రోజుల పైగా ఖాళీ. ఈ సమయంలో స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి లండన్ కు వెళ్లిపోగా.. మిగతా జట్టు సభ్యులంతా వారివారి ఇళ్లకు చేరుకున్నారు. తదుపరి సిరీస్ కోసం వీరంతా మళ్లీ కలిసేది ఓ నెల తర్వాతే అనుకోవచ్చు.
ఆడబోయేది ఎవరితోనంటే..
చాలా రోజుల తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ తో సిరీస్ ఆడనుంది. రెండు టెస్టులు, మూడు టి20లు ఆడనుంది. ఇందులో తొలి టెస్టు సెప్టెంబరు 19న జరుగుతుంది. కాగా, బంగ్లాదేశ్ లో పరిస్థితులు ప్రస్తుతం కల్లోలంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతోనే ఆ జట్టు విదేశీ పర్యటనలకు వెళ్తుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి. బంగ్లా ఈ నెలలో పాకిస్థాన్ లో పర్యటించాల్సి ఉంది. కానీ, ఆ దేశంలో అల్లర్ల కారణంగా జట్టు ప్రాక్టీస్ సెషన్ మొదలుకాలేదు. బంగ్లా ఏ జట్టుకూడా పాక్ లో పర్యటించాల్సి ఉంది. అసలు బంగ్లా క్రికెట్ బోర్డు చైర్మన్ జాడనే తెలియడం రాలేదు. ఇక మహిళల టి20 ప్రపంచ కప్ బంగ్లాదేశ్ లో జరగాల్సి ఉంది. అక్టోబరులో నిర్వహించాల్సిన టోర్నీని భారత్, లంక, యూఏఈకి మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. చూద్దాం.. బంగ్లాదేశ్.. భారత పర్యటనకు వస్తుందో లేదో?