Begin typing your search above and press return to search.

హడలెత్తించిన హైదరాబాదీ సిరాజ్.. అవి బంతులా.. బుల్లెట్లా..?

అతడి విధ్వంసానికి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక తెల్లమొహం వేసింది.

By:  Tupaki Desk   |   17 Sep 2023 11:38 AM GMT
హడలెత్తించిన హైదరాబాదీ సిరాజ్.. అవి బంతులా.. బుల్లెట్లా..?
X

వదిలేస్తే క్లీన్ బౌల్డ్.. బ్యాట్ తగిలిస్తే కీపర్ కు క్యాచ్.. కొడితే ఫీల్డర్ చేతుల్లోకి.. మొత్తానికి అతడు బంతి విసిరితే వికట్.. ఇంతకూ అతడు విసిరేది బంతులా..? బుల్లెట్లా? అన్నట్లు బౌలింగ్ చేశాడు హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్. అతడి విధ్వంసానికి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక తెల్లమొహం వేసింది.

ఏమౌ బౌలింగ్ విధ్వంసం

మొన్నటి సూపర్ -4 మ్యాచ్ లో టీమిండియాను భయపెట్టింది శ్రీలంక. పాకిస్థాన్ ను ఓడించి, ఫైనల్ కు చేరింది. దీంతో భారత్ తో సమరం హోరాహోరీగానే ఉంటుందని భావించారు అభిమానులు. కానీ, అలా జరగలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందకు తీసుకున్నామా? అని లంక బావురుమనేలా బంతులేశాడు సిరాజ్. వాస్తవానికి ఫైనల్లో తొలి వికెట్ తీసింది బుమ్రానే. మొదటి ఓవర్ మూడో బంతికే అతడు కుశాల్ పెరీరాను ఔట్ చేశాడు. ఆ తర్వాత మొదలైంది సిరాజ్ మాయ.

ఓకే ఓవర్ లో నాలుగు వికెట్లు

నాలుగో ఓవర్ (అతడికి రెండోది)లో సిరాజ్ విశ్వరూపమే చూపాడు. ఈ ఓవర్ తొలి బంతికే వికెట్ తీసిన అతడు.. మూడో, నాలుగో, ఆరో బంతికీ బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ కు పాండు. అంటే ఓకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసిన అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత లంక కెప్టెన్ షనకను అద్భుత బంతితో బౌల్డ్ చేశాడు. కొంత విరామం తర్వాత కీలక బ్యాట్స్ మన్ కుశాల్ మెండిస్ వికెట్లనూ గిరాటేశాడు. దీంతో మొత్తం ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రపంచ కప్ ముంగిట శుభమే..

సిరాజ్ కొన్నాళ్లుగా టీమిండియా స్ట్రయిక్ బౌలర్ గా ఉన్నాడు. మరీ ముఖ్యంగా ప్రారంభంలోనే వికెట్లు తీస్తున్నాడు. జట్టుకు ఇది ఎంతో అవసరం. పైగా బుమ్రా లేని లోటును ఏడాది నుంచి అతడే తీర్చాడు. అందుకనే టెస్టుల్లో ప్రధాన బౌలర్ అయిన షమీని కూడా పక్కనపెట్టి సిరాజ్ ను వన్డేలు ఆడిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ కప్ ముంగిట సిరాజ్ అద్భుత ప్రతిభ చూస్తుంటే ఇక అంతా శుభమే అనిపిస్తోంది.