Begin typing your search above and press return to search.

కౌంట్ డౌన్ స్టార్ట్.. నేటి నుంచి 10 రోజులు.. టీమిండియా వరల్డ్ కప్ చరిత్రకు

వన్డే ఫార్మాట్ లో విశ్వ విజేతగా ఆవిర్భవించి 13 ఏళ్లు దాటిపోయింది.

By:  Tupaki Desk   |   20 Jun 2024 4:30 PM GMT
కౌంట్ డౌన్ స్టార్ట్.. నేటి నుంచి 10 రోజులు.. టీమిండియా వరల్డ్ కప్ చరిత్రకు
X

ఎప్పుడో 2007లో.. అదీ టి20 ఫార్మాట్ పుట్టిన కొత్తలో.. మిగతా జట్లేమీ ఈ ఫార్మాట్ కు అలవాటు పడని సమయంలో.. టీమిండియా ప్రపంచ కప్ ను గెలిచింది. 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022.. ఇలా వరుసగా ప్రపంచ కప్ లు ముగిశాయి.. కానీ, భారత్ మాత్రం విశ్వవిజేతగా నిలవలేకపోయింది.

పొట్టి కప్ లో చాంపియన్ గా నిలిచి సరిగ్గా 17 ఏళ్లవుతోంది. వన్డే ఫార్మాట్ లో విశ్వ విజేతగా ఆవిర్భవించి 13 ఏళ్లు దాటిపోయింది. మధ్యలో రెండుసార్లు టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ చేరింది. కానీ, మన జట్టు మాత్రం టైటిల్ కొట్టలేదు.

ఇప్పుడైనా ఒడిసిపట్టాలి

వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యం ఇస్తున్న టి20 ప్రపంచ కప్ లో టీమిండియా సూపర్ 8 దశకు చేరింది. ఇందులోభాగంగా గురువారం అఫ్ఠానిస్థాన్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. శనివారం బంగ్లాదేశ్ తో, సోమవారం ఆస్ట్రేలియాతో తలపడనుంది. దీంతో సూపర్ 8 మ్యాచ్ లు పూర్తవుతాయి. వీటిలో రెండు కచ్చితంగా గెలవాలి. అలాగైతేనే సెమీ ఫైనల్స్ కు చేరే వీలుంటుంది. ఈ నెల 26న సెమీఫైనల్స్, 29న ఫైనల్స్ జరగనున్నాయి.

సరిగ్గా పది రోజులు.. ఆ దిగ్గజాలకూ

టీమిండియా ప్రపంచ కప్ ల కరువు తీరేందుకు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉన్నది. దిగ్గజ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలకు ఇదే ఆఖరి టి20 ప్రపంచ కప్. వచ్చే వరల్డ్ కప్ 2026లో భారత్ లో జరగనుంది. దీనికి వీరిద్దరూ అందుబాటులో ఉండరనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రపంచ కప్ ను గెలవడం టీమిండియాకు అత్యంత ముఖ్య. అంతేకాదు వచ్చే ప్రపంచ కప్ నాటికి జట్టులో చాలా మార్పులు ఉంటాయి. కోచ్ గా మాజీ ఓపెనర్ గంభీర్ వస్తాడు. జడేజా, షమీ, రాహుల్, సూర్య వంటి వారు ఎంపికవుతారా? లేదా? చెప్పలేం.