Begin typing your search above and press return to search.

హార్దిక్ ఫిట్ నెస్ పై లేటెస్ట్ అప్ డేట్ ఇదే... రీఎంట్రీ ఎప్పుడంటే...?

అవును... బంగ్లాదేశ్‌ తో మ్యాచ్‌ సందర్భంగా గాయం కారణంగా స్టార్ ఆల్‌ రౌండర్ హార్దిక్‌ పాండ్య మధ్యలోనే వైదొలిగిన అంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Oct 2023 10:47 AM GMT
హార్దిక్ ఫిట్ నెస్ పై లేటెస్ట్ అప్ డేట్ ఇదే... రీఎంట్రీ ఎప్పుడంటే...?
X

ప్రపంచకప్ - 2023 లో భాగంగా భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ విక్టరీ సంపాదించిన టీం ఇండియా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉంది. మరోపక్క అటు బ్యాంటింగ్, ఇటు బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ విభాగం కూడా మెరుగ్గా ఉంది. అయితే ఈ సమయంలో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా వ్యవహారంపైనే ఇప్పుడు ఆందోళన నెలకొందని తెలుస్తుంది. అయితే అది ఒక మ్యాచ్.. రెండు మ్యాచ్ ల వరకేనా.. సెమీస్ సమయానికైనా అందుబాటులోకి వస్తాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

అవును... బంగ్లాదేశ్‌ తో మ్యాచ్‌ సందర్భంగా గాయం కారణంగా స్టార్ ఆల్‌ రౌండర్ హార్దిక్‌ పాండ్య మధ్యలోనే వైదొలిగిన అంగతి తెలిసిందే. ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌ కూ హార్ధిక్ దూరమయ్యాడు. అయితే, అక్టోబర్ 29న డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ తో జరగనున్న కీలక మ్యాచ్‌ కు అందుబాటులోకి వస్తాడా రాడా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే... ఈ మ్యాచ్ కు హార్ధిక్ అందుబాటులో ఉంటాడని తొలుత వార్తలు వచ్చినా ఇంకా సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా తాజాగా హార్దిక్‌ రీఎంట్రీపై కీలక అప్‌ డేట్‌ వచ్చింది. ఇందులో భాగంగా... ఈ నెల 29న జరగబోయే ఇంగ్లాండ్‌ మ్యాచ్ తోనే కాకుండా.. ఆ తర్వాత నవంబర్ 2న శ్రీలంకతో జరిగే మ్యాచ్‌ కూ కూడా హార్దిక్‌ అందుబాటులో ఉండడని తెలుస్తోంది. దీంతో ఈ వరల్డ్ కప్ లో హార్ధిక్ పునరాగమనం చర్చనీయాశం అవుతుంది. అయితే... చీలమండ గాయం కారణంగా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉన్న హార్దిక్‌ వేగంగా కోలుకుంటున్నాడని తెలుస్తుంది.

అలా అని పూర్తి ఫిట్ నెస్ సాధించకుండా పాండ్యాని బరిలోకి దింపలేరు! ఇందులో భాగంగానే పాండ్య విషయంలో ఎలాంటి రిస్క్‌ తీసుకోకూడదని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో అతడికి సరిపడా విశ్రాంతి ఇవ్వాలని.. పూర్తిస్థాయిలో ఫిట్ నెస్ సాధించిన తర్వాతే రీఎంట్రీపై నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరి నవంబర్ 5 న ఈడెన్ గార్డెన్ లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యచ్ కైనా అందుబాటులో ఉంటారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

కాగా... వరుసగా ఐదు విజయాలతో దూసుకుపోతున్న భారత్‌ తదుపరి మ్యాచ్‌ లోనూ ఇంగ్లాండ్‌ ను మట్టికరిపిస్తే సెమీస్‌ కు చేరడం దాదాపు ఫైనల్ అయిపోయినట్లే అనే సంగతి తెలిసిందే. అయితే, లీగ్‌ దశలో అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించాలనే లక్ష్యంతో ఆడుతోన్న టీం ఇండియాకు కివీస్‌ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ ను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ లో "స్కై" రన్ అవుట్ అయిపోయాడు. అవకాశం వస్తే ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఆడే అవకాశం ఉంది.

ఇక ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ గెలిచిన టీం ఇండియా పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో ఉండగా... ఎనిమిదేసి పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో చేరో నాలుగు పాయింట్లతోనూ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ నెల 29న ఇండియా తడబడపోయే ఇంగ్లాండ్ జట్టు రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది!