Begin typing your search above and press return to search.

యూపీలో వారణాసి స్టేడియం... శివుడి థీం తో సంచలనం!

సుమారు 30.6 ఎకరాల విస్తీర్ణంలో 30,000 కెపాసిటీతో ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా ఈ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. దీని నిర్మాణానికి రూ.400 కోట్ల అంచనా వ్యయం ఫిక్స్ చేశారు.

By:  Tupaki Desk   |   20 Sep 2023 6:42 AM GMT
యూపీలో వారణాసి స్టేడియం... శివుడి థీం తో సంచలనం!
X

ప్రధానంగా భారతదేశంలో క్రికెట్‌ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతీయులు.. క్రికెట్‌ ను ఓ ఆటగా కాకుండా ఓ ఎమోషన్‌ లా భావిస్తారు. అందుకే క్రికెట్ ఆట పుట్టిన ఇంగ్లండ్ కంటే ఎక్కువగా ఇండియాలోనే ఈ ఆటకు ఆదరణ ఏర్పడిందని అంటుంటారు. ఈ ఆదరణను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి పచ్చ జెండా ఊపగా.. తాజాగా నిర్మాణానికి తొలి అడుగులు పడ్డాయి.

అవును... ఉత్తరప్రదేశ్, వారణాసిలోని రాజతలాబ్ ప్రాంతంలో నిర్మించనున్న క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఈ నెల 23న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ స్టేడియం నిర్మాణ కాంట్రాక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ చేజిక్కించుకుంది.

సుమారు 30.6 ఎకరాల విస్తీర్ణంలో 30,000 కెపాసిటీతో ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా ఈ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. దీని నిర్మాణానికి రూ.400 కోట్ల అంచనా వ్యయం ఫిక్స్ చేశారు. ఇక ఈ స్టేడియం పూర్తిచేయడానికి... నిర్మాణం ప్రారంభించిన 30 నెలల సమయం నిర్ధారించారని సమాచరం!

ఇక ఈ స్టేడియం ని శివుడి థీం తో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా డోం, ఢమరుకంలా ఉండగా... ఫ్లడ్ లైట్లు త్రిశూలంలా ఉండనున్నాయి. ఇదే క్రమంలో ఎంట్రns డిజైన్ బెల్పాత్రా మొక్కలతో నిండి ఉండగా... ప్రేక్షకుల కోసం గంగా ఘాట్ మెట్ల వంటి సిటింగ్ ఉండనుంది.

ఈ స్టేడియం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాజతలాబ్ ప్రాంతంలో రైతుల నుండి 31 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అందుకు పరిహారంగా రైతులకు దాదాపు 120 కోట్ల రూపాయలను చెల్లించింది. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం.. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) కు 30 ఏళ్ల లీజుకు ఇవ్వనుంది.

కాగా యూపీలో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్న సంగతి తెలిసిందే. సురేష్ రైనా, కుల్దీప్ యాదవ్, లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా, ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ లతోపాటు అద్భుతమైన బ్యాట్స్‌ మెన్ కం మెరుపు ఫీల్డర్ మహ్మద్ కైఫ్ వంటి ప్రఖ్యాత ఆటగాళ్లు ఉత్తరప్రదేశ్‌ కు చెందినవారే.