Begin typing your search above and press return to search.

చంపేస్తామని ఇజ్రాయెల్ ఒలింపియన్లకు బెదిరింపులు.. రంగంలోకి ఫ్రాన్స్

ఒలింపిక్స్ అంటే ఒలింపిక్సే.. ఈ క్రీడల్లలో రాజకీయాలకు అసలు చోటుండదు.

By:  Tupaki Desk   |   29 July 2024 1:30 PM GMT
చంపేస్తామని ఇజ్రాయెల్ ఒలింపియన్లకు బెదిరింపులు.. రంగంలోకి ఫ్రాన్స్
X

ఒలింపిక్స్ అంటే ఒలింపిక్సే.. ఈ క్రీడల్లలో రాజకీయాలకు అసలు చోటుండదు. పాల్గొనడమే ప్రధానంగా సాగే ఒలింపిక్స్ ను మొదటినుంచి ఇలానే తీర్చిదిద్దారు. ఏదైనా దేశంలో క్రీడల్లో రాజకీయాలు ప్రవేశించినట్లు తేలితే వెంటనే ఆ సంఘాన్ని బహిష్కరిస్తారు. రాజకీయాల నుంచి పూర్తిగా బయటపడినట్లు తేలితేనే మళ్లీ సభ్యత్వం ఇస్తారు. ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్నవి 33వ ఒలింపిక్స్. ప్రపంచ యుద్ధాల కారణంగా మధ్యలో రెండుసార్లు ప్రపంచ క్రీడా మహా సంగ్రామాన్ని నిర్వహించలేదు.

అక్కడ యుద్ధం.. ఇక్కడ బెదిరింపులు

పారిస్ ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు ఇజ్రాయెల్ అథ్లెట్లకు హత్యా బెదిరింపులు ఎదురయ్యాయి. దీంతో వారు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా వచ్చిన ఆ బెదిరింపులపై ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. ఈ పని చేసింది ఇరానియన్ హ్యాకర్లు తమ అథ్లెట్లను టార్గెట్ చేశారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అథ్లెట్ల రక్త పరీక్షలు, లాగిన్ ఆధారాలు మొదలైన డేటాను సోషల్ మీడియాలో లీక్ చేశారని పేర్కొంటోంది.

ఫుట్ బాల్ మ్యాచ్ లో..

పారిస్ లో శనివారం ఫుట్ బాల్ మ్యాచ్ లో పరాగ్వేతో ఇజ్రాయెల్ తలపడింది. 2-4 తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో నల్ల దుస్తులు ధరించిన వ్యక్తులు పాలస్తీనా జెండాలు పట్టుకుని నిరసనకు దిగారు. అయితే, ఇదే సమయంలో బందీలను విడిపించండి అంటూ ఇజ్రాయెల్ అభిమానులు నినాదాలు చేశారు. ఈ రెండు ఘటనలపై ఒలింపిక్స్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇజ్రాయె ల్ పై గత ఏడాది అక్టోబరు 7న గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. 200 మందిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నారు. వారిని విడుదల చేయాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ అప్పటినుంచి గాజాపై విరుచుకుపడుతూనే ఉంది. వేలాదిమంది గాజా పౌరులు చనిపోయారు.