Begin typing your search above and press return to search.

చైనా టు చిలీ.. ఏమి'టీటీ'.. 20 ఏళ్లకే రిటైర్.. 58 ఏళ్లకు ఒలింపిక్స్ లో రీఎంట్రీనా?

పారిస్ ఒలింపిక్స్ లో బామ్మ..పారిస్ 2024 ఒలింపిక్స్‌ లో పాల్గొంటున్నవారిలో అత్యంత పెద్ద వయస్కురాలు చిలీకి చెందిన 58 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి తానియా జియింగ్ జెంగ్‌.

By:  Tupaki Desk   |   1 Aug 2024 12:30 PM GMT
చైనా టు చిలీ.. ఏమిటీటీ.. 20 ఏళ్లకే రిటైర్.. 58 ఏళ్లకు ఒలింపిక్స్ లో రీఎంట్రీనా?
X

సహజంగా ఆ వయసు వారు కోచ్ లుగానూ రిటైర్ అవుతుంటారు. జీవితాన్ని ధారపోసిన మైదానానికి ఆవేదనతో వీడ్కోలు పలుకుతారు. శేష జీవితాన్ని వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రాధన్యం ఇస్తారు. మైదానంలో మళ్లీ కనిపించకూడదని భావిస్తారు.. ఇంకొందరైతే ఇతర రంగాల్లోకి వెళ్లిపోతారు. కానీ, ఆమె మాత్రం వేరు.. అత్యంత సునిశిత నైపుణ్యం అవసరమైన క్రీడలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అందరూ నోరెళ్లబెట్టేలా చేశారు. ఇంతకూ ఎవరామె..?

పారిస్ ఒలింపిక్స్ లో బామ్మ..పారిస్ 2024 ఒలింపిక్స్‌ లో పాల్గొంటున్నవారిలో అత్యంత పెద్ద వయస్కురాలు చిలీకి చెందిన 58 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి తానియా జియింగ్ జెంగ్‌. ఈమె వయసు ఎంతనుకుంటున్నారు..? సింపుల్ గా 58. మీరు చూసినది సరైన అంకెనే. అందుకనే జెంగ్ ను అందరూ పింగ్-పాంగ్ అమ్మమ్మ అని పిలుస్తున్నారు. ఆమె సొంత దేశం చైనా. యుక్త వయసులో ఉన్నప్పుడు అంటే.. 38 ఏళ్ల కిందట చైనాకు ఒలింపిక్ పతకం తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 1970లలో కోచ్, తల్లి మార్గదర్శకత్వంలో చైనా చాంపియన్ ఫ్యాక్టరీలో చేరింది.

అప్పటికి ఆమెకు 11 ఏళ్లు. ఆరేళ్ల తర్వాత జాతీయ జట్టుకు ఎంపికైంది. వివిధ కారణాలతో 1986లో ప్రొఫెషనల్ గా తప్పుకొంది. ఇదే సమయంలో 1989లో ఉత్తర చిలీలోని చైనీయుడి ఆహ్వానంతో అక్కడకు చేరింది. టీటీ కోచ్‌ గా మారింది. భౌగోళికత ఆధారంగా క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా చిలీకి ప్రాతినిధ్యం వహించే హక్కును పొందింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆమెకు 151వ ర్యాంక్ ఇచ్చింది. కాగా, స్పానిష్ మాట్లాడే చిలీ ప్రజలు తన పేరును పలకలేకపోతుండడంతో జెంగ్ తానియాగా పేరు మార్చుకుంది.

ఆ నిబంధనతో..

చైనాకు ఆడే సమయంలో జెంగ్ వరల్డ్ టాప్ ప్లేయర్. ఆమెకు అప్పుడు ఓ నిబంధన చిర్రెత్తించింది. 2సైడ్ ప్యాడిల్ రూల్ 1సైడ్ గా మారడంతో జెంగ్ ఒలింపిక్ టీమ్ కు దూరమయ్యారు. అదే విసుగుతో రిటైర్మెంట్ ప్రకటించారు. చిలీకి వెళ్లిపోయాక కూడా చాన్నాళ్లు గేమ్ కు దూరంగానే ఉన్నారు. అయితే, కొవిడ్ సమయంలో మళ్లీ టేబుల్ టెన్నిస్ రాకెట్ పట్టారు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్ లోనే దర్శనమిచ్చారు.