Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో టాప్ 10 కాంట్రవర్సీలు ఇవే!

ఈసమయంలో ఐపీఎల్ - 17 సీజన్ ప్రా రంభం నేపథ్యంలో 2008 నుంచి 2023 వరకూ జరిగిన టాప్ కాంట్రవర్సీలు ఇప్పుడు చూద్దాం...!

By:  Tupaki Desk   |   22 March 2024 1:19 PM GMT
ఐపీఎల్  లో టాప్  10 కాంట్రవర్సీలు ఇవే!
X

ఎంటర్ టైన్ మెంట్ విషయంలో ఐపీఎల్ కి ఎంత పేరుందో.. దానికి కాస్త అటు ఇటుగా కాంట్రవర్సీల విషయంలోనూ పేరుందనే చెప్పాలి. అయితే మొదట్లో వీటిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కనిపించినా... రాను రానూ దాన్ని కూడా ఎంటర్ టైన్ మెంట్ గా చూడటం ప్రారంభించారనే కామెంట్స్ కూడా లేకపోలేదు. ఈసమయంలో ఐపీఎల్ - 17 సీజన్ ప్రా రంభం నేపథ్యంలో 2008 నుంచి 2023 వరకూ జరిగిన టాప్ కాంట్రవర్సీలు ఇప్పుడు చూద్దాం...!


అవును... ఐపీఎల్ సందడి వచ్చిందంటే... ఆ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కాంట్రవర్సీలు కూడా చర్చనీయాంశం అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ - 2008లో ముంబై ఇండియన్స్ టీంకి ప్రాతినిథ్యం వహించిన హర్భజన్ సింగ్... కింగ్స్ లెవెన్ పంజాబ్ తరుపున ఆడుతున్న పాస్ట్ బౌలర్ శ్రీశాంత్ పై చేయిచేసుకున్నారు. అప్పట్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే 2009లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కి ఆడుతున్న పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ డోప్ టెస్ట్ లో స్టెరాయిడ్స్ వాడినట్లు నిర్ధారణ అవ్వడంతో... ఏడాది పాటు బ్యాన్ అయ్యాడు! అప్పట్లో ఇది వైరల్ ఇష్యూ! ఇదే క్రమంలో... 2010లో ముంబై ఇండియన్స్‌ తో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నంలో రాజస్థాన్ రాయల్స్‌ తో తన రెన్యువల్ కాంట్రాక్ట్‌ పై సంతకం చేయని కారణంగా.. జడేజాను ఐపీఎల్ మొత్తం సీజన్ నిషేధించింది.

2011లో దక్షిణాఫ్రికాకు చెందిన ఛీర్‌ లీడర్ గాబ్రియెల్లా పాస్‌ క్వాలోట్టో... మ్యాచ్ తర్వాత జరిగే పార్టీలలో ఆటగాళ్లడి ప్రవర్తనపై రహస్యంగా బ్లాగ్ చేసినందుకు ఐపీఎల్ నుండి తొలగించబడింది. ఆమె ముంబై ఇండియన్స్ తరుపున చీర్ లీడర్ గా పనిచేసేది. చాలా మంది ఛీర్‌ లీడర్‌ లు క్రికెటర్లతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని ఆమె ఆరోపించింది.

2012 విషయానికొస్తే... కోల్‌ కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్... ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ తర్వాత వాంఖడే స్టేడియంలోని సెక్యూరిటీ గార్డులతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో... స్టేడియంలో ప్రవేశించకుండా షారుఖ్ పై ఐదేళ్లపాటు నిషేధం విధించారు. ఈ సమయంలో... నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటారని.. అది వ్యక్తి ఎవరనేదానిపై ఆధారపడి ఉండదని ముంబై క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది.

ఇక 2013లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

ఐపీఎల్ - 2014 సీజన్ విషయానికొస్తే... తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ పంజాబ్ కో ఓనర్ నెస్ వాడియాపై ప్రీతీ జింట ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా 2014 మే 30న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా వాంఖడే స్టేడియంలో తన చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది.

2015 ఐపీఎల్ విషయానికొస్తే... నిబంధనలను ఉల్లంఘించి స్టేడియంలో ప్రేయసి అనుష్క శర్మను కోహ్లీ కలిశాడు. నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ మధ్యలో వర్షం పడటంతో... డ్రెస్సింగ్ రూం నుంచి బయటకు వచ్చిన విరాట్ కొహ్లీ.. వీఐపీ బాక్స్ లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మను కలిసినప్పుడు వ్యవహారం సీరియస్ అయ్యింది.

ఇదే క్రమంలో 2019లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న అశ్విన్... రాజస్థాన్ రాయల్స్ కు చెందిన బట్లర్ ను మన్కడ్ రూపంలో ఔట్ చేశాడు. కాగా క్రికెట్‌ నియమావళి ప్రకారం నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌ లో ఉన్న బ్యాట్స్‌ మన్‌.. బౌలర్ బంతి వేయకముందే క్రీజు వదిలి ముందుకు వెళితే.. ఆ సమయంలో అతడిని బౌలర్‌ రనౌట్‌ చేసే విధానాన్ని మన్కడింగ్‌ అంటారు.

ఇక 2022లో నోబాల్ వివాదంలో ఢిల్లీ క్యాపిటల్ టీం కెప్టెన్ రిషబ్ పంత్... తన బ్యాటర్‌ లను వెనక్కి రమ్మని సైగ చేయడం వివాదాస్పదమైంది. ఆ మ్యాచ్ లో డీసీ 15 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇదే క్రమంలో గత ఏడాది 2023లో గంభీర్ వర్సెస్ కొహ్లీ గొడవ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 2013 సీజన్‌ లో గౌతం గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకునే దాకా వెళ్లగా... 2023లోనూ బెంగళూరు వర్సెస్ లక్నో మ్యాచ్ సందర్భంగా గంభీర్, కొహ్లీ మరోసారి గొడవకు దిగారు. మ్యాచ్‌ అనంతరం ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి!